Bigg Boss 7 Telugu: సీరియల్ బ్యాచ్‌కు చుక్కలు చూపించిన నాగ్.. ప్రియాంకపై సీరియస్.. అశ్విని ఎలిమినేట్..
ముందుగా సెల్ఫ్ నామినేట్ అయినా అశ్విని ఎలిమినేట్ అయ్యింది. ఇక ఆదివారం మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే రైతు బిడ్డ దగ్గరున్న ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకోవచ్చని గుర్తుచేశారు నాగార్జు. కానీ దానిని 14వ వారంలో ఉపయోగించాలని డిసైడ్ అయినట్లు చెప్పాడు. దీంతో అశ్విని ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అయితే అంతకు ముందు మొదటి వారం నుంచి ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా కలిసి కట్టుగా గేమ్ ఆడుతున్న సీరియల్ బ్యాచ్ గుట్టు బయటపెట్టేశారు నాగార్జున.
Bigg Boss 7 Telugu: కలిసికట్టుగా గేమ్ ఆడుతోన్న సీరియల్ బ్యాచ్… ప్రియాంకపై నాగ్ సీరియస్.. అశ్విని ఎలిమినేట్.. బిగ్‌బాస్ సీజన్ 7లో పన్నెండవ వారం వీకెండ్ వచ్చేసింది. గతవారం ఎలిమినేషన్ తీసేయడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే చెప్పారు బిగ్‌బాస్. ఇక ముందు చెప్పినట్టే.. శనివారం ఎపిసోడ్ లో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగిపోయింది. ముందుగా సెల్ఫ్ నామినేట్ అయినా అశ్విని ఎలిమినేట్ అయ్యింది. ఇక ఆదివారం మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే రైతు బిడ్డ దగ్గరున్న ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకోవచ్చని గుర్తుచేశారు నాగార్జు. కానీ దానిని 14వ వారంలో ఉపయోగించాలని డిసైడ్ అయినట్లు చెప్పాడు. దీంతో అశ్విని ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అయితే అంతకు ముందు మొదటి వారం నుంచి ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా కలిసి కట్టుగా గేమ్ ఆడుతున్న సీరియల్ బ్యాచ్ గుట్టు బయటపెట్టేశారు నాగార్జున. ముఖ్యంగా ప్రియాంక చేసిన పనిని వీడియో వేసి మరీ కడిగిపారేశారు. ఇక ఎప్పటిలాగే నాగార్జున ముందు తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పేసింది.
సీక్రెట్ టాస్కు జరుగుతున్న సమయంలో శోభాశెట్టిని పిలిచి చెవిలో ఓ విషయం చెప్పింది ప్రియాంక. ఇక అదే వీడియోను చూపించి ఏం చెప్పావని అడిగారు నాగ్. దీంతో సార్ అది నాకు ముందే తెలుసు అంటూ చిన్నగా నవ్వేసింది ప్రియాంక. ఏం చెప్పావ్ చెప్పు అంటూ మరోసారి సీరియస్ గా అన్నారు నాగ్. దీంతో వీఐపీ వాష్ రూమ్ మాత్రమే ఉపయోగించుకో అని చెప్పినట్లు బయటపెట్టింది ప్రియాంక. ఎందుకు అలా చెప్పావ్ అని అని అడగ్గా.. తను డెడ్ అవ్వాలని అనుకోలేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది ప్రియాంక. అంటే ఫ్రెండ్స్ డెడ్ అవ్వకూడదా అంటే గతంలో శోభా నాకు హెల్ప చేసింది. అందుకే తను డెడ్ అవ్వకూడదు అనుకున్నట్లు తెలిపింది. దీంతో సీరియస్ అయ్యారు నాగ్.
నువ్వు శోభాకు, శోభా అమర్ కు చెప్పుకోవడమా.. ఇది గేమ్ అనుకుంటున్నారా లేదా.. మీలో మీరు ఇచ్చుకుంటూ వెళ్తారా అని అంటూ కడిగిపారేశారు నాగ్. శోభా డెడ్ అవ్వకూడదు.. కానీ యావర్ ను మాత్రం డైవర్ట్ చేశావ్ ఎందుకు అంటే.. మర్డర్ చేసినట్లు నా మీదకు రావద్దని ఆన్సర్ ఇవ్వగా.. అంటే యావర్ మీద తోసేయొచ్చు కానీ శోభాను కాపాడాలి అంటూ అసలు నిజ స్వరూపం బయటపెట్టాడు. ఫ్రెండ్స్ ను కాపాడుకోవడానికి ఆడుతున్నారు అంటూ నాగ్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. దీంతో తప్పు ఒప్పుకుని సారీ చేప్పేసింది ప్రియాంక. మొత్తానికి ఇన్నాళ్లు కలిసి ఆడుతున్న సీరియల్ బ్యాచ్ ను ఈవారం కడిగిపారేశారు నాగ్.