Brahmamudi, November 25th episode: రాహుల్, రుద్రాణిల ప్లాన్ ఫెయిల్.. డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధమన్న స్వప్న!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న ఇంట్లో ఉండటానికి వీల్లేదని చేయి పట్టుకుని లాక్కెళ్తుంది రుద్రాణి. ఈలోపు స్వప్న కళ్లు తిరిగి పడి పోతుంది. స్వప్న ఒక్కసారిగా పడి పోవడతో ఏమైందా అని కంగారు పడతారు. స్వప్న పడి పోవడానికి చూసిన రుద్రాణి.. క్లాప్స్ కొడుతూ సూపర్ ఆఖరి అస్త్రాన్ని వదిలేసిందని అంటుంది. ఇంట్లో నుంచి వెళ్ల కుండా మంచి ప్లాన్ వేసింది. రేయ్ రాహుల్ ఒక్కటి పీకితే లేచి అదే కూర్చుంటుందని రుద్రాణి అంటే.. అవును దీని నాటకాలకు అంతు లేకుండా పోతుంది. గేటు అవతలికి ఈడ్చి పడేస్తానని రాహుల్ అంటే.. రాజ్ ఆపుతాడు. వెంటనే డాక్టర్ కి కాల్ చేసి రమ్మంటారు. ఇంకా దీన్ని ఎలా నమ్ముతున్నావ్ రా.. అని రుద్రాణి అంటుంది. రుద్రాణి కొంచెం ఓపిక పట్టు..

Brahmamudi, November 25th episode: రాహుల్, రుద్రాణిల ప్లాన్ ఫెయిల్.. డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధమన్న స్వప్న!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Nov 25, 2023 | 11:11 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న ఇంట్లో ఉండటానికి వీల్లేదని చేయి పట్టుకుని లాక్కెళ్తుంది రుద్రాణి. ఈలోపు స్వప్న కళ్లు తిరిగి పడి పోతుంది. స్వప్న ఒక్కసారిగా పడి పోవడతో ఏమైందా అని కంగారు పడతారు. స్వప్న పడి పోవడానికి చూసిన రుద్రాణి.. క్లాప్స్ కొడుతూ సూపర్ ఆఖరి అస్త్రాన్ని వదిలేసిందని అంటుంది. ఇంట్లో నుంచి వెళ్ల కుండా మంచి ప్లాన్ వేసింది. రేయ్ రాహుల్ ఒక్కటి పీకితే లేచి అదే కూర్చుంటుందని రుద్రాణి అంటే.. అవును దీని నాటకాలకు అంతు లేకుండా పోతుంది. గేటు అవతలికి ఈడ్చి పడేస్తానని రాహుల్ అంటే.. రాజ్ ఆపుతాడు. వెంటనే డాక్టర్ కి కాల్ చేసి రమ్మంటారు. ఇంకా దీన్ని ఎలా నమ్ముతున్నావ్ రా.. అని రుద్రాణి అంటుంది. రుద్రాణి కొంచెం ఓపిక పట్టు అని ఇందిరా దేవి అంటుంది.

స్వప్న తల్లి అని చెప్పిన డాక్టర్.. కంగారులో కావ్య:

వెంటనే డాక్టర్ వచ్చి స్వప్నని చెక్ చేస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. తను బాగానే ఉంది. శుభవార్తే.. తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది డాక్టర్. బయటకు వచ్చిన డాక్టర్ ని ఏమైందని అడుగుతారు. గుడ్ న్యూస్ అండి.. ఆమె తల్లి కాబోతుందని డాక్టర్ చెప్తుంది. ఈ వార్త విన్న ఇంట్లోని వాళ్లు షాక్ అవుతారు. కానీ రాహుల్, రుద్రాణిలు మాత్రం అయోమయంలో ఉంటారు. వెంటనే స్వప్నని బయటకు తీసుకొచ్చి.. మళ్లీ ఇది కొత్త నాటకమా.. మీరెంతకి అమ్ముడి పోయారు అని రుద్రాణి అడుగుతుంది. కానీ డాక్టర్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వెళ్లి పోతుంది. ఇక రుద్రాణి దొరికిందే ఛాన్స్ అని రెచ్చి పోతుంది. చివరి నిమిషంలో కడుపు నాటకం ఆడితే వదిలేస్తాం అనుకుంటున్నావా అని రుద్రాణి అంటే.. డాక్టర్ ని ఎవరు పిలిపించారు. అయినా నేను నాటకం ఆడితే ఇక్కడ ఇంత మంది ఉన్నారు కనిపెట్టలేదరా అని స్వప్న అంటుంది. స్వప్నకి కడుపు అనేది నిజమే అయి ఉంటుంది మామ్.. కానీ ఆ బిడ్డకు తండ్రిని మాత్రం నేను కాదని రాహుల్ అంటాడు. ఇది విన్న ఇంట్లోని సభ్యులు షాక్ అవుతారు. దీని బాయ్ ఫ్రెండ్ వల్లే ఆ కడుపు వచ్చింది. ఇలాంటి చెడి పోయిన ఆడదాన్ని ఇంకా ఇంట్లో ఉంచనివ్వద్దు అని రాహుల్ అంటాడు. దీంతో స్వప్న ఒక్కసారిగా వచ్చి రాహుల్ చెంపలు వాయించేస్తుంది.

ఇవి కూడా చదవండి

రాహుల్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన స్వప్న:

ఏమన్నావ్.. నన్ను ఇప్పటిదాకా ఎన్ని అన్నా నేను భరించాను. ఎందుకంటే ఆ అరుణ్ అన్నవాడు చాలా పక్బందీగా ఉచ్చులో బంధించాడు. కాబట్టి నోరు మూసుకున్నా. కానీ ఇప్పుడు నువ్వేమన్నావ్. నా బిడ్డకు తండ్రివి కాదా.. ఆ మాటకు నాకే గుర్తొచ్చింది.. నేనూ ఆడదాన్నే అని. నాకూ వ్యక్తిత్వం ఉందని, పవిత్రంగానే బతుకుతున్నా అని, నువ్వు నన్ను వదిలించుకోవడానికి ఇంత పెద్ద నింద వేస్తున్నావని ఇప్పుడే అర్థమైంది. నేను రిచ్ గా బతకాలనుకున్నది నిజం. కానీ ఎలా పడితే అలా బతకాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకూ ఒక క్యారెక్టర్ ఉంది. అంతగా దిగజారిపోయానని ఎలా అనుకున్నావ్? ఎలా ఊరుకుంటాను? చంపేస్తాను.. అని అంటుంది స్వప్న.

నీ కడుపులో బిడ్డకు తండ్రిని నేను కాదు: రాహుల్:

ఎంత ధైర్యం ఉంది నాకు.. ఒకడితో తిరుగుతున్నావ్ అని.. నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చి.. ఇవన్నీ చేశాక నువ్వు తప్పు చేయలేదని చెప్తే ఎలా నమ్ముతానే అని రాహుల్ అంటే.. నమ్మాలి.. నమ్మి తీరాలి. నా పేరెంట్స్ పేదవాళ్లే కావచ్చు. నా బతుకు అంటే నాకు చిరాకే అనిపంచవచ్చు. కానీ రిచ్ గా బతకాలి అనుకోవడానికి.. చెడిపోయి బతకడానికి చాలా తేడా ఉంది. పెళ్లికి ముందు నా మనసులో ఎవరూ లేరు. కానీ పెళ్లి తర్వాత నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నా జీవితంలోకి ఏ మగాడూ ప్రవేశించే అవకాశమే ఇవ్వను. నేను అందంగా ఉండాలని.. ఆనందంగా ఉండాలని.. ఎప్పుడూ కోరుకుంటాను. అందుకని నన్ను నేను అపవిత్రంగా మార్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని స్వప్న అంటుంది.

మొగుడితో కాపురం చేసే నన్ను మాత్రం ఎందుకు చూడరు: స్వప్న

ఏయ్ పవిత్రతా మూర్తిలా మాట్లాడితే.. నువ్వు అన్నవి నిజమై పోతాయా.. నా కొడుకును వెర్రి వాడిని చేసి, తిరుగుళ్లు మొదలు పెట్టి.. ఆ పాపాన్ని నీ కడుపులో మోస్తే.. ఆ అనైతికాన్ని ఈ కుటుంబం జీవితాంతం ఎలా మోస్తుందనుకున్నావే అని రుద్రాణి అంటే.. అత్తయ్యా.. మొగుడిని వదిలేసిన నిన్నే.. పవిత్రంగా చూస్తోంది ఈ కుటుంబం. మొగుడితో కాపురం చేసే నన్ను మాత్రం ఎందుకు చూడరు. బ్లాక్ మెయిల్ కి లొంగి.. ఒకడికి డబ్బు ఇచ్చినంత మాత్రాన పవిత్రతను కూడా తాకట్టు పెట్టాను అనుకుంటున్నారా.. ఒక ఆడదానివి అయి ఉండి.. మరో ఆడదాని శీలం మీద మచ్చ వేయాలని చూస్తే ఊరుకునేది లేదు. అందరూ అలా గుడ్లు అప్పగించుకుని చూస్తున్నారేంటి? ఎవడికో పెట్టే వాడిని నా వారసుడిని చేయాలని చూస్తుంది. నా కొడుకుని అమాయకుడిని చేసి.. తండ్రిగా ముద్ర వేయాలని ఎత్తు వేస్తోంది. నమ్మకండి.. దీన్ని అస్సలు నమ్మకండి. దీనికొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నది నిజం.. ఈ పరిస్థితికి వాడే కారణం అన్నది కూడా నిజమని రుద్రాణి అంటే.. ఆపండి.. ఇంత సేపు మీరు ఏం మాట్లాడినా.. మీ కొడుకు ఎంతకు దిగజారి పోయి నిందలు వేసినా నేను ఊరుకున్నాను.

మా అక్క శీలాన్ని దారుణంగా అవమానిస్తే ఊరుకోను: కావ్య

ఎందుకంటే మా అక్కని సమర్థించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా మూర్ఖంగా ముందుకు వెళ్లింది కాబట్టి.. కానీ మా అక్క చెడిపోయిందంటే మాత్రం ఎవరూ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎవరూ మాకు సంబంధం లేదు అన్నట్టు తప్పుకోవడానికి కూడా వీల్లేదు. ఇంత గొప్ప కుటుంబంలో.. ఇంత ఘోరమైన అపనిందలు వేస్తుంటే.. ఏమైపోయింది ఈ ఇంటి పెద్దరికం.. ఏమైపోతుంది మీ సభ్యతా.. సంస్కారం.. మేము ముగ్గురు ఆడపిల్లం నిప్పులా పెరిగాం. మా అమ్మానాన్నా అలా పెంచారు మమ్మల్ని. విలువలకు విలువలు ఇచ్చే ఆడ పిల్లలం. మాలో ఒక్కర్ని ఇంత నీచంగా చూస్తుంటే ఎలా తట్టుకోమంటారు. ఇంత దారుణంగా అవమానిస్తే ఎలా సహించ మంటారు. నా అక్క శీలం మీద అశ్లీలమైన ఆరోపణలు చేస్తుంటే.. మీరంతా ఎందుకు ఊరుకుంటున్నారు.

డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధమన్న స్వప్న.. సపోర్ట్ గా నిలిచిన సీతా రామయ్య:

కావ్యా నువ్వు ఆగు. ఈ విషయంలో నాకు ఎవ్వరి మద్దతు అవసరం. నన్ను నేను గెలిపించుకోవడానికి మనో బలం, సహనం ఉన్నాయి. ఇప్పుడు కొండంత అండగా కడుపులో బిడ్డ ఉంది. ఏమన్నారు.. ఈ బిడ్డ మీరక్తం కాదా.. మీ సంస్కారం ఇంతే.. మీ వ్యక్తిత్వం ఇంతే అని సరిపెట్టుకుని నాకోసం కాకపోయినా.. నా బిడ్డ కోసం ఈ అపనిందను నిరూపించుకుంటాను. అందుకోసం ఎంత దూరం అయినా వెళ్తాను. ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. డీఎన్ఏ టెస్ట్ చేయించుకుని ఈ బిడ్డ మీ బిడ్డే అని రుజువు చేస్తాను. నేను రెడీ.. నువ్వు రెడీనా రాహుల్? అని అడుగుతంది స్వప్న. అప్పుడు మాట్లాడండి.. విలువల గురించి.. అనైతికం గురించి.. నేను తప్పు చేశానని తేలితే.. నువ్వు వెళ్లగొట్టడం కాదు.. నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్లి పోతాను.. చెప్పు రాహుల్.. నేను రెడీ.. నువ్వు రెడీనా అని పదే పదే అడుగుతుంది. ఇన్నాళ్లూ నేను ఆడ పిల్లని అని మర్చిపోయి.. నా హద్దుల్ని మర్చి పోయినందుకు గుణ పాఠం నేర్చున్నా.. నేనూ ఆడపిల్లను నిరూపించుకోవడానికి డీఎన్ఏ పరీక్షకు సిద్ధమన్నాను అమ్మమ్మా.. తాతయ్యా మీరే చెప్పండి. నాకు ఈ అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అర్దిస్తున్నాను చెప్పండి అని స్వప్న అంటుంది. రాహుల్ మీ తల్లీ కొడుకులు మేలుకోండి. ఒక ఆడపిల్లను అంత ఖచ్చితంగా.. కంఠాభరణంగా సిద్ధమని చెబుతున్నప్పుడు.. మీరు త్వర పడి ఎలాంటి నిర్ణయం అమలు చేయడానికి వీల్లేదు. ఈ పరిస్థితి నుంచి ఎలా పరిష్కారం దిశగా ఆవేశంగా తీసుకునే నిర్ణయం కాదు.. ఆలోచించే నిర్ణయం.. కాబట్టి అంత వరకూ సహనంతో ఉండండి అని చెప్పి వెళ్లి పోతాడు సీతా రామయ్య.

రాహుల్ ని వాయించిన రుద్రాణి..

ఇక రాహుల్ ని లోపలికి తీసుకెళ్లి కొడుతుంది రుద్రాణి. నిన్ను ఈ ఆస్తికి వారసుడిని చేయాలి అని ఉంటే.. నువ్వు మాత్రం ఒకరి మోచేతి నీళ్లు తాగి బతికేస్తానంటావేంటి? జస్ట్ ఆల్ మోస్ట్ దాన్ని బయటకు గెంటేసే దాన్ని. నీవల్లే అది ఇక్కడే ఉంది. నీకు దరిద్రం ఎక్కడో లేదు. నువ్వే నీ లైఫ్ ని నాశనం చేసుకుంటున్నావ్ అని రుద్రాణి.. రాహుల్ ని తిడుతుంది. ఇలా ప్రెగ్నెంట్ అవుతుందని నేను ఊహించలేదని రాహుల్ అంటే.. దాని కడుపుని పోగొట్టాలని రుద్రాణి మరో ప్లాన్ చేస్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా