AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Saving Tips: సిలిండర్ ఎక్కవ రోజులు రావాలా?.. అయితే వంట చేసేప్పుడు ఈ 5 చిట్కాలు పాటస్తే చాలు..

గ్యాస్ అనేది ప్రతి ఒక్కరికి అత్యవసరమైన వస్తువు. ఈ రోజుల్లో గ్యాస్ లేకుండా వంటచేయడం అనేది పెద్ద సవాల్‌తో కూడుకున్న పని.. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత, ధరల పెరుగుదల కారణంగా దాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. ఈ క్రమంగా నిపుణులు దాన్ని పొదుపుగా ఎలా వాడుకోవాలో అని కొన్ని పురాతన చిక్కాలను చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Anand T
|

Updated on: Jun 11, 2026 | 4:42 PM

Share
స్టవ్ మెయింటెనెన్స్: చాలా మంది గ్యాస్ స్టవ్‌ను ఎలా పడితే అలా వాడుతూ ఉంటారు. నిపుణుల ప్రకారం.. గ్యాస్ బర్నర్లలో దుమ్ము, జిడ్డు పేరుకుపోతే గ్యాస్ సరిగ్గా రాక, వినియోగం పెరుగుతుంది. కాబట్టి బర్నర్లను క్రమం తప్పకుండా క్లీన్ చేయడం, స్టవ్‌ను సర్వీసింగ్ చేయించడం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల గ్యాస్ ఆదా చేసుకోవచ్చంటున్నారు. రెగ్యులేటర్‌లను కూడా ఎక్కవ రోజులు వాడవద్దని ఒక నిర్దిష్ట సమయం తర్వాత వాటిని మార్చాలని సూచిస్తున్నారు.ఇలా చేయడం వల్ల గ్యాస్‌ను ఆదా చేయవచ్చని  సూచిస్తున్నారు.

1 / 5
వంట అలవాట్లలో మార్పులు: మనం వంట చేసే పద్ధతిలో చేసుకునే చిన్న చిన్న మార్పు కూడా గ్యాస్‌ను ఆదా చేయడంలో ఎంతో ఉపయోగపడుతాయాని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, వంట చేసేప్పుడు చాలా మంది గిన్నెలపై మూతలు పెట్టరు. దీని వల్ల కూరలు ఉండికేందుకు లేట్ అవుతుంది. కాబట్టి వండేప్పుడు కచ్చితంగా పాత్రపై మూత పెట్టండి దీని వల్ల వేడి బయటకు పోకుండా ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఈ చిన్న చిట్కా గ్యాస్ వినియోగాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

2 / 5
ముందే సిద్ధం చేసుకోవడం: చాలా మంది స్టవ్ అన్ చేసి తర్వాత కూరగాయలు కోస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా గ్యాస్ వృథా అవుతుంది. కాబట్టి మీరు వంట స్టార్ట్ చేయడానికి ముందే కూరగాయలు కోసుకోవడం, మసాలాలు సిద్ధం చేసుకోవడం వంటివన్నీ పూర్తి చేసుకోవాలి.. అలాగే బియ్యం, పప్పులు వంటివి ముందే నానబెట్టుకొని వండడం వల్ల వంట త్వరగా అవుతుంది. దీని వల్ల గ్యాస్ తక్కువ కాలుతుంది.

3 / 5
ప్రెజర్ కుక్కర్ వాడకం: చాలా మంది సాధారణ వంట పాత్రల్లో ఆహారం వండుతూ ఉంటారు. కానీ మీకు గ్యాస్ వినియోగం తగ్గాలి అంటే ప్రెజర్‌ కుక్కర్‌లో వంట చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే కుక్కర్‌లో వేడి బయటకు పోకుండా ఉంటుంది కాబట్టి ఆహారం త్వరగా ఉండికి వంట త్వరగా పూర్తవుతుంది. అలాగే కుక్కర్‌లో ఒక చిన్న గిన్నెలో పప్పు లేదా కూరగాయలు పెట్టి ఒకేసారి రెండు మూడు రకాల వస్తువులను ఉడికించుకోవచ్చు. ఇది గ్యాస్‌ను చాలా వరకు ఆదా చేస్తుంది.

4 / 5
మీరు డైలీ వంటచేసేప్పుడు ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల ప్రతి నెలా గ్యాస్ వినియోగాన్ని 15 నుండి 20 శాతం వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా మీరు గ్యాస్ పొదుపుగా వాడడం వల్ల గ్యాస్ ఎక్కవ రోజులు రావడంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే వంటగది ప్రమాదాలు కూడా తగ్గుతాయి.

5 / 5
Follow Us