5

రిషి కోసం అమ్మలా మారా.. చాలా ట్రిక్స్ ప్లే చేశా: నీతూ

దాదాపు 15 చిత్రాల్లో కలిసి నటించిన రిషి కపూర్, నీతూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రిషి కపూర్ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలో నీతూ ఆయన పక్కనే ఉన్నారు. ఆయన కోలుకోవడానికి ఆమె చాలా ప్రయత్నాలే చేశారు. ముఖ్యంగా రిషిలో నీతూ ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఇక రిషి ట్రీట్‌మెంట్ తీసుకున్న సమయంలో అతడి కోసం అమ్మలా మారానని ఆ మధ్యన ఓ ఇంటర్య్యూలో వెల్లడించారు నీతూ. ”రిషి కోసం నేను అమ్మలా మారా. […]

రిషి కోసం అమ్మలా మారా.. చాలా ట్రిక్స్ ప్లే చేశా: నీతూ
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 5:08 PM

దాదాపు 15 చిత్రాల్లో కలిసి నటించిన రిషి కపూర్, నీతూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రిషి కపూర్ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలో నీతూ ఆయన పక్కనే ఉన్నారు. ఆయన కోలుకోవడానికి ఆమె చాలా ప్రయత్నాలే చేశారు. ముఖ్యంగా రిషిలో నీతూ ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఇక రిషి ట్రీట్‌మెంట్ తీసుకున్న సమయంలో అతడి కోసం అమ్మలా మారానని ఆ మధ్యన ఓ ఇంటర్య్యూలో వెల్లడించారు నీతూ.

”రిషి కోసం నేను అమ్మలా మారా. నా మూడో బిడ్డలా రిషిని చూసుకున్నా. తినిపించడం, పడుకోబెట్టడం, మందులు ఇవ్వడం.. ఇలా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్లుగా చూసుకున్నా. ట్రీట్‌మెంట్ సమయంలో ఆయన అస్సలు తినేవారు కాదు. అది నన్ను చాలా బాధించింది. దీంతో ఆయన తినడం కోసం చాలా ట్రిక్స్ ప్లే చేశా. ఫలానా రెస్టారెంట్‌లో అది బావుంటుంది, ఇది బావుంటుంది అని అక్కడి నర్సులతో చెప్పించేదాన్ని. వారు చెప్పినప్పుడు అవునా.. మనం ట్రై చేద్దామా..? అని నన్ను అడిగేవారు” అని నీతూ కపూర్ చెప్పుకొచ్చింది. కాగా క్యాన్సర్ బారిన పడిన రిషి కపూర్.. తీవ్ర అస్వస్థతకు గురై గురువారం తుదిశ్వాస విడిచారు. బుధవారం ఇర్ఫార్ ఖాన్‌ ఆ తరువాత 24 గంటల్లోనే రిషి కపూర్ కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా యావత్ సినీ ప్రేక్షకులు శోకంలో మునిగిపోయారు.

Read This Story Also:  పవన్‌-నాని-చైతన్య కాంబోలో చిత్రం.. దర్శకుడు ఎవరంటే..!