Shanmukh-Deepthi: ఆ స్పెషల్ రోజున మళ్లీ కలవనున్న లవ్‏బర్డ్స్.. నెట్టింట్లో జోరుగా ప్రచారం.. నిజమేనా మరీ ?

బిగ్‏బాస్ (Bigg Boss) ఇంట్లో ఏమైనా జరగొచ్చు అనేది తెలిసిన విషయమే. అయితే ఈ షో ద్వారా కొందరికి మంచి జరగగా.. మరికొందరికి చేదు జ్ఞాపకాలను

Shanmukh-Deepthi: ఆ స్పెషల్ రోజున మళ్లీ కలవనున్న లవ్‏బర్డ్స్.. నెట్టింట్లో జోరుగా ప్రచారం.. నిజమేనా మరీ ?
Deepthi
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 02, 2022 | 8:20 AM

బిగ్‏బాస్ (Bigg Boss) ఇంట్లో ఏమైనా జరగొచ్చు అనేది తెలిసిన విషయమే. అయితే ఈ షో ద్వారా కొందరికి మంచి జరగగా.. మరికొందరికి చేదు జ్ఞాపకాలను మాత్రమే మిగిలిస్తుంది. ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. అయితే సీజన్ 5లో మాత్రం ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jashwanth ) ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. బిగ్‏బాస్ షో ద్వారా షణ్ముఖ్ క్రేజ్ తగ్గిపోగా.. సంవత్సరాలుగా వెన్నంటే ఉండి ప్రొత్సహించిన ప్రియురాలు కూడా దూరమైంది.

సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్‏బాస్ సీజన్ 5లో షన్నూకు మొదటి నుంచి చివరకు సపోర్ట్ తెలిపిన దీప్తి షో ముగిసిన తర్వాత షన్నూకు బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఇందుకు కారణం బిగ్‏బాస్ ఇంట్లో షణ్ముక్ ప్రవర్తన అనే చెప్పుకొవచ్చు. ఇక బ్రేకప్ అనంతరం ఎవరిదారి వారిదే అన్నట్లుగా వీరిద్దరు ఉంటున్నారు. దీప్తి నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‏గా ఉండగా.. షన్నూ కూడా ఇన్ డైరెక్ట్‏గా సాడ్ స్టేటస్ పెడుతూ వస్తున్నాడు. అయితే దీప్తి.. షణ్ముఖ్ విడిపోవడం.. వారిద్దరి ఫాలోవర్స్‏ను ఎంతగానో బాధించింది. వీరిద్దరూ కలిస్తే బాగుండు అని అనుకున్నారంతా. ఈ క్రమంలోనే దీప్తి ఫాదర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వారిద్దరూ త్వరలోనే కలుస్తారంటూ చెప్పుకొచ్చారు. దీంతో మళ్లీ ఈ జంట కలవబోతుంది అంటూ నెట్టింట్లో తెగ ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా బిగ్‏బాస్ నిర్వాహాకులు మరో ప్లాన్ చేశారట. ఆ రోజు అయిదు సీజన్ల బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ ను ఆహ్వానించి పెద్ద ఉత్సావం చేయబోతున్నట్లుగా టాక్. అయితే ఈ వేడుకకు దీప్తి, షన్నూ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అదే స్టేజీపై వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బిగ్‏బాస్ ఉత్సవం 2022 షూటింగ్ ఎపిసోడ్ జరుగుతున్నట్లుగా.. త్వరలోనే ఇది టెలికాస్ట్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో విడిపోయిన దీప్తి, షణ్ముఖ్ మళ్లీ కలుస్తున్నారు అని సమాచారంతో ఫ్యాన్స్ పుల్ ఖుషి అవుతున్నారు.

Also Read: Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి

Brahmanandam Birthday: సినిమా తెర నుంచి డిజిటల్ పేజీల వరకూ బ్రహ్మాండమంత ఆనందం!

Panja Vaisshnav Tej : మెగా హీరో సినిమానుంచి మూడోవ సినిమా మొదటి సింగిల్ రెడీ అయ్యిందంటా..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!