Rituraj Singh: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో టీవీ నటుడు రితురాజ్ మృతి
ఇటీవల గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా గుండెపోటుతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్ ఫిబ్రవరి 20 తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.
ఇటీవల గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా గుండెపోటుతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్ ఫిబ్రవరి 20 తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన సహోద్యోగి, ప్రియ మిత్రుడు అమిత్ బెహల్ ఈ విషాద వార్తను మీడియాకు తెలియజేశాడు. రితురాజ్ సింగ్ తనకు మంచి స్నేహితుడని, ఫిబ్రవరి 20 అర్ధరాత్రి 12:30 గంటలకు రితు రాజ్ కు గుండెపోటు వచ్చిందని మీడియాకు వెల్లడించాడు.
రితురాజ్ ప్యాంక్రియాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని, దానికి చికిత్స పొందుతున్నారని సీఐఎన్టీఏఏ చీఫ్ తెలిపారు. నిర్మాత సందీప్ సిక్చంద్ రితురాజ్ సింగ్ మరణంపై ఒక ప్రకటనలో ఇలా రియాక్ట్ అయ్యారు. “ఈ వార్త విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఉదయాన్నే ఎవరో నా వాట్సప్ గ్రూప్ లో ఈ వార్తను పోస్ట్ చేశారు. అప్పటి నుండి నేను షాక్ లో ఉన్నాను. ‘కహానీ ఘర్ ఘర్ కీ’లో రీతూతో కలిసి నటించాను. ఈ షోలో నాకు సాదర స్వాగతం పలికిన అతికొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. అద్భుతమైన నటుడు. కానీ ఒక నటుడి కంటే, అతను నాకు తెలిసిన ఉత్తమ వ్యక్తులలో ఒకడు. ఆ వార్త నన్ను చాలా బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన భార్యాపిల్లలు ధైర్యంగా ఉండాలి’’ అని ఆయన ఆకాంక్షించారు.
రీతురాజ్ కే సింగ్ ఇటీవల రూపాలీ గంగూలీ టీవీ సీరియల్ ‘అనుపమ’లో యశ్పాల్ పాత్రలో కనిపించారు. అంతే కాకుండా ఈ నటుడు టీవీ, చలనచిత్ర పరిశ్రమ రెండింటిలోనూ గొప్ప కెరీర్ ను కొనసాగించాడు. ‘బనేగీ అప్నీ బాత్’ సహా పలు పాపులర్ టెలివిజన్ ధారావాహికల్లో సింగ్ నటించారు. మాధవన్, దివంగత నటుడు ఇర్ఫాన్, సురేఖ సిక్రీ తదితరులతో కలిసి నటించారు.
వీటితో పాటు ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’, ‘త్రిదేవియాన్’, ‘దియా ఔర్ బాతీ హమ్’ వంటి టీవీ సీరియళ్లలో కూడా రీతురాజ్ నటించారు. వరుణ్ ధావన్, అలియా భట్ లతో కలిసి ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ చిత్రంలో కూడా నటించాడు. ఈ మరణంతో బాలీవుడ్ లో విషాదం నెలకొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.