Brahmamudi, August 31st Episode: కావ్యకు రాజ్ వార్నింగ్.. శ్రుతిని రంగంలోకి దించిన కళావతి!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రుద్రాణి, రాహుల్‌లు వేసిన స్కెచ్ మొత్తానికి సక్సెస్ అయ్యింది. కావ్య, రాజ్‌లను దూరం చేయాలని అనుకుని రుద్రాణి, రాహుల్‌లు కలిసి డ్రామా స్టార్ట్ చేస్తారు. అది నిజం అనుకుని కావ్య, స్వప్నలను పప్పులో కాలు వేస్తారు. ఆ గొడవ కాస్తా పెద్దగా మారడంతో.. కావ్యను పక్కకు తీసుకెళ్లి రాజ్ క్లాస్ పీకుతాడు. ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి చిన్న గొడవలు వచ్చినా అది తుఫానుగా మారుతుంది. నీ కోసం నా కుటుంబ సభ్యులను వదులుకోను. కొన్ని చూసీ చూడనట్లు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రుద్రాణి, రాహుల్‌లు వేసిన స్కెచ్ మొత్తానికి సక్సెస్ అయ్యింది. కావ్య, రాజ్‌లను దూరం చేయాలని అనుకుని రుద్రాణి, రాహుల్‌లు కలిసి డ్రామా స్టార్ట్ చేస్తారు. అది నిజం అనుకుని కావ్య, స్వప్నలను పప్పులో కాలు వేస్తారు. ఆ గొడవ కాస్తా పెద్దగా మారడంతో.. కావ్యను పక్కకు తీసుకెళ్లి రాజ్ క్లాస్ పీకుతాడు. ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి చిన్న గొడవలు వచ్చినా అది తుఫానుగా మారుతుంది. నీ కోసం నా కుటుంబ సభ్యులను వదులుకోను. కొన్ని చూసీ చూడనట్లు వదిలేయాలి. అసలు నువ్వెందుకు అన్ని విషయాల్లో తలదూర్చుకుంటున్నావ్? ఇంట్లో గొడవలకు నువ్వే కారణం అవుతావని రాజ్ తిడతాడు. అందరి కోసం నన్ను వదులు కుంటారా? నేను కూడా ఈ ఇంట్లో ఒక సభ్యురాలినే. నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. రాహుల్ ఈ ఇంటిని ఎప్పుడు దోచుకు తిందామా అని చూస్తాడు. మీ అత్త ఇంట్లో వాళ్లను ఎప్పుడు విడగొడదామా అని చూస్తుంది. వాళ్ల కోసం నన్ను అంటున్నారేంటి? అని కావ్య అడుగుతుంది.
నన్ను చెడ్డదాన్ని చేయడానికే ఈ ప్లాన్స్..
ఇప్పటి దాకా జరిగినవన్నీ వదిలేయ్. ఇక నుంచి మాత్రం ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలి. ఏది జరిగినా నేను నిన్ను క్షమించను గుర్తు పెట్టుకోమని రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత గదిలోకి వచ్చి కావ్య చాలా బాధ పడుతూ ఉంటుంది. అప్పుడే స్వప్న వచ్చి.. సారీనే ఇదంతా నా వల్ల నువ్వు మాటలు పడ్డావు. రాజ్ ఏమన్నా అన్నాడా? అని అడుగుతుంది. ఇంత జరిగిన తర్వాత ఏమీ అనకుండా ఉంటాడా? ప్రపంచంలో ఎవరు తప్పు చేసినా క్షమిస్తారు కానీ.. కట్టుకున్న భార్య తప్పు చేస్తే మాత్రం.. జింక పిల్ల కోసం వేచి చూస్తున్న పులిలా దాడి చేస్తారు. ఛా రాహుల్ గురించి తెలిసి కూడా నేను తొందర పడ్డానని కావ్య అంటుంది. నిజంగానే రాహుల్ మాట్లాడటం నేను విన్నానే. అసలు మనం ఇలా అడుగుతామని వాళ్లకు ఎలా తెలిసిందని స్వప్న అంటే.. నీకు ఇంకా అర్థం కాలేదా? కావాలనే ఇంట్లో వాళ్ల ముందు నన్ను చెడ్డదాన్ని చేయడానికి ఇలా చేశారు. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ.. నువ్వు చెకప్‌కి వెళ్లాలి కదా మర్చిపోయావా పదా వెళ్దామని కావ్య అంటుంది.
రాహుల్‌పై కన్నేసి ఉంచమన్న కావ్య..
కట్ చేస్తే.. కావ్య శ్రుతికి కాల్ చేస్తుంది. రాహుల్ ఆదివారం కూడా నాకు పని చెప్పి తన పక్కనే కూర్చొబెట్టు కుంటున్నాడు. ఎప్పుడు నాకు ట్రై చేస్తూనే ఉంటున్నాడు. రాజ్ సర్ ఎప్పుడు వస్తారో అని శ్రుతి బాధ పడుతూ ఉంటుంది. సరే నీకో విషయం చెప్పాలి. రాహుల్ మీద ఓ కన్ను వేసి ఉంచమని అసలు విషయం చెబుతుంది కావ్య. సరే మేడమ్ అని శ్రుతి అంటుంది. ఆ తర్వాత ఆఫీస్‌కి సంజయ్ వస్తాడు. అప్పుడే శ్రుతి వచ్చి ఫైల్ ఇచ్చి వెళ్తుంది. కావ్య మాటలు గుర్తుకు వచ్చి అక్కడే నిల్చుని ఉంటుంది. దీంతో శ్రుతిని పంపించేస్తాడు. రాహుల్ మనం దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్నా దొంగ బంగారం అని నీకు తెలుసు కదా.. మళ్లీ వాటికి అగ్రిమెంట్స్ ఎందుకు అని అడుగుతాడు సంజయ్. కంపెనీ నుంచి నేరుగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే అనుమానం వస్తుంది. అందుకే ఒక ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి దానికి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఆ తర్వాత ఏం జరిగినా అది రాజ్ మీదకు వెళ్తుందని చెప్తాడు. ఇక వీళ్లిద్దరి డీల్ ఓకే అవుతుంది.
ఆటోలో కళ్యాణ్.. మొదటి బేరం బాగానే ఉందిగా..
కట్ చేస్తే.. కావ్య, స్వప్నలు కారులో వస్తూ ఉంటారు. నీకు బీపీ ఎక్కువైంది. ఇలాగే కంటిన్యూ అయితే కాన్పు కష్టం అవుతుందని డాక్టర్ చెప్పిన దగ్గర నుంచి నాకు కంగారుగా ఉందని కావ్య అంటే.. ఏం చేయమంటావే.. నా మొగ్గు, అత్తకు సమాధానం చెప్పాలంటే ఇలాగే ఉండాలి. నేను అత్తకు యముడు.. నా మొగుడికి మొగుడు అని అంటుంది. అప్పుడే కారు ఆగిపోతుంది. ఏదో ప్రాబ్లమ్ ఉందని డ్రైవర్ చెప్తాడు. దీంతో ఇద్దరూ ఆటోలో వెళ్దామని బయలు దేరతారు. అప్పుడే కళ్యాణ్ ఆటోలో ఉంటాడు. మొదటిసారి ఆటో నడుపుతున్నా మంచి బోణీ దొరకాలని కళ్యాణ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కావ్య, స్వప్నలు రావడం చూసి.. కళ్యాణ్ కర్చీఫ్ అడ్డం పెట్టుకుంటాడు. హలో రేపటి కోసం.. మాకు ఇవాళ్టి కోసం ఆటో కావాలి వస్తావా? అని కామెడీగా స్పప్న అడుగుతుంది. సరే అని కళ్యాణ్ అంటాడు. ఇద్దరూ ఆటోలో కూర్చుని వెళ్తారు. నాకు కళ్యాణ్‌పై బాగా మంటగా ఉందని స్వప్న అంటే.. మధ్యలో కవి గారు ఏం చేశారని కావ్య అంటుంది. కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోవడం వల్లనే కదా.. ఇప్పుడు నా మొగుడు కంపెనీలో కూర్చుని ఫ్రాడ్ చేస్తున్నాడు. మా అత్త, మీ చిన్న అత్త మాటలు పడలేకనే రాలేదని స్వప్న అంటే.. కాదు అప్పూ మాటలు పడాల్సి వస్తుందని రాలేదని కావ్య అంటుంది. అయినా పాపం వాళ్లు ఎక్కడ ఉన్నారో.. ఎన్ని కష్టాలు పడుతున్నారో.. ఏం చేస్తున్నారో అని స్వప్న అంటుంది.
ఇక్కడే ఆగిపోకండి.. ముందుకు వెళ్లాలి..
ఆ తర్వాత ఇంటి దగ్గర ఆటో ఆగుతుంది. కావ్య డబ్బులు తీస్తూ ఉండగా.. కళ్యాణ్ కర్చీఫ్ కావ్య కాళ్ల దగ్గర పడేసి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఎంత అని అడగలేదు.. ఎంత అని చెప్పలేదు. ఎక్కడికి అని నువ్వూ అడగలేదు.. మేమూ చెప్పలేదు. అప్పుడే కావ్య ఓ కవిత చెబుతుంది. దీంతో కళ్యాణ్ కర్చీఫ్ విప్పేసి.. చూస్తాడు. ఇప్పుడు మీకు మీరే అన్వయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు బ్రతకడం నేర్చుకోవాలి. మంచిదే.. కానీ మీకు నచ్చినట్టు కూడా బ్రతకాలి. నడిచి పోతుంది కదా అని ఇక్కడే ఆగిపోకండి.. ముందుకు వెళ్లమని కావ్య సలహా ఇస్తుంది. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.