AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Shiva Kumar: ప్రియాంకతో కలిసి యూట్యూబ్ వీడియోస్, రీల్స్.. నెలకు సంపాదన రివీల్ చేసిన శివకుమార్..

మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగులో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు ప్రియాంక జైన్, శివకుమార్. మొదటి సీరియల్లోనే జంటగా నటించిన వీరిద్దరు.. అదే సమయంలో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు కెరీర్ లో బిజీగా ఉన్నప్పటికీ కలిసి రీల్స్, యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ప్రతి క్షణం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివకుమార్ తమ నెల సంపాదన ఎంతో రివీల్ చేశారు.

Actor Shiva Kumar: ప్రియాంకతో కలిసి యూట్యూబ్ వీడియోస్, రీల్స్.. నెలకు సంపాదన రివీల్ చేసిన శివకుమార్..
Shivakumar, Priyanka Jain
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2026 | 4:55 PM

Share

మౌనరాగం సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు శివకుమార్. ఈ సీరియల్లో తనతోపాటు నటించిన నటి ప్రియాంక జైన్ లో శివకుమార్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివకుమార్.. తన సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిగత జీవితంలోని అడ్డంకులను, విజయాలను, అలాగే ఆర్థిక విషయాలపై ఆలోచనలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కర్ణాటకలోని బెళగాంలో జన్మించిన శివకుమార్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర సరిహద్దులో గల ఆ ప్రాంతం నుండి వచ్చారు. తన తల్లి ఐఏఎస్ అధికారి కావాలని కోరుకోవడంతో, మొదట ఇంజినీరింగ్ చదివారు. ఇంటర్‌లో 90% మార్కులు సాధించినా, మొదటి సెమ్‌లో నాలుగు సబ్జెక్టులలో తప్పిపోవడంతో, ఇది తనకు సరిపోదని భావించారు. మోడలింగ్ పట్ల ఉన్న ఆసక్తితో తల్లిదండ్రులను ఒప్పించి బెంగళూరు వెళ్లారు. అక్కడ చాలా ఆడిషన్లలో పాల్గొన్నా, 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు కారణంగా మోడలింగ్‌కు సరిపోడని తిరస్కరణకు గురయ్యారు. మోడలింగ్ ప్రపంచంలో కనీసం 5 అడుగుల 11 అంగుళాలు లేదా 6 అడుగులు ఉండాలని ఆయన వివరించారు. ఈ నిరాశలో ఉన్నప్పుడు, ఆయన జిమ్ ట్రైనర్ నువ్వు కెమెరా ముందు చాలా బాగా కనిపిస్తావు, నటనను ప్రయత్నించు అని సలహా ఇచ్చారు. ఇదే ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది.

నటన వైపు అడుగులు వేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు, కర్ణాటక స్లాంగ్, కెమెరా భయం ఆయనకు పెద్ద సవాళ్లుగా నిలిచాయి. అయినా సరే, జిమ్ ట్రైనర్ పంపిన ఒక ఆడిషన్‌కు వెళ్లారు. కర్ణాటకలోని నంబర్ వన్ ఛానెల్ కోసం నాగిని సీరియల్ రీమేక్‌కు సంబంధించిన ఆడిషన్ అది. మెయిన్ డోర్ నుండి గేట్ వరకు జనం నిండి ఉండటం చూసి భయపడి తిరిగి వెళ్లాలని అనుకున్నారు. కానీ, కాస్టింగ్ డైరెక్టర్ ఆయనను గుర్తించి, మరో రోజు ఫైనల్ ఆడిషన్‌కు ఆహ్వానించారు. నటనలో అనుభవం లేకున్నా, మొదటిసారిగా కెమెరాను ఎదుర్కొని, 20-30 టేకుల తర్వాత దర్శకుడిని మెప్పించారు. ఈ విధంగా మూడు వేల మందిలో ఎంపికై, నాగకన్య సీరియల్‌తో కన్నడలో తన నటనా రంగ ప్రవేశం చేశారు. ఈ సీరియల్ చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది.

శివకుమార్ కేవలం నటుడిగానే కాకుండా, రచయితగా కూడా గుర్తింపు పొందారు. ప్రియాంక జైన్‌తో కలిసి చేసే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ ఫిల్మ్‌లకు ఆయనే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తారు. ఇటీవల నిఖిల్ తో చేసిన ఒక ప్రాజెక్ట్‌కు కూడా ఆయనే రచయిత. రీల్స్ బాగా వైరల్ కావాలంటే భయం, ఏకాగ్రత, నిరంతర కృషి అవసరమని ఆయన నమ్ముతారు. ప్రియాంక జైన్‌తో కలిసి అన్ని రకాల పాత్రలలో (కామెడీ, ఎమోషనల్) కనిపించాలని కోరుకునే ఆయన, కళాకారులకు బహుముఖ ప్రజ్ఞ ఉండాలని అన్నారు.. ఆదాయం గురించి అడగ్గా, ఎంత కష్టపడతామో, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తామో, ప్రజల ప్రేమ ఎంత ఉంటుందో అంత సంపాదిస్తామని బదులిచ్చారు. డబ్బు లేనప్పుడు దాని విలువ తనకు తెలుసని, ఇప్పుడు డబ్బు వస్తుందని దానిని నిర్లక్ష్యం చేయకుండా, వచ్చిన ప్రతి పైసాకు, జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తికి విలువ ఇస్తామని శివకుమార్, ప్రియాంక జైన్ పంచుకున్నారు. పని చేయడం తనకు ఆనందమని, ఇటీవల కాలుకు గాయం కావడంతో పదిహేను రోజులు ఇంట్లో ఉండటం పదిహేను సంవత్సరాలుగా అనిపించిందని, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలని ఆయన తెలిపారు. తనకు తాను అవకాశాలను సృష్టించుకోవడానికి రీల్స్, వ్లాగ్స్, సీరియల్స్ వంటివి చేస్తున్నానని, రచనను ఇష్టపడతానని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Follow Us
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..