Syed Sohel: 'ప్లీజ్‌ నా సినిమా చూడండి' వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్.

Syed Sohel: ‘ప్లీజ్‌ నా సినిమా చూడండి’ వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్.

Anil kumar poka

|

Updated on: Feb 04, 2024 | 12:12 PM

బుల్లితెరపై సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర్యయాడు సోహైల్. ఆ తర్వాత బిగ్‎బాస్ సీజన్ 4లోకి అడుగుపెట్టి తన ఆట తీరుతో గుర్తింపు తెచ్చుకున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్ అయిన సోహైల్.. ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోగా నటించిన సోహైల్.. ఇప్పుడు మరో మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. అదే బూట్ కట్ బాలరాజు. అయితే తాజాగా ఈ సినిమా స్క్రీనింగ్‌కు వచ్చిన సోహైల్.

బుల్లితెరపై సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర్యయాడు సోహైల్. ఆ తర్వాత బిగ్‎బాస్ సీజన్ 4లోకి అడుగుపెట్టి తన ఆట తీరుతో గుర్తింపు తెచ్చుకున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్ అయిన సోహైల్.. ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోగా నటించిన సోహైల్.. ఇప్పుడు మరో మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. అదే బూట్ కట్ బాలరాజు. అయితే తాజాగా ఈ సినిమా స్క్రీనింగ్‌కు వచ్చిన సోహైల్. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. థియేటర్లో.. అందరి ముందే ఏడ్చాడు. బూట్ కట్ బాల రాజు సినిమాను ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకున్న సోహైల్‌… ఇందులో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. డైరెక్టర్ శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మేఘలేఖ కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న విడుదలైంది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నా.. థియేటర్లలో మాత్రం అసలు జనాలు కనిపించడం లేదు. పలు థియేటర్లలో షోలు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. ఎంతో కష్టపడి ఈ సినిమా రూపొందించామని.. ఫ్యామిలీ అడియన్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అని.. అయినా జనాలు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

“ఎంతో కష్టపడి ఈ సినిమాను తీశాం. ఇందులో ఎలాంటి వల్గారిటీ లేదు. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. నా సినిమాకు రెండు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ వేశారు. కొన్నిచోట్ల షోస్ పడలేదు. చాలా బాధగా ఉంది. హైదరాబాద్ లో మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంది. కానీ మిగిలిన చోట్ల జనాలు థియేటర్లకు వెళ్లడం లేదు . కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తామంటారు కదా.. మాది కంటెంట్ ఉన్న సినిమా. ఒక ముప్పై మంది వెళ్లండి. ఓ నలభై మంది వెళ్లండి. వెళ్లి చూస్తేనే కదా సినిమా ఎలా ఉందో తెలిసేది. సినిమా ఓవైపు జరుగుతుంటే 20 నిమిషాలు చూసి రివ్యూ టైప్ చేస్తున్నారు. నేను రివ్యూ రాసేవాళ్లను అనడం లేదు. కానీ 20 నిమిషాలు చూసి రివ్యూ రాసేస్తున్నారు. మనిషి బాధను చెప్పుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి. దీన్ని కూడా నెగిటివ్ చెయొద్దు. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అందరూ సోహైల్ అని అన్నారు కదా. ఇప్పుడు ఏమైంది. మీకు దండం పెట్టి అడుగుతున్నా.. థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి.. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కామెంట్స్ పెట్టారు. కానీ ఇప్పుడేమైంది ?” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహైల్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos