Brahmamudi, February 20th episode: రాజ్‌కు తప్పని తిప్పలు.. అన్నియ్యకు తమ్మయ్య చురకలు!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య ఇంకా రాలేదని రాజ్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. కావ్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. రెండు గంటలు అయిపోయినా ఇంకా రాలేదని శ్వేత దగ్గర.. తన అక్కసును వెళ్లగక్కుతాడు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావ్ రాజ్.. తను నీ నుంచి దూరం కావాలి అనుకుంటుందేమో అని అంటుంది. అవును కదా అని రాజ్ రాని నవ్వును పైకి నటిస్తాడు. ఇంతలో కావ్య కారు వస్తుంది. అదిగో కారు వచ్చిందని పరిగెత్తుకుంటూ వెళ్లి..

Brahmamudi, February 20th episode: రాజ్‌కు తప్పని తిప్పలు.. అన్నియ్యకు తమ్మయ్య చురకలు!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Feb 20, 2024 | 11:48 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య ఇంకా రాలేదని రాజ్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. కావ్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. రెండు గంటలు అయిపోయినా ఇంకా రాలేదని శ్వేత దగ్గర.. తన అక్కసును వెళ్లగక్కుతాడు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావ్ రాజ్.. తను నీ నుంచి దూరం కావాలి అనుకుంటుందేమో అని అంటుంది. అవును కదా అని రాజ్ రాని నవ్వును పైకి నటిస్తాడు. ఇంతలో కావ్య కారు వస్తుంది. అదిగో కారు వచ్చిందని పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తాడు రాజ్. ఏం చేస్తున్నావ్ రాజ్ అని శ్వేత అంటే.. వాడెలా ఉంటాడు అని చూస్తున్నా అంటే అని చెప్తాడు రాజ్. వాళ్లను చూసిన శ్వేత.. జంట బావుంది కదా అని అంటుంది. అప్పటికే కుళ్లిపోతున్న రాజ్.. అప్పలమ్మకి బావ అంటే.. చిప్ప ముఖం వేసుకుని చీదరగా ఉంటాడు అనుకున్నా. వీడేంటి? హ్యాండ్సమ్‌గా ఉండి చచ్చాడు అని లోపల అనుకుంటాడు.

నా బుజ్జి బంగారాన్ని అమెరికాకి తీసుకెళ్లిపోయేవాడిని…

ఆ తర్వాత తన బావని లోపలికి తీసుకెళ్తుంది కావ్య. అందరికీ పరిచయం చేస్తుంది కావ్య. ఆ తర్వాత రాజ్‌ని కూడా పిలిచి పరిచయం చేస్తుంది. హాయ్ అన్నియ్యా అని వెటకారంగా అంటాడు కావ్య బావ. అది విని రాజ్.. ఇదేంటి గెటప్ చూస్తే రిచ్‌గా ఉంది.. లాంగ్వేజ్ చూస్తే ఇలా ఉంది అని అనుకుంటాడు. హే ఆగు నాకు హగ్గులు అన్నా పెగ్గులన్నా ఇష్టం ఉండదని రాజ్ అంటే.. అదేంటి? బుజ్జి అన్నయ్య సీరియస్‌గా ఉన్నాడు. నేను రావడం ఇష్టం లేదా అని అంటాడు. అబ్బే అదేంటి లేదు నాది బ్రాడ్ మైండ్ అని అంటాడు. ఏదేమైనా నువ్వు చాలా లక్కీ అన్నయ్యా.. మా బుజ్జి లాంటి బుట్టబొమ్మను సొంతం చేసుకున్నావ్ కదా.. అందుకు. మీరు కానీ పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే.. పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్లి పోయేవాడిని అని అంటాడు. దానికి రాజ్ మండి పడుతూ ఉంటాడు.

తమ్మయ్య పంచ్‌లు.. అన్నియ్య తిప్పలు..

అసలు నేను జెలసీ ఫీల్ అవ్వాలి. స్వప్న పారిపోయినట్టు.. మా బుజ్జి కూడా పారిపోయి ఉంటే నేను పెళ్లి చేసుకునేవాడిని. అనవసరంగా కమిట్ అయిపోయిందని కావ్య బావ అంటాడు. ఆ తర్వాత రాజ్ సీరియస్ అవుతూ.. స్టాఫ్‌‌ని పంపిస్తాడు. ఆ తర్వాత శ్వేతను పరిచయం చేస్తాడు. మీరు ఎప్పుడు అమెరికా వెళ్లిపోతారు అని రాజ్ అడుగుతాడు. మా బుజ్జి ఎప్పటిదాకా ఉండమంటే అప్పటి దాకా ఉంటాను అని కావ్య బావ అంటాడు. ఆ తర్వాత బావని క్యాబిన్‌లోకి తీసుకెళ్తుంది కావ్య.

ఇవి కూడా చదవండి

రాజ్‌ని ఉడికిస్తోన్న కావ్య.. పాపం రాజ్!

ఏంటి కావ్యా.. నీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా. నువ్వు వెళ్లే పద్దతి సరైనదేనా అని బావ అంటే.. మాన ఆలోచన విధానం కరెక్టే.. చూశావు కదా బావా నీతో నువ్వు చనువుగా ఉంటే ఎలా మండిపోతున్నాడో.. ఆ మంటే మనకు ఇప్పుడు కావాలి అని కావ్య అంటుంది. మరి ఎందుకు వదిలేయాలి అనుకుంటున్నాడో అర్థం కావడం లేదని బావ అంటే.. తిక్క.. ఆ తిక్క కుదర్చడానికే ఈ తిప్పలు అని కావ్య అంటుంది. ఈ లోపు రాజ్ సైలెంట్‌గా వాళ్లు మాట్లాడుకునేది వినాలని.. కావ్య క్యాబిన్ దగ్గరకు వచ్చి వినాలని ట్రై చేస్తాడు. కానీ ముప్పతిప్పలు పడతాడు. ఇంతలో శ్రుతి వచ్చి.. సార్ అని పిలుస్తుంది. పోనీ నేను వెళ్లి అంతా వినొచ్చి నేను చెప్పనా అని అంటుంది. నేను వాళ్ల మాటలు ఏమీ వినడం లేదు. వెళ్లు అని పంపించేస్తాడు. రాజ్ వినడాన్ని కావ్య గమనిస్తుంది. దీంతో కావాలని కాస్త క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉంటారు. అది చూసి రాజ్ మండి పడుతూ ఉంటాడు. ఆ తర్వాత కావ్య సైలెంట్‌గా వెళ్లి డోర్ తీయబోతుండా.. రాజ్ కావ్య వడిలో పడతాడు. లోపలికి వచ్చి కూర్చోండి అని అంటుంది కావ్య. జారి పడబోయానని రాజ్ కవర్ చేస్తాడు. ఏంటి అన్నియ్యా.. మా పవిత్ర బంధం మీద ఏమైనా అనుమానం ఉందా? అని బావ అడిగితే.. ఛీ ఛీ అనుమానం లేదు. మీరు మాట్లాడుకోండి అని అంటాడు రాజ్. ఇదంతా వెనుక నుంచి శ్వేత వింటుంది.

నీ చదువు, సంస్కారం ఏమైపోయాయి రాజ్: శ్వేత

ఏంటి రాజ్ ఇది.. నీ చదువు, సంస్కారం ఏమైపోయాయి? ఎందుకు ఇలా మారిపోతున్నావ్.. నువ్వు ఏం చేస్తున్నావో నేను కళ్లారా చూస్తూనే ఉంటున్నా. నువ్వు కావ్యను దూరం చేసుకోవడానికి ఫిక్స్ అయినప్పుడు.. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటే నీకేంటి? నిజం చెప్పు కావ్య మీద లోపల నీకు ప్రేమ ఉంది కదా అని శ్వేతఅడుగుతుంది. ఛీ ఛీ ప్రేమా లేదు.. దోమా లేదు. నా నిర్ణయం మీద స్ట్రాంగ్‌గా ఉన్నాను. అది ఎప్పుడూ ఇలా చేయలేదే.. దాని క్యారెక్టర్ అది కాదే అని రాజ్ అంటాడు. ఆ తర్వాత శ్వేత చేత కేక్ కట్ చేయించి.. కావ్య ఉడుక్కునేలా చేయాలని రాజ్ ప్లాన్ చేస్తాడు. కానీ తమయ్య, కావ్యలు తన దైన స్టైల్‌లో రాజ్‌కు చురకలు అంటిస్తాడు.