Brahmamudi, November 15th episode: రాజ్ ని ఓ ఆట ఆడుకుంటున్న కావ్య.. స్వప్న కోసం అరుణ్ ని రంగంలోకి దించిన రాహుల్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో పెళ్లికి ఒప్పుకున్నారని కళ్యాణ్ చెప్పే సరికి అనామిక సంతోష పడితే.. అప్పూ మాత్రం బాధ పడుతూ వెళ్లి పోతుంది. ఈ విషయం అనామిక తన పేరెంట్స్ కి కాల్ చేసి చెప్తుంది. ఈ లోపు అప్పూ వెళ్లి పోయిందని గమనించని కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పూని పిలుస్తూన్నా పట్టించు కోకుండా వెళ్తుంది. దీంత కళ్యాణ్ షాక్ అవుతాడు. అప్పుడే అనామిక వచ్చి అప్పూ ఏది అని అడుగుతుంది. వెళ్లి పోయిందని చెప్తాడు కళ్యాణ్. ఈ సీన్ కట్ చేస్తే.. అరుని పిలిపిస్తాడు రాహుల్. ఏంటి సర్ అలా సీరియస్ గా చూస్తున్నారని అరుణ్ అడిగితే..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో పెళ్లికి ఒప్పుకున్నారని కళ్యాణ్ చెప్పే సరికి అనామిక సంతోష పడితే.. అప్పూ మాత్రం బాధ పడుతూ వెళ్లి పోతుంది. ఈ విషయం అనామిక తన పేరెంట్స్ కి కాల్ చేసి చెప్తుంది. ఈ లోపు అప్పూ వెళ్లి పోయిందని గమనించని కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పూని పిలుస్తూన్నా పట్టించు కోకుండా వెళ్తుంది. దీంత కళ్యాణ్ షాక్ అవుతాడు. అప్పుడే అనామిక వచ్చి అప్పూ ఏది అని అడుగుతుంది. వెళ్లి పోయిందని చెప్తాడు కళ్యాణ్. ఈ సీన్ కట్ చేస్తే.. అరుని పిలిపిస్తాడు రాహుల్. ఏంటి సర్ అలా సీరియస్ గా చూస్తున్నారని అరుణ్ అడిగితే.. నువ్వు నా వైఫ్ స్వప్నని ప్రేమించావా అని అడుగుతాడు. లేదు జస్ట్ మేము ఫ్రెండ్స్ మాత్రమే అని అరుణ్ చెప్పినా.. నువ్వు కాలేజీలో స్వప్నకి ప్రపోజ్ చేశావు కదా.. అంతే కాకుండా నేను లేవదీసుకు పోయిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటానని వచ్చావు నిజమేనా అని అడుగుతాడు రాహుల్. దానికి అరుణ్ ఏమీ సమాధానం చెప్పకుండా ఉంటాడు.
అరుణ్ తో కలిసి స్వప్న జీవితం ప్లాన్ చేయడానికి సిద్ధమైన రాహుల్:
కంగారు పడకు.. నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. సొంతంగా హాస్పిటల్ పెట్టాలి అనుకుంటున్నావ్ కదా.. దానికి పర్మిషన్ నేను వచ్చేలా చేస్తానని రాహుల్ అంటే.. దానికి బదులుగా నేనేం చేయాలని అరుణ్ అడుగుతాడు. గుడ్ నీలో బిజినెస్ మ్యాన్ అయ్యే లక్షణాలు బాగా ఉన్నాయని రాహుల్ పొగుడుతాడు. కరెక్ట్.. నువ్వు స్వప్నతో రిలేషన్ లో ఉండాలి అని రాహుల్ అనగానే.. అరుణ్ షాక్ అవుతాడు. దానికి నో నువ్వు రిలేషన్ లో ఉన్నట్టు నటించాలి. అలా మా ఇంట్లో వాళ్లందర్ని నమ్మించాలని రాహుల్ చెప్తాడు. మీది చాలా పెద్ద ఫ్యామిలీ.. ఏదైనా జరిగితే జైల్లో పెడతారామో అని అరుణ్ అంటాడు. అలాంటివి ఏమీ జరగకుండా నేను చూసుకుంటానని రాహుల్ చెప్తే.. ఓకే అని చెప్తాడు అరుణ్.
కావ్య డ్రామా షురూ.. తెల్లబోయిన రాజ్:
ఆ తర్వాత హాల్ లోకి వచ్చిన ధాన్య లక్ష్మి.. ఓ బోర్డు చూసి షాక్ అవుతుంది. దాని మీద ‘సారి కళావతి’ అని ఉంటుంది. నెక్ట్స్ ఒక్కొక్కరు ఇంటి సభ్యులందరూ వచ్చి.. ఆ బోర్డు చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇదంతా పైనుంచి చూస్తుంది కావ్య. ఏమో అనుకున్నా కానీ రాజ్ మామోలోడు కాదు అక్కా అని ధాన్య లక్ష్మి అంటే.. అంత గొడవ జరిగినా క్షమించేసాడు. ఏ మాత్రం సిగ్గు పడకుండా సారీ చెప్పేశాడని రుద్రాణి అంటే.. అందులో సిగ్గు పడేది ఏముంది అని సుభాష్ అంటాడు. నలుగురిలో ఎవరైనా అరుస్తారు. కానీ ఇలా సారీ చెప్పాలంటే పెద్ద మనసు ఉండాలి అని ఇందిరా దేవి అంటుంది. దీంతో రుద్రాణి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఈలోపు పై నుంచి కావ్య ఏమీ తెలీనట్టు కిందకు వస్తుంది. ఏమైంది అందరూ ఇక్కడ ఉన్నారేంటి? ఆ బోర్డు మీద ఉన్నది చూసి షాక్ అయినట్లు నటిస్తుంది. ఎవరు పెట్టారు అని అడుగుతుంది కావ్య. ఈ ఇంట్లో నిన్ను ప్రేమగా ఎవరు చూస్తారు రాజే కదా అని ధ్యాన్య లక్ష్మీ అంటే.. రాజ్ ఇలా అస్సలు చేయడు నువ్వు కానీ చెప్పి చేయించావా అని రుద్రాణి అంటుంది. అయ్యో నాకు అస్సలు తెలీదు. ఆయన నా మాట అస్సలు వినరు కదా అని కావ్య అంటుంది. ఇక అప్పుడే రాజ్ బయటి నుంచి వస్తాడు. ఏంటి ఇంత మార్నింగే మీటింగ్ పెట్టారు. ఎవరేం చేశారేంటి? అని రాజ్ అడుగుతాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ ఒక్కో మాట చెప్తూ ఉంటారు. దీనికి రాజ్ కంగారు పడతాడు.
కావ్య వీర లెవల్ యాక్టింగ్ చూసి నోరెళ్ల బెట్టిన రాజ్:
ఇక వచ్చి బోర్డు చూసి నోరెళ్ల బెడతాడు రాజ్. ఏం తప్పు చేశావని ఇలా సారీ చెప్పావేంటి? అని ఇందిరా దేవి అడగ్గా.. అపర్ణ కూడా సీరియస్ అవుతుంది. లోలోపల మండుతూ పైకి వెటకారంగా నవ్వుతాడు రాజ్. ఇక అప్పుడే కావ్య కవర్ చేస్తుంది. అయితే ఇలా బోర్డుల మీద.. గోడల మీద ఎందుకు.. నోటితో చెప్పేయ్ అటుంది ధాన్య లక్ష్మి. రాజ్ సారీ చెప్పడానికి ప్రిపేర్ అవుతుండగా.. కావ్య అడ్డు పడి వద్దు చెప్పకండి అని ఏదో ఏదో మాట్లాడుతుంది. రాజ్ మాత్రం లోపల ఓరి నీ యాక్టింగో అని అనుకుంటాడు. ఆ తర్వాత టిఫిన్ చేయడానికి వెళ్తూ.. కావ్య కన్ను కొడుతుంది.
అప్పూ దగ్గరికి వచ్చిన కళ్యాణ్.. తను మన అప్పూ కదు ఆంటీ:
ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ బాధ పడుతూ ఉంటుంది. అప్పడే కళ్యాణ్ వచ్చి అప్పూని పిలుస్తాడు. అప్పూ.. కళ్యాణ్ వచ్చాడు రా అని పిలుస్తుంది. లేదు పెద్దమ్మా.. నేను రాను పడుకున్నా అని చెప్పు అంటుంది. బ్రో నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నేను ఓ గుడ్ న్యూస్ చెప్తే.. కనీసం కంగ్రాట్స్ చెప్పకుండా వచ్చేసింది ఆంటీ అని కళ్యాణ్ చెప్పగా.. అదో మెంటల్ కేసు నువ్వు చెప్పు బాబు అని కనకం అడుగుతుంది. నాకు పెళ్లి ఫిక్స్ అయిందని కళ్యాణ్ చెప్పగా.. కనకం ఆనంద పడుతుంది. కానీ అప్పూ మాత్రం సీరియస్ అవుతుంది. ఈ లోకంలో నీకే పెళ్లి జరుగుతున్నట్లు ఎందుకు అంత హడావిడి చేస్తున్నావ్ అని అప్పూ అనగా.. ఏయ్ ఏంటే ఆ తల పొగరు అని కనకం అప్పూపై సీరియస్ అవుతుంది. నేను ఇంతే.. ఇట్లానే మాట్లాడతా.. నచ్చితే ఉండమను.. లేదంటే వెళ్లిపొమ్మను. నాకు ఎవ్వరూ లేరు.. నేను ఎప్పటికైనా ఒంటరి దాన్నే అని చెప్పి అప్పూ వెళ్లి పోతుంది.
కళ్యాణ్ ఫొటోను చూసి బాధ పడుతున్న అప్పూ.. యాక్టింగ్ ఇరగదీస్తున్న కావ్య:
అదేంటి? ఆంటీ మీరు, నేను ఇప్పుడు ఏం అన్నామని.. ఈ మధ్య అప్పూని నా మీద ఊరి ఊరికే కోపం వస్తుందని కళ్యాణ్ ఫీల్ అయితే.. అయ్యో అదేం లేదు బాబూ అని కనకం అంటుంది. ఎందుకో ఆంటీ తను ఇది వరకు అప్పూలా లేదు.. మీరే ఎలాగైనా ఒప్పించి.. నా పెళ్లి పనులు అన్నీ తనే చూసుకోవాలని చెప్పండి అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ వెళ్లి పోతాడు. ఏంటి అక్కా దెయ్యం గానీ పట్టిందా ఏంటి? అని కనకం అడుగుతుంది. కానీ అప్పూ మాత్రం కళ్యాణ్ ఫొటో చూస్తూ బాధ పడుతూ ఉంటుంది. మరోవైపు కావ్యని కడిగి పారేద్దామని రాజ్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆగు.. ఏంటి నువ్వు చేసిన పని అని రాజ్ అడగ్గా.. ఉల్లి పాయలు కోసి.. సాంబార్ లో దంచి.. వెల్లుల్లి పాయలు దంచి పోపులో వేశానని చెప్తుంది కావ్య. ఇదంతా విన్న కావ్య ఏంటి స్మార్ట్ గా సమాధానం చెప్తున్నావా అని రాజ్ ఫైర్ అవుతాడు. దానికి కావ్య నవ్వి.. నేను స్మార్ట్ గా ఉంటానని అందరూ అంటారు. ఇప్పుడు స్మార్ట్ గా మాట్లాడుతున్నానని మీరు అంటున్నారు అని కావ్య నవ్వుతుంది.