Maanas Nagulapalli: బుల్లి మానస్ వచ్చేశాడు.. తండ్రైన ‘బ్రహ్మముడి’ రాజ్.. అభినందనల వెల్లువ
బిగ్ బాస్ మాజీ కంటెస్టెట్, బ్రహ్మముడి సీరియల్ నటుడు మానస్ నాగుల పల్లి శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మంగళవారం (సెప్టెంబర్ 10) ఉదయం తన భార్య సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మానస్ మరి కొద్ది సేపటికే తాను తండ్రినయ్యానన్న గుడ్ న్యూస్ చెప్పాడు
బిగ్ బాస్ మాజీ కంటెస్టెట్, బ్రహ్మముడి సీరియల్ నటుడు మానస్ నాగుల పల్లి శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మంగళవారం (సెప్టెంబర్ 10) ఉదయం తన భార్య సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మానస్ మరి కొద్ది సేపటికే తాను తండ్రినయ్యానన్న గుడ్ న్యూస్ చెప్పాడు. తన సతీమణి శ్రీజ నిశ్వంకర పండంటి మగ బిడ్డను ప్రసవించినట్లు ‘బేబీ బాయ్’ అంటూ ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మానస్, శ్రీజ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఏడాది నవంబర్ లో మానస్, శ్రీజల వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తమ దాంపత్య బంధానికి ప్రతీకగా తాము తల్లిదండ్రులం కానున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించారీ లవ్లీ కపుల్. ఆ తర్వాత శ్రీజ బేబీ బంప్ ఫొటోలను కూడా తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు మానస్. ఇటీవలే శ్రీజకు ఘనంగా సీమంతం నిర్వహించగా, ఆ ఫొటోలను కూడా నెట్టింట షేర్ చేసుకోగా తెగ వైరలయ్యాయి.
ఇక ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు మానస్ నాగుల పల్లి. ఇందులో అతను పోషించిన రాజ్ పాత్ర బాగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం టీవీల్లో టాప్ రేటింగ్ తో బ్రహ్మముడి సీరియల్ దూసుకుపోతోంది. అంతకు ముందు ‘కోయిలమ్మ’, ‘మనసిచ్చిచూడు’ వంటి సీరియల్స్‌తోనూ బుల్లితెర ప్రేక్షకులకు చేరవయ్యాడు. అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లోనూ ఎంట్రీ ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఆ తర్వాత ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘నీతోనే డాన్స్ 2.0 షో లో నూ ఫైనల్ కు చేరుకుని తన మల్టీ ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. కాగా కెరీర్ ప్రారంభంలో కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు మానస్. అలాగే కొన్ని మూవీస్ లో స్పెషల్ రోల్స్ కూడా పోషించాడు.
భార్య శ్రీజతో మానస్ నాగుల పల్లి..
View this post on Instagram
రొమాంటిక్ లుక్ లో మానస్ – శ్రీజ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.