AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, June 5th Episode: మాయని కళావతి కాపాడుతుందా.. రాజ్ సహాయం చేయనున్నాడా?

బ్రహ్మముడి ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతుంది. ఎన్నో ట్విస్టులు, సస్పెన్సుల మధ్య ఈ సీరియల్ రన్ అవుతుంది. ఈ సీరియల్‌కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇవాళ్టి బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళావతి మళ్లీ ఎలాంటి కొంప ముంచుతుందా అని రాజ్ కావ్య, అప్పూలను ఫాలో అవుతూ ఉంటాడు. రాజ్ దగ్గర నుంచి ఎలాగోలా తప్పించుకోవడానికి కావ్య, అప్పూలు ట్రై చేస్తారు. మొత్తానికి రాజ్ దగ్గర నుంచి తప్పించుకుని..

Brahmamudi, June 5th Episode: మాయని కళావతి కాపాడుతుందా.. రాజ్ సహాయం చేయనున్నాడా?
Brahmamudi
Chinni Enni
|

Updated on: Jun 05, 2024 | 12:27 PM

Share

బ్రహ్మముడి ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతుంది. ఎన్నో ట్విస్టులు, సస్పెన్సుల మధ్య ఈ సీరియల్ రన్ అవుతుంది. ఈ సీరియల్‌కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇవాళ్టి బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళావతి మళ్లీ ఎలాంటి కొంప ముంచుతుందా అని రాజ్ కావ్య, అప్పూలను ఫాలో అవుతూ ఉంటాడు. రాజ్ దగ్గర నుంచి ఎలాగోలా తప్పించుకోవడానికి కావ్య, అప్పూలు ట్రై చేస్తారు. మొత్తానికి రాజ్ దగ్గర నుంచి తప్పించుకుని.. కావ్య, అప్పూలు తప్పించుకుంటారు. ఆ వెంటనే వీళ్లను రుద్రాణి కూడా ఫాలో అవుతుంది. ఆ విషయం కళావతికి తెలీదు. ఇక అనుకున్నట్టుగానే అప్పూ, కావ్యలు ఇద్దరూ మాయ ఇంటికి వస్తారు. మాయ ఏదని ఇంట్లో ఉన్న తన ఫ్రెండ్ సాహితీని అడుగుతారు. ఈలోపు మాయ వస్తుంది.

మాయని కారుతో గుద్దిన రుద్రాణి..

సరిగ్గా సరైన సమయానికి మాయ రావడంతో.. కావ్య, అప్పూలు సంతోషపడతారు. వెంటనే మాయను ప్రశ్నించడం మొదలు పెడతారు. అదంతా దొంగ చాటుగా రుద్రాణి వింటూ ఉంటుంది దీంతో మాయ కంగారు పడుతూ పారిపోతుంది. తనని పట్టుకోవడానికి కావ్య, అప్పూలు వెళ్తారు. అసలు మాయని పట్టుకోవడానికి రుద్రాణి కూడా వెళ్తుంది. అప్పుడే తన కారుతో మాయని గుద్ది యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ కావడంతో మాయ పక్కకు ఎగిరి పడుతుంది.

ఈ మాయ అసలు మాయేనా..

అదంతా చూసిన కావ్య, అప్పూలు షాక్ అవుతారు. మాయని లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే మాయ స్పృహ కోల్పోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి రాజ్ వచ్చి హెల్ప్ చేస్తాడా? అసలు ఈ మాయ అసలు మాయేనా? అసలు మాయే అయితే.. మరి కళావతి పరిస్థితి ఏంటి? అనేది చాలా సస్పెన్స్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కనకం ఎంట్రీ ఇస్తుందా..

మాయ కోసం వెళ్లినప్పుడల్లా కావ్యకు అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసలు అసలు మాయ ఉందా? లేక రాజ్ ఏమైనా నాటకం ఆడుతున్నాడా? రాజ్, మాయల పెళ్లి జరిగిపోతుందా? కనకం వచ్చి ట్విస్ట్ ఇస్తుందా? ఇలా బ్రహ్మముడి ఎపిసోడ్‌ని ఎంతో సస్పెన్స్‌గా కొనసాగిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. ఏం జరిగినా.. కావ్యకు అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నారు. మొత్తానికి ఎన్నో ట్విస్టుల మధ్య ఎంతో ఆసక్తిగా కొనసాగుతుంది బ్రహ్మముడి సీరియల్.