Brahmamudi, February 5th episode: రాజ్‌పై రుద్రాణి కన్ను.. కావ్యకు నిజం చెప్పేయమన్న శ్వేత!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూ సాహసం చేసి మరీ కిడ్నాప్ అయిన పాప దగ్గరకు వస్తారు. తాళ్లు విప్పి నెమ్మదిగా పాపను తీసుకెళ్దామని అనుకుంటారు. కానీ ఇంతలో రౌడీలు అడ్డు పడతారు. నా దగ్గర డబ్బు లేదు వదిలేయండని పాప తల్లి చెబుతున్నా.. రౌడీలు వినిపించుకోరు. ఇంతలో సరైన సమయానికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నార్రా భాయ్.. ఫైట్ చేసి కాపాడటానికి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూ సాహసం చేసి మరీ కిడ్నాప్ అయిన పాప దగ్గరకు వస్తారు. తాళ్లు విప్పి నెమ్మదిగా పాపను తీసుకెళ్దామని అనుకుంటారు. కానీ ఇంతలో రౌడీలు అడ్డు పడతారు. నా దగ్గర డబ్బు లేదు వదిలేయండని పాప తల్లి చెబుతున్నా.. రౌడీలు వినిపించుకోరు. ఇంతలో సరైన సమయానికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నార్రా భాయ్.. ఫైట్ చేసి కాపాడటానికి.. మిమ్మల్ని కొట్టి మీకేమైనా అయితే నేను కూడా జైలుకు వెళ్లాలి. మీ కోసం నా లైఫ్ రిస్క్ చేస్తా అని అప్పూ పంచ్ డైలాగ్ ఇస్తుంది. వెరీ గుడ్ అమ్మా.. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా.. పాప ప్రాణాల్ని రిస్క్‌లో పడేయకుండా బాగా కాపాడావ్ అని అప్పూని పొగుడుతాడు. మీలాంటి వాళ్లు మా డిపార్ట్‌మెంట్‌లో ఉండాలి అని చెప్పి వెళ్లి పోతారు.
కావ్యను చూసి ఆశ్చర్యపోయిన రాజ్..
ఈ సీన్ కట్ చేస్తే.. శృతిని రాజ్ తిడుతూ ఉంటాడు. అప్పుడే కావ్య హీరోయిన్‌లా ఎంట్రీ ఇస్తుంది. కళావతి కారు దిగడం.. నడుచుకుంటూ రావడంతో రాజ్ ఒక్క క్షణం అలానే చూస్తూ ఉండి పోతాడు. చేతిలోని డిజైన్స్ కూడా చేజార్చుకుంటాడు. అప్పుడే ఓ సాంగ్ కూడా ప్లే అవుతుంది. దగ్గరకు వచ్చిన కావ్య.. పడిపోయారా? అని అడుగుతుంది. ఏంటి? అని రాజ్ కోపంగా అంటాడు. అదే పేపర్స్ అన్నీ పడేసుకున్నారా అని అడుగుతున్నా అని అంటాడు. చాలా గ్లామరస్‌గా కనిపిస్తున్నారు మేడమ్ అని శృతి అనగానే.. వెళ్లి నీకు ఏ పని చెప్పానో అది చూడు అని సీరియస్ అవుతాడు రాజ్.
శ్వేతను మళ్లీ ఆఫీస్‌కి రమ్మన్న రాజ్..
ఆ తర్వాత రాజ్ వెనుకే కావ్య నడుచుకుంటూ వెళ్తుంది. కావ్యను చూసిన ఆఫీస్ స్టాఫ్.. మేడమ్.. ఈ లుక్‌లో మీరు సూపర్ ఉన్నారు అని అంటారు. దాని రాజ్ జెలసీ ఫీల్ అవుతాడు. రాజ్ క్యాబిన్‌లోకి వెళ్లిన రాజ్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటడు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని కావ్య అడుగుతుంది. టెడ్డీ బేర్‌కి ట్రెండీ వేర్ తొడిగినట్టు ఉన్నావ్.. ఇంట్లో నుంచి బయటకు రాగానే కుక్కలు ఏం వెంట పడలేదా.. డ్రెస్ మారినంత మాత్రానా.. మనిషి మారాలని రూల్ లేదని రాజ్ అంటాడు. మీరు ఇన్ని పేర్లు పెట్టినప్పుడే అసూయ పడుతున్నారని అర్థమైంది. తొందర్లేనే మీకూ నచ్చుతుంది. అంతవరకూ వెయిట్ చేస్తాను. వస్తాను డియర్ అని కావ్య వెళ్తుంది. దీంతో రాజ్ చిరాకు పడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పడే రాజ్‌కి శ్వేత కాల్ చేసి కలుద్దాం అన్నావ్.. మర్చిపోయావా అని అడుగుతుంది. ఎక్కడో ఎందుకు ఇక్కడికే రా అని చెప్తాడు రాజ్ కావాలనే.
రాజ్‌పై ఓ కన్నేసి ఉంచమన్న రుద్రాణి..
రుద్రాణి ఇంటి బయట తిరుగుతూ ఉంటుంది. రుద్రాణి దగ్గరకు వచ్చిన రాహుల్.. మామ్ నువ్వు చెప్పినట్టే ఆఫీస్‌కి ఫోన్ చేసి కనుక్కున్నా. అక్కడ మనం అనుమానించ దగ్గది ఏమీ లేదని చెప్తాడు. కావ్య నిజంగానే కెరీర్ డెవలప్ చేసుకోవడానికి వెళ్లిందట అని రాహుల్ అంటాడు. ఆ కావ్య గురించి ఇంట్లో ఎవరికి తెలీకపోయినా.. నాకు బాగా తెలుసు. డబ్బు మీద కానీ, కీర్తి కిరీటాల మీద కానీ తనకు ఎలాంటి ఆశలు లేవని అంటుంది. వదినకి ఇచ్చిన మాట తప్పి మళ్లీ ఆఫీస్‌కి ఎందుకు వెళ్లింది. అక్కడ ఏదో జరుగుతుందని అనుమానిస్తుంది రుద్రాణి. మొగుడితో కలిసి తిరగొచ్చని కూడా వెళ్లిందేమో అని రాహుల్ అంటాడు. కానీ రాజ్, కావ్యలు కలిసి లేరు. కలిసి ఉన్నట్టు అందర్నీ నమ్మిస్తున్నారు. రాజ్‌కి సంబంధించి కావ్య ఏదో తెలుసుకోవాలి అనుకుంటుంది. అదేదో ముందు మనమే తెలుసుకోవాలి. రాజ్ తప్పు చేసినట్టు తెలిస్తే.. అందరి ముందూ నిలబెట్టి.. నీ కొడుకు తప్పు చేశాడు.. నా కొడుకూ తప్పు చేశాడు. కాబట్టి రాహుల్ కి కూడా ఆ కంపెనీలో స్థానం ఉందని చెప్పొచ్చు కదా అని రుద్రాణి అంటుంది. దీంతో రాజ్ వెనుక ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడతాడు రాహుల్.
కావాలనే కావ్య ముందు ఓవరాక్షన్ చేసిన రాజ్..
మరోవైపు శ్వేత ఆఫీస్‌కి వస్తుంది. శ్వేతను చూసిన రాజ్ కావాలనే ఎదురు వెళ్తాడు. కావ్యను చూసి మరింత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. కానీ శ్వేతకు ఏమీ అర్థం కాదు. శ్వేతను తీసుకుని రాజ్.. క్యాబిన్‌లోకి వెళ్తాడు. శ్వేతను చూసిన కావ్య.. వెంటనే లోపలికి వెళ్తుంది. ఎందుకు వచ్చావ్? అని రాజ్ అడుగుతాడు. కావ్యను చూసిన శ్వేత.. తను నీ వైఫ్ కావ్య కదూ అని శ్వేత అడుగుతుంది. అది కర్మ కొద్దీ అయిందిలే అని రాజ్ అంటే.. మరి ఇక్కడ పని చేస్తున్నారేంటీ? అని శ్వేత అంటే.. అదీ నా కర్మ కొద్దీ అని కావ్య చెప్తుంది. కావ్య వైపు సీరియస్‌గా చూసి.. వచ్చిన పనేంటో చూసుకుని వెళ్లు చాలు అని చెప్తాడు రాజ్. వచ్చిన పనేంటో మీకు తెలీదా అని కావ్య అంటుంది.
శ్వేతపై కలర్స్ పడేసిన కావ్య..
రాజ్‌కి తగ్గట్టే.. కావ్య సమాధానం చెప్తుంది. మనం డైరెక్ట్‌గా కలవడం ఇదే మొదటి సారి కదూ అని శ్వేత అంటే.. ఇదే చివరి సారి కూడా. మీరు వచ్చి పోతూ ఉంటే చూస్తూ ఉంటా అని కావ్య అంటుంది. నువ్వేం పట్టించుకోకు శ్వేత.. ఎలా మాట్లాడాలో తెలీదు అని అంటాడు. మా ఆయనకు బాగా తెలుసు పెళ్లాంతో ఎలా మాట్లాడాలి? పరాయి అమ్మాయితో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలిసినంతగా ఏ మొగుడికీ తెలీదని ఈ మధ్యే అర్థమైంది. మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే పోవాలి అని కావ్య అంటుంది. కావాలనే అక్కడున్న కలర్స్ శ్వేతపై పడేలా చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కోపంగా వెళ్తుంది కావ్య.
కావ్యకు నిజం చెప్పేస్తానన్న శ్వేత.. ఆపుతున్న రాజ్..
కావ్యను చూసిన శ్వేత.. తను ఏదో అనుకుంటుందని పసిగడుతుంది. మీ ఇద్దరి మధ్యా నిశ్శబ్దంగా యుద్ధం జరుగుతుంది. నీ భార్య మన గురించి ఏం అనుకుంటుందో అర్థమైంది. ఎంతలా మండిపోకపోతే.. కావాలనే నా మీద కలర్స్ వేస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పు అని శ్వేత అడుగుతుంది. ఈలోపు పక్కకు వెళ్లిన కావ్య తన ఫ్రస్ట్రేషన్‌ని శృతి ముందు అర్థం కానట్టు మాట్లాడుతుంది. నెక్ట్స్ శ్వేతకు అసలు నిజం చెప్పేస్తాడు రాజ్. సరే అయితే నేను వెళ్లి నిజం చెప్పేస్తాను అని అంటుంది. కానీ రాజ్ చెప్పనివ్వడు. కావాలనే కావ్య ముందు ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.