Brahmamudi, October 3rd Episode: అడ్డంగా బుక్కైపోయిన కావ్య.. ప్రేమ చచ్చిపోయిందన్న రాజ్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌కు వెళ్లి కంగ్రాట్స్ చెప్పి, సారీ చెప్పమని కావ్యకు చెబుతుంది స్వప్న. ఇంతకు ముందు మా మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. నేనే చాలా సార్లు సర్దుకుని క్షమించమని అడిగాను. కానీ కుటుంబం కోసమే కలిసి ఉంటున్నానని చెప్పిన భర్తతో మాట్లాడగలుగుతుందా.. నువ్వు చెప్పడం కాదు అక్కా.. ఆయన మనసులో నేను ఉన్నానని చెప్పమను. ఇప్పుడే ఆయనకు క్షమాపణ అడిగి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌కు వెళ్లి కంగ్రాట్స్ చెప్పి, సారీ చెప్పమని కావ్యకు చెబుతుంది స్వప్న. ఇంతకు ముందు మా మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. నేనే చాలా సార్లు సర్దుకుని క్షమించమని అడిగాను. కానీ కుటుంబం కోసమే కలిసి ఉంటున్నానని చెప్పిన భర్తతో మాట్లాడగలుగుతుందా.. నువ్వు చెప్పడం కాదు అక్కా.. ఆయన మనసులో నేను ఉన్నానని చెప్పమను. ఇప్పుడే ఆయనకు క్షమాపణ అడిగి.. మా అత్తగారి కాళ్లు పట్టకుని మనస్ఫూర్తిగా అడుగుతానని కావ్య అంటుంది. ఏంటోనే ఇటు నీటూ.. అటు రాజ్‌కు చెప్పలేక పోతున్నా.. అసలు ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుందో ఏంటోనని స్వప్న అనుకుకుంటుంది. మరోవైపు ఎక్స్ పోకి సంబంధించిన న్యూస్ అంతా లైవ్‌లో వస్తుంది. అదంతా అపర్ణ వాళ్లు కూడా చూస్తూ ఉంటారు.
ఉలిక్కి పడ్డ కావ్య.. షాక్‌లో కావ్య..
సస్పెన్స్ చేస్తూ.. ఈ ఎక్స్‌పోలో అవార్డు గెలుచుకుంది సామంత్ కంపెనీ అని అనౌన్స్ చేస్తారు. అది విని రాజ్, కావ్య, అపర్ణలు షాక్ అవుతారు. ఇక సామంత్ ఎంతో సంతోషిస్తాడు. స్టేజ్ ఎక్కుతాడు. నాకు ఇప్పటికీ ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నేను ఈ నెంబర్ 1 పొజిషన్‌కి రావడానికి చాలా ఏళ్లు పట్టింది. ఈ ఎక్స్‌పోలో మా సంస్థకు అవార్డ్ వస్తుందని అనుకోలేదు. ఈ రోజు నేను సాధించిన విజయం వెనుక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మొదటి స్త్రీ.. అనామిక అని చెప్పగానే అందరూ ఆశ్యర్యానికి గురవుతారు. అనామిక కూడా స్టేజ్ పైకి వెళ్తుంది. దీంతో అనామికను పెళ్లి చేసుకుంటున్నట్టు చెబుతాడు సామంత్. అలాగే నా విజయానికి కారణం అయిన రెండో స్త్రీ.. మా క్రియేటివ్ డిజైనర్ మిసెస్ కావ్య అని చెప్తాడు. అది విని రాజ్ అలాగే ఉండిపోతాడు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు. కావ్య కూడా ఉలిక్కి పడుతుంది. ఇక బలవంతంగా కావ్యని స్టేజ్ పైకి పిలుస్తారు సామంత్, అనామికలు. నేను ఈ అవార్డ్ నేను తీసుకోను.. నేను వెళ్లను.. వాళ్ల ఏడుపేదో వాళ్లను ఏడవమని అంటూ కావ్య సురేష్‌తో గొడవ పడుతుంది.
కావ్య ప్రత్యర్థి కంపెనీకి పని చేయడం ఏంటి?
ఇక తప్పదు అన్నట్టుగా ఇబ్బందిగా స్టేజ్ పైకి వెళ్తుంది కావ్య. రాజ్ కోపంగా కావ్య వైపు చూస్తాడు. పైకి వెళ్లిన కావ్య.. ఇందంతా నువ్వే కావాలని చేశావా అని అనామికను అంటుంది. అనామిక పొగరుగా ఉంటుంది. ఈ అవార్డ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతీసారి ఈ అవార్డ్ దుగ్గిరాల కంపెనీకే వెళ్తుంది. కానీ ఈసారి మాకే రావాలని కష్టపడి డిజైన్స్ వేసిందని అనామిక అంటుంది. ఆ తర్వాత సామంత్ చేతుల మీదుగా కావ్య అవార్డ్ అందుకుంటుంది. ఇదే అదునుగా.. రాజ్‌కు పొగ పెడుతుంది రుద్రాణి. కావాలనే టైమ్‌కి కరెక్ట్ దెబ్బ కొట్టిందని అంటుంది. కావ్య మన ప్రత్యర్థి కంపెనీ అయిన సామంత్ గ్రూప్‌కి పని చేయడం ఏంటి? నేను అస్సలు నమ్మలేకపోతున్నా అని అపర్ణ అంటుంది. మన కళ్ల ముందే కనిపిస్తున్నా నమ్మలేక పోవడం ఏంటి. ఇప్పటికైనా నువ్వు కళ్లు తెరుచుకో.. ఎవరు ఎలాంటి వారో తెలుసుకో అక్కా అని ధాన్య లక్ష్మి అంటుంది. చాలు ఆపు.. కావ్య ఎలాంటి మనిషో అందరికీ తెలుసు. ఈ పని చేసిందంటే ఎవ్వరూ నమ్మరు. అక్కడ ఏదో తప్పు జరిగిందని ప్రకాశం అంటే.. నాకు కూడా అదే అనిపిస్తుందని పెద్దావిడ కూడా అంటుంది.
అడ్డంగా బుక్ అయిపోయిన కావ్య.. నమ్మని రాజ్..
మరోవైపు కావ్యని మీడియా టార్గెట్ చేస్తుంది. మీరు దుగ్గిరాల ఇంటి కోడలు అయి ఉండి.. ప్రత్యర్థి కంపెనీకి పని చేయడం ఏంటి? మీరు మీ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం ఉందా? రాజ్ మీరు ఎందుకు విడిపోయారు? మీరు అనామికతో కావాలనే చేతులు కలిపారా? అని మీడియా ప్రశ్నలు కురిపిస్తుంది. దీంతో కావ్య ఏమీ అర్థంకాక ఏడుస్తూ వెళ్లిపోతుంది కావ్య. డోర్ పక్కన నిలబడి కావ్య ఏడుస్తుంది. ఇంకా ఇక్కడ ఉంటే గొడవ అయ్యేలా ఉంది.. వెంటనే వెళ్లిపోవే అని స్వప్న అంటుంది. అప్పుడే రాజ్, సుభాష్‌లు వస్తారు. కంగ్రాట్స్.. నీకు మాటకు మాట జవాబు చెప్పడమే తెలుసు అనుకున్నా.. కానీ నీలో ఇంకా చాలా కళలు ఉన్నాయని ఇవాళే అర్థం అయ్యింది. నీకూ అనామికకు ఏమాత్రం తేడా లేదు. నీ నిజ స్వరూపం ఏంటో తెలుసుకోలేక పోయాను. ఇది నేనే కళ్లారా చూసిన సాక్ష్యమని రాజ్ అంటాడు. మీరు చూసింది ఏదీ నిజం కాదని.. కావ్య చెప్పినా వినిపించుకోడు. ఇక ఇప్పటితో నీ మీద ఉన్న ప్రేమ కూడా పోయింది అంటాడు రాజ్. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..