Brahmamudi, September 24th Episode: ఇంటికి వచ్చి రాజ్‌తో పూజ చేసిన కళావతి.. ఎస్‌ఐ అవ్వనున్న అప్పూ!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఈ జన్మలో మా ఇంటి గడప తొక్కకు అని రాజ్ అంటే.. మరి మా ఇంటి గడప ఎందుకు తొక్కారో.. చెక్కు బుక్ పట్టుకుని మా ఇంటికి వచ్చింది ఎవరో అని కావ్య అంటుంది. ఇలాంటివి అన్నీ తెలుసుకు కానీ.. కాపురం మాత్రం చేయడం రాదని రాజ్ అంటాడు. అవును మరి ఇంతోటి బూత్‌ బంగ్లాలో కాపురం చేయడం ఎవరికీ తెలీదని కావ్య అంటుంది. మధ్యలో బూత్ బంగ్లాను ఎందుకు తీసుకొచ్చావని రాజ్ అంటే.. మీరు ముసుగును తీసుకొచ్చారు కదా అందుకే అని కావ్య అంటుంది. వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే అపనిందలు..

Brahmamudi, September 24th Episode: ఇంటికి వచ్చి రాజ్‌తో పూజ చేసిన కళావతి.. ఎస్‌ఐ అవ్వనున్న అప్పూ!
BrahmamudiImage Credit source: Disney Hotstar
Follow us
Chinni Enni

|

Updated on: Sep 24, 2024 | 12:07 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఈ జన్మలో మా ఇంటి గడప తొక్కకు అని రాజ్ అంటే.. మరి మా ఇంటి గడప ఎందుకు తొక్కారో.. చెక్కు బుక్ పట్టుకుని మా ఇంటికి వచ్చింది ఎవరో అని కావ్య అంటుంది. ఇలాంటివి అన్నీ తెలుసుకు కానీ.. కాపురం మాత్రం చేయడం రాదని రాజ్ అంటాడు. అవును మరి ఇంతోటి బూత్‌ బంగ్లాలో కాపురం చేయడం ఎవరికీ తెలీదని కావ్య అంటుంది. మధ్యలో బూత్ బంగ్లాను ఎందుకు తీసుకొచ్చావని రాజ్ అంటే.. మీరు ముసుగును తీసుకొచ్చారు కదా అందుకే అని కావ్య అంటుంది. వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే అపనిందలు పడాల్సి వస్తుందని అంటే ఏంటో అనుకున్నా.. కానీ ఇప్పుడు తెలుసుందని రాజ్ అంటాడు. చంద్రుడి లాంటి నా ముఖం చూస్తే మీలాంటి వాళ్లకు కూడా మంచే జరుగుతుందని కావ్య అంటే.. నీ ముఖం చంద్రుడిలా ఉంటుందా.. అడ్డంగా పడ్డ బిందెలా ఉంటుంది కానీ సైకిల్ తీయ్ అని రాజ్ అంటాడు. నేను తీయను మీరే ఆ పక్క నుంచి కారు తీసుకుని వెళ్లమని కావ్య డిమాండ్ చేస్తుంది. చేసేది ఏమీ లేక రాజ్ కారు పక్కకు తీసుకెళ్లి వెళ్తాడు.

కావ్య చేసిన వినాయకుడిని కొన్న రాజ్..

ఇక రాజ్ వినాయకుడిని కొనడానికి వెళ్తాడు. అక్కడ ఏమి చూసినా.. రాజ్‌కి నచ్చక కావ్య తయారు చేసిన వినాయకుడిని చూసి ఫిక్స్ అవుతాడు. ఆహా ఈ విగ్రహం ఎంత బాగుంది.. ఇదే కావాలి అని అంటాడు. అప్పుడే విగ్రహాలు అమ్మే అతను వచ్చి ఏం కావాలి అని అడిగితే.. ఇదే విగ్రహం కావాలి అని అంటాడు. అది వేరే వాళ్లు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు సర్.. మీరు వేరేది ఏమన్నా చూసుకోమని చెప్పినా.. రాజ్ వినిపించుకోకుండా ఇదే కావాలి.. ఎంత డబ్బు అయినా ఇస్తానని అంటాడు. డబ్బు వస్తుంది కదా అని ఆ విగ్రహాన్ని రాజ్‌కి ఇస్తాడు.

కావ్యని పూజకు పిలవమన్న ఇందిరా దేవి..

విగ్రహాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టి.. రాజ్ పూజకు అంతా సిద్ధం చేస్తాడు. ఇదిగో నాన్నమ్మా అన్ని పనులు పూర్తి అయిపోయాయి అని రాజ్ అంటాడు. సరే కావ్యకి ఫోన్ చేయమని పెద్దావిడ అంటుంది. ఎందుకు అని రాజ్ షాక్ అవుతాడు. ఈ పూజకు మీ దంపతులే కూర్చోవాలని అంటుంది. అదంతా నాకు ముందే చెప్పలేదని రాజ్ అంటాడు. ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటే నీకు కావ్య గుర్తుకు రాలేదా? పూజకు దంపతులు చేయాలి. నువ్వు ఫోన్ చేయ్.. నేను వెళ్లి తీసుకొస్తానని అపర్ణ అంటుంది. రాజ్ అన్న మాటలకు కావ్య రాకపోతే.. బ్రతిమలాడుకుంటాను.. క్షమించమంటాను అని అంటుంది. అప్పటికీ కావ్య ఒప్పుకోకపోతే.. లాగి పెట్టి రెండు పీకుతానని అంటుంది అపర్ణ. ఎవర్ని వదినా నన్నా అని ప్రకాశం భయపడతాడు. చీఛీ నిన్ను కాదయ్యా ఆ కళావతిని అని అంటుంది అపర్ణ.

ఇవి కూడా చదవండి

పూజ చేయనన్న రాజ్.. ఇంటికి వచ్చిన కావ్య..

నువ్వు ఫోన్ చేయిరా అని సుభాష్ అంటే.. నమస్తే వినాయకా.. నీకో నమస్కారం.. ఈ ఇంట్లో పక్కన భార్య ఉన్నవాళ్లే పూజ చేస్తారట. కాబట్టి నేను ఒక దండం.. రెండు గుంజిళ్లు తీయగలనని రాజ్ మీ అందరూ కూర్చోమని అంటాడు. రాజ్.. ఆ రాముడే కాంచన సీతను పక్కన పెట్టుకుని పూజ చేశాడు రా.. నువ్వు ఎంత రా అని ఇందిరా దేవి అంటుంది. నాకు కూడా ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నేను పిలవను గాక పిలవనని రాజ్ మొండి పట్టు పడతాడు. దీంతో రుద్రాణి హమ్మయ్యా అని అనుకుంటుంది. వాడికి భార్య విలువ.. ఆ బంధం విలువ ఇంకా తెలిసి రాలేదని సీతారామయ్య అంటాడు. సరే వ్రతాలు, నోములు చేసేటప్పుడు.. భార్య లేదా భర్త పక్కన లేకపోయినా.. అనారోగ్యంతో ఉన్నా జీవిత భాగస్వామి బట్టలు పక్కన పెట్టుకుని పూజలు చేయవచ్చని శాస్త్రం చెబుతుంది. సో నువ్వు కావ్య చీరను పక్కన పెట్టుకుని పూజ చేయమని ఇందిరా దేవి అంటుంది. కుదరదని రాజ్ అంటే.. ఇందిరా దేవి భయ పెడుతుంది. దీంతో తప్పక పీటల మీద కూర్చొంటాడు.

రాజ్, కావ్యలను చూసి మురిసిపోయిన అపర్ణ..

ఇక వినాయకుడిని చూడగానే అందరూ మురిసిపోతారు. స్వప్న కావ్య చీరను తీసుకొచ్చి పక్కన పెడుతుంది. కావ్య చీరను పక్కన చూడగానే కావ్య పక్కన వచ్చి కూర్చున్నట్టు రాజ్‌కు అనిపిస్తుంది. అలాగే కావ్య చీరను చూసిన అపర్ణకు కూడా కావ్య కూర్చున్నట్టు.. పూజ చేసినట్టు అనిపిస్తుంది. కావ్య, రాజ్‌ను కళ్లారా చూసినట్టు మురిసిపోతూ ఉంటుంది అపర్ణ. రాజ్ కథ చదువుతూ మొత్తం పూజ పూర్తి చేస్తాడు. స్వప్న హారతి ఇవ్వడం చూసి కావ్య అనుకుని భ్రమ పడుతుంది అపర్ణ. ఆ తర్వాత కావ్యని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

అప్పూని ఎస్ఐ అవ్వమన్న కళ్యాణ్..

మరోవైపు కళ్యాణ్, అప్పూ, బంటీలు కూడా కలిసి పూజ చేస్తారు. నువ్వు లేకపోతే పూజ చేయడానికి చాలా ఇబ్బంది అయ్యేదని కళ్యాణ్ అంటాడు. నేను అంతే బావా.. అందరికీ సహాయం చేస్తానని అంటాడు బంటీ. ఆ తర్వాత అప్పూ, బంటీలు ఇద్దరూ గొడవ పడతారు. ఇక ఆపండి అని అప్పూకి గిఫ్ట్ ఇస్తాడు కళ్యాణ్. అది చూసి అప్పూ ఎమోషనల్ అవుతుంది. ఇది నీ కళ.. నువ్వు మళ్లీ ఎస్ఐ ట్రైనింగ్ తీసుకోవాలని కళ్యాణ్ అంటాడు. నిన్న అనామిక అన్న మాటలకు ఇదంతా చేస్తున్నావా అని అప్పూ అంటే.. లేదు తను నా బాధ్యత ఏంటో తెలిసేలా చేసిందని కళ్యాణ్ అంటాడు. అయినా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది కదా.. ఇవన్నీ అవసరమా అని అప్పూ అంటుంది. వీటన్నింటి గురించి మర్చిపో.. నేను చూసుకుంటానని కళ్యాణ్ అంటాడు. కట్ చేస్తే.. దుగ్గిరాల ఇంటికి కనకం వస్తుంది. వదిన గారూ నమస్కారం అని అంటుంది. అపర్ణ ఎంతో సంతోష పడుతూ.. కావ్య వచ్చిందేమోనని చూస్తుంది. కనకం దేవుడికి నమస్కారం చేస్తూ.. కింద ఉన్న కావ్య చీరను చూస్తుంది. ఏంటీ పిలవని పేరంటానికి వచ్చావని రుద్రాణి పుల్ల పెడుతుంది. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..