Revanth Reddy: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు రూ.25లక్షల నగదు పురస్కారం..

సినీ కళామతల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్‌ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం రావడంతో మెగాస్టార్‌కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ, క్రీడా ప్రముఖులు చిరంజీవిని కలిసి అభినందనలు తెలుపుతున్నారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 04, 2024 | 1:27 PM

సినీ కళామతల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్‌ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం రావడంతో మెగాస్టార్‌కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ, క్రీడా ప్రముఖులు చిరంజీవిని కలిసి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్‌ చిరంజీవిని ప్రత్యేకంగా సన్మానిస్తోంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో వెంకయ్యనాయుడు, చిరంజీవితో పాటు.. పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సన్మానిస్తోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా.. పలువురు మంత్రులు హాజరుకానున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..