Brahmamudi, April 13th episode: కావ్యకు చివరి రోజు.. వెన్నెల దొరుకుతుందా.. సస్పెన్స్‌లో ఎపిసోడ్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. తప్పు చేసింది నేను. కానీ కళావతి ఏ తప్పూ చేయలేదు. నువ్వు ఇంటి పరువు తీయ్యాలని చూస్తే.. కళావతి ఇంటి పరువు కాపాడింది. ఇది ఏమాత్రం పద్దతి కాదు అత్త. ఆస్తి కోసం కళావతి సర్దుకు పోవడం లేదు. ఈ విషయం ఇక్కడున్న వాళ్లందరికీ తెలుసు. కళావతి నోరు తెరిచి అడిగితే తాతయ్య ఈ ఇల్లే రాసిచ్చేస్తాడు. అప్పుడు నువ్వు కూడా నాలాగా అతిథిలా ఉండాల్సి వస్తుంది పిన్ని గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్లి పోతాడు రాజ్. ఇదంతా నీవల్లే..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. తప్పు చేసింది నేను. కానీ కళావతి ఏ తప్పూ చేయలేదు. నువ్వు ఇంటి పరువు తీయ్యాలని చూస్తే.. కళావతి ఇంటి పరువు కాపాడింది. ఇది ఏమాత్రం పద్దతి కాదు అత్త. ఆస్తి కోసం కళావతి సర్దుకు పోవడం లేదు. ఈ విషయం ఇక్కడున్న వాళ్లందరికీ తెలుసు. కళావతి నోరు తెరిచి అడిగితే తాతయ్య ఈ ఇల్లే రాసిచ్చేస్తాడు. అప్పుడు నువ్వు కూడా నాలాగా అతిథిలా ఉండాల్సి వస్తుంది పిన్ని గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్లి పోతాడు రాజ్. ఇదంతా నీవల్లే.. వాడికి ఏ సహకారం అందించకూడదని చెప్పాను. కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు వాడు అస్సలు నిజం చెప్పడం లేదని అపర్ణ.. కావ్యపై సీరియస్ అవుతుంది. ఆయన నోరు తెరచి చెప్పకపోయినా.. ఆ నిజం అనేది ఎక్కడో ఓ చోట ఉండే ఉంటుంది. ఆ నిజాన్ని అందరం తొందరలోనే తెలుసుకుంటాం అని కావ్య చెబుతుంది.
పోలీస్ సెలక్షన్‌కి సెలెక్ట్ కాని అప్పూ.. బాధ పడిన కనకం..
ఈ సీన్ కట్ చేస్తే.. కనకం అప్పూకి దోశలు వేస్తూ ఉంటుంది. ఇంకోటి కావాలి అని అప్పూ అంటే.. కనకం గడ్డి పెడుతుంది. అప్పుడే కృష్ణ మూర్తి ఓ లెటర్ తీసుకుని వస్తాడు. అది చూసిన అప్పూ షాక్ అవుతుంది. ఏమైందనే కనకం అడిగితే.. పోలీస్ సెలక్షన్స్‌కి సెలెక్ట్ కాలేదని చెబుతూ బాధగా.. లోపలికి వెళ్తుంది. దీంతో కనకం, కృష్ణ మూర్తి ఎంతో బాధ పడతారు. నా కూతురిగా పుట్టడం వల్లే దానికి ఇన్ని కష్టాలు అని ఏడుస్తుంది. ఆ తర్వాత కావ్య మొక్కలను శుభ్రం చేస్తూ ఉంటుంది. రాజ్ బయటకు వచ్చి.. కావ్యను రీ యూనియన్ ఫంక్షన్‌కి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే అదునుగా రాజ్‌ని ఓ ఆట ఆడుకుంటుంది. ఏంటి ఏదో అడగాలని వచ్చినట్టున్నారు.. చెప్పండి అని కావ్య అంటుంది.
పాపం అమాయకపు రాజ్.. కావ్య గేమ్ స్టార్ట్..
అప్పుడే శ్వేత.. కావ్యకు కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన కావ్య.. హలో అంటుంది. వాడు పార్టీకి రమ్మన్నాడా? రీ యూనియన్‌కి భార్యాభర్తలు ఇద్దరూ రావాలి అని శ్వేత అంటే.. కావ్య ఏమీ తెలీనట్టు యాక్టింగ్ చేస్తుంది. నేనేమీ కలిసి చదువు కోలేదే.. నేనెందుకు పానకంలా పుడకలా మధ్యలో ఎందుకు? అని కావ్య అంటే.. బాగానే నటిస్తున్నాడు కానీ.. నువ్వు బెట్టు చేయకు.. వాడసలే మొండోడు. నువ్వు వస్తే ఎంత? రాకపోతే ఎంత? అన్నాడంటే.. మన ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోతుందని శ్వేత చెప్తుంది. నేను రాను గాక రాను.. అని చెప్పి కావ్య ఫోన్ పెట్టేస్తుంది. హే వస్తే ఏమౌతుంది? తెగ ఫోజులు కొడుతున్నావ్. నువ్వు రావడం లేదని తెలిస్తే.. నాకు వంద ఫోన్లు వస్తాయి. నువ్వు రా ముందు అని రాజ్ అంటాడు. ఏంటీ నేను రావాలా? ఎక్కడి రావాలి? ఎలా, ఎందుకు రావాలి? మొదటి భార్యగా రావాలా.. రెండో భార్యగా రావాలా? ఏ హోదాలో రావాలో చెప్పండని ప్రశ్నలతో చంపేస్తుంది కావ్య. ఇప్పుడు గనుక నువ్వు రాకపోతే.. ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి.. రా తల్లి అని రాజ్ అంటే.. సరేలే అని కావ్య ఒప్పుకుంటుంది. మొత్తానికి కావ్య ప్లాన్ సక్సెస్ అవుతుంది.
అమ్మాయిగా పుట్టి తప్పు చేశాను..
ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ, కళ్యాణ్‌లు మీట్ అవుతారు. పోలీస్ సెలక్షన్ విషయం తెలిసి కళ్యాణ్ బాధ పడతాడు. అమ్మాయిగా పుట్టడం తప్పు అనిపిస్తుందని అప్పూ అంటే.. నేను అబ్బాయిగా పుట్టి.. ఏం చేస్తున్నాను. అన్నయ్య కోసం ఆఫీస్.. పెళ్లం కోసం పని చేస్తున్నా. సరే నువ్వు కూడా పెళ్లి చేసుకో లైఫ్ సెట్ అయిపోతుందని కళ్యాణ్ అంటాడు. ఏంటి ఆటలగా ఉందా? అని అప్పూ అంటే.. మరి ఇష్టం లేని పని చేస్తే నాకూ అలాగే ఉంది. మా అన్నయ్య ఆఫీస్‌కి ఎప్పుడు వస్తాడో అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కావ్య పరిస్థితి తలుచుకుని అప్పూ బాధ పడుతుంది.
రుద్రాణి మరో కుట్ర.. స్వప్నకు మత్తు మందు..
ఆ తర్వాత రుద్రాణి.. స్వప్నకు ఇవ్వడానికి జ్యూస్‌లో మత్తు మందు కలుపుతుంది. అప్పటికే ఎక్కువగా తిన్న స్వప్న అరగక ఇబ్బంది పడుతూ ఉంటుంది. రుద్రాణి ప్రేమను నటిస్తూ జ్యూస్ చేసి తీసుకురాగ.. స్వప్న తాగను అని అంటుంది. తర్వాత తాగుతాను పక్కన పెట్టండి అని చెబుతుంది. సరే ఆ తర్వాత చెప్పు జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాను అని రుద్రాణి అంటుంది. ఏంటి ఈవిడ ఎప్పుడూ లేని ప్రేమ నటిస్తుంది. ఎలాగైనా ఈవిడతో జాగ్రత్తగా ఉండాలి అని స్వప్న అనుకుంటుంది.
దుగ్గిరాల ఇంట్లో కావ్యకు చివరి రోజు..
ఇక కృష్ణుడి దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకుంటూ మొరపెట్టుకుంటుంది కావ్య. ఎవరికి ఏది ఇస్తే.. తిరిగి మీకు అదే పొందుతుందని చెప్పావ్. మరి నేను ఆయనకు ప్రేమను ఇస్తే.. తిరిగి నాకు ఏం వచ్చింది? మరి నా ప్రేమ అబద్ధమా.. నేను నచ్చని అత్తరింటిని ఇచ్చావ్.. ద్వేషించే భర్తను ఇచ్చావ్.. ఈ రోజు నా ఉనికినే ప్రశ్నిస్తున్నావ్.. ఎందుకు? అప్పుడే వెనుక నుంచి అంతా వింటుంది పెద్దావిడ. ఒక వేళ ఆయన చెప్పినట్టు.. వెన్నెల అనే అమ్మాయి ఆయన జీవితంలో ఉండి.. ఆ బిడ్డకు తండ్రి అని తెలిస్తే.. నేను ఉండే ఆఖరి రోజు ఇదే అవుతుందని కావ్య అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.








