Bigg Boss Vasanthi: పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. పవన్ కల్యాణ్‌తో మూడు ముళ్ల బంధంలోకి వాసంతి.. వీడియో
బిగ్‌బాస్ బ్యూటీ.. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ వాసంతి కృష్ణన్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రియుడు పవన్ కల్యాణ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిందీ అందాల తార. తిరుపతి వేదికగా ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వాసంతి, పవన్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
బిగ్‌బాస్ బ్యూటీ.. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ వాసంతి కృష్ణన్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రియుడు పవన్ కల్యాణ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిందీ అందాల తార. తిరుపతి వేదికగా ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వాసంతి, పవన్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఓ ప్రైవేట్ కల్యాణ్ మండపంలో వీరి వివాహ వేడుక జరిగినట్లు సమాచారం. వాసంతి వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ, బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పవన్ కల్యాణ్, వాసంతి కృష్ణన్ లది ప్రేమ వివాహం. గతేడాది డిసెంబర్ లో వాసంతి, పవన్ ల నిశ్చాతార్థం ఇదే తిరుపతి వేదికగా జరిగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గీతూ రాయల్, అర్జున్ కల్యాణ్, సత్య, ఇనయా, ఆర్జే సూర్య తదితర బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరై వాసంతి, పవన్ లకు అభినందనలు తెలిపారు. బిగ్ బాస్ సీజన 6లో కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టింది వాసంతి. తన ఆటతీరుతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అంతకు ముందు సిరిసిరి మువ్వలు, గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి టాప్ సీరియల్స్ లో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు పలు కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్ గా, స్పెషల్ రోల్స్ లోనూ సందడి చేసింది.
వాసంతి, పవన్ ల కల్యాణం..
View this post on Instagram
వాసంతి, పవన్ ల నిశ్చితార్థం..
View this post on Instagram
నిజానికి వాసంతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఇప్పుడు ఆమె భర్త సైతం పవర్ స్టార్ వీరాభిమాని. అతను కూడా టాలీవుడ్ నటుడే.
హీరోగా ఓ రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు.
వాసంతి, పవన్ కల్యాణ్ ల ఫొటోస్..
View this post on Instagram
వాసంతి, పవన్ కల్యాణ్ ల ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని తాజా సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.