AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బుల్లితెరను ఏలేస్తోన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? టాలీవుడ్ లేడీ బ్రహ్మానందం..

ఇన్నాళ్లు బుల్లితెరపై ఓ కామెడీ షోలో అలరించిన ఆ అమ్మాయి.. ఇటీవలే ఓటీటీలో వెబ్ సిరీస్ ద్వారా తానేంటో నిరూపించికుంది. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బిగ్ స్క్రీన్ పై ఈ అమ్మాయి కనిపిస్తే చాలు అన్న రేంజ్‏కు వెళ్లిపోయింది. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు బుల్లితెరను ఏలేస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: బుల్లితెరను ఏలేస్తోన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? టాలీవుడ్ లేడీ బ్రహ్మానందం..
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2024 | 6:26 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. తమ నటన, కామెడీ పంచులతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా మేల్ కమెడియన్స్ ఉన్నారు. చాలా తక్కువ మంది ఫీమేల్ కమెడియన్స్ ఉన్నారు. కోవై సరళ, రమా ప్రభ, పావలా శ్యామల, గీతాంజలి, శ్రీలక్ష్మి, గీంతా సింగ్, తెలంగాణ శకుంతల , విద్యుల్లేఖ రామన్ తమ నటనతో నవ్వులు పూయించారు. కానీ ఇప్పుడు ఓ నటి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బుల్లితెర, వెండితెరపై తన కామెడీ పంచులతో జనాలను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇన్నాళ్లు బుల్లితెరపై ఓ కామెడీ షోలో అలరించిన ఆ అమ్మాయి.. ఇటీవలే ఓటీటీలో వెబ్ సిరీస్ ద్వారా తానేంటో నిరూపించికుంది. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బిగ్ స్క్రీన్ పై ఈ అమ్మాయి కనిపిస్తే చాలు అన్న రేంజ్‏కు వెళ్లిపోయింది. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు బుల్లితెరను ఏలేస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? తను మరెవరో కాదు.. తన నటన.. కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తున్న ముద్దుగుమ్మ రోహిణి రెడ్డి. అదేనండి జబర్దస్త్ రోహిణి.

విశాఖపట్నంలో పుట్టి పెరిగిన రోహిణి నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చేసింది. ఆ తర్వాత కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది. ఇందులో అమాయకమైన అమ్మాయిగా.. తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సీరియల్ ద్వారా రోహిణి తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ తర్వాత రవికృష్ణ నటించిన శ్రీనివాస కళ్యాణం సీరియల్లో నటించింది. ఇందులో రోహిణి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇవే కాకుండా ఇన్ స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ చేసింది. అలాగే 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది.

కానీ ఈ షోలో కేవలం నాలుగు వారాలో ఉంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రోహిణి కామెడీ షో జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది. అక్కడ తన కామెడీ టైమింగ్ తో నవ్వించింది. తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ అయ్యింది. జబర్దస్త్ షో చేస్తూనే ఇటు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు, మత్తు వదలరా, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. హ్యాపీ బర్త్ డే, హనుమాన్ సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సేవ్ ది టైగర్స్ రోహిణి కెరీర్ ను మలుపు తిప్పింది. ఇందులో రోహిణి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. సీజన్ 1, 2లలో రోహిణి, అభినవ్ గోమఠం మధ్య వచ్చే సీన్లకు ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు.

View this post on Instagram

A post shared by Rohini (@actressrohini)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్