Brahmamudi, November 14th episode: కావ్యని దూరంగా వెళ్లిపొమన్న రాజ్.. అప్పూకి షాక్ ఇచ్చిన కళ్యాణ్.. స్వప్నపై రాహుల్ కుట్ర!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో సీతా రామయ్యకు నయం అవుతుందని చెప్పి వెళ్లి పోతాడు డాక్టర్. నాకు చాలా ఆనందంగా ఉందని మురిసి పోతుంది ఇందిరా దేవి. దీంతో పెద్దాయన జోకులు వేస్తారు. ఈ జోకులకు ఇంట్లోని వారందరూ సంతోషంగా నవ్వుతారు. ఇక నుంచి ఆ పొరపాట్లనే పట్టుకుని సాధించకుండా.. అందరూ సంతోషంగా, ఆదర్శంగా ఉండాలి. ఈ మనస్పర్దలు అన్నీ పోయి అందరూ ఆనందంగా ఉండాలంటే ఓ శుభ కార్యం జరగాలి అని పెద్దాయన అంటే.. ఇంకేముంది అయితే మన కళ్యాణ్ పెళ్లి అనుకున్నాం కదా..

Brahmamudi, November 14th episode: కావ్యని దూరంగా వెళ్లిపొమన్న రాజ్.. అప్పూకి షాక్ ఇచ్చిన కళ్యాణ్.. స్వప్నపై రాహుల్ కుట్ర!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Nov 14, 2023 | 9:56 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో సీతా రామయ్యకు నయం అవుతుందని చెప్పి వెళ్లి పోతాడు డాక్టర్. నాకు చాలా ఆనందంగా ఉందని మురిసి పోతుంది ఇందిరా దేవి. దీంతో పెద్దాయన జోకులు వేస్తారు. ఈ జోకులకు ఇంట్లోని వారందరూ సంతోషంగా నవ్వుతారు. ఇక నుంచి ఆ పొరపాట్లనే పట్టుకుని సాధించకుండా.. అందరూ సంతోషంగా, ఆదర్శంగా ఉండాలి. ఈ మనస్పర్దలు అన్నీ పోయి అందరూ ఆనందంగా ఉండాలంటే ఓ శుభ కార్యం జరగాలి అని పెద్దాయన అంటే.. ఇంకేముంది అయితే మన కళ్యాణ్ పెళ్లి అనుకున్నాం కదా.. కళ్యాణ్ పెళ్లి జరిపిద్దాం అని ఇందిరా దేవి అంటుంది. ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ ఆకలి లేదని అంటే.. కనకం వాళ్ల అక్క బలవంతంగా తినిపిస్తుంది. సరిగ్గా అప్పుడే కావ్య ఫోన్ చేసి.. తాతయ్య గారికి నయం అవుతుందని డాక్టర్ చెప్పారని చెప్తుంది. దీంతో కనకం వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు.

కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ దిగాలుగా ఉన్న అప్పూ:

అయితే అప్పూ మాత్రం కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ దిగాలుగా ఉంటుంది. మరోవైపు కనకం ఏమో అప్పూ మీద సెటైర్లు వేస్తూ.. ఇది మన అప్పూలా ఉండటం లేదని అంటుంది. ఏమైంది తనకి ఒంట్లో బాగోలేదా అని కృష్ణ మూర్తి అడిగితే.. నాకేం రోగం నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. ఈ లోపు అప్పుడే సరిగ్గా కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. అయినా అప్పూ ఫోన్ లిఫ్ట్ చేయదు. అది చూసిన కనకం.. ఫోన్ లిఫ్ట్ చేయమని అడిగినా లిఫ్ట్ చేయదు. ఆ తర్వాత కనకం తిట్టి వెళ్లి పోతుంది. దీంతో ఫ్రస్ట్రేషన్ గా ఫోన్ లిఫ్ట్ చేసి కళ్యాణ్ ని తిడుతుంది. అర్జెంటుగా కలవాలని కళ్యాణ్ అడిగితే.. అప్పూ రానని చెప్తుంది. అయినా వినిపించుకోని కళ్యాణ్ రమ్మని చెప్పేస్తాడు. మరోవైపు కనకం కూడా వెళ్లమని చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్.. అనామికకు కూడా కాల్ చేసి వెంటనే కలవాలని చెప్తాడు. సరే అంటుంది అనామిక.

ఇవి కూడా చదవండి

సంతోషంగా ఉన్న రాజ్.. ప్రేమించుకుందాం అన్న కావ్య:

సీతా రాయ్యకు నయం అవుతుందని చెప్పగానే రాజ్ ఇక సంతోషంగా బయట ఊయల ఊగుతూ ఉంటాడు. అప్పుడే రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. ఇక కాసేపు మళ్లీ వీళ్లిద్దరూ గిల్లిగజ్జాలు ఆడుకుంటారు. తాతయ్యని కాపాడుకోవచ్చని తెలిశాక నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది కావ్య. నా ఆనందాన్ని పరాయివాళ్లతో పంచుకోను అని రాజ్ అంటే కావ్య ఫైర్ అవుతుంది. ఏవండీ మన మధ్యలోకి ఆ తింగరిది ఎందుకు వచ్చింది. నేను రోలు అయితే.. అది మద్దెల. భర్త, అత్తా ఇద్దరూ కలిసి ఆడేసుకుంటున్నారని కావ్య అంటుంది. ఎంత ఆడేసుకుంటే ఏం లాభం మీరు ఆడే ఆటల ముందు అన్నీ బలాదూరే అని రాజ్ అంటాడు. ఏవండీ నేను మీతో మాట్లాడదామని వచ్చాను. మీరేమో పోట్లాడుతూనే ఉన్నారని కావ్య అంటే.. ఏమీ లేదని రాజ్ అంటాడు. ఇప్పుడు కొత్తగా మొదలైంది. మనం తప్పని సరిగా మాట్లాడు కోవాలి.. ప్రేమించు కోవాలని కావ్య అంటే.. పళ్లు రాలతాయని రాజ్ అంటాడు. హా.. అదేంటి పెళ్లాం, మొగుడు ప్రేమించుకుంటే పళ్లు రాలతాయా అని కావ్య అడుగుతుంది. కానీ రాజ్ మాత్రం చిరాకు పడుతూనే ఉంటాడు.

ఒక్కటై పోవాలన్న కావ్య.. దూరంగా వెళ్లి పొమ్మన్న రాజ్:

కుటుంబం మొత్తం తాతయ్యని సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నారని కావ్య అంటే.. మా కుటుంబంలో నువ్వు లేవు కాబట్టి అది నీకు వర్తించదని రాజ్ అంటాడు. సరే ఈ విషయం మన మధ్యే ఉండాలా లేక ఇంట్లో అందరికీ తెలియాలా అని అని అంటుంది కావ్య. ఏంటి నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని రాజ్ అంటాడు. అది కాదండి మన ఇద్దరి మధ్య ఉండే మనస్పర్దల వల్ల తాతయ్య గారి మనసు బాధ పడకూడదు. అది ఆయన ఆరోగ్యానికి చాలా మంచిదని కావ్య చెప్తూ ఉంటే.. ఏంటి ఇప్పుడు దీన్ని అడ్వాన్ టేజ్ తీసుకుని ఒక్కటై పోవాలని చూస్తున్నావా అని రాజ్ అడిగితే.. అసలు మీ సమస్య ఏంటని కావ్య అడుగుతుంది. నువ్వే నా సమస్య.. నువ్వు దూరంగా ఉంటే నాకు సమస్యే లేదని రాజ్ అంటే.. అది నా వల్ల కాదని కావ్య చెప్తుంది. నా వల్ల అవుతుంది.. నీలాగ నాకు అద్భుతంగా నటించడం రాదని రాజ్ అంటే.. మీరు మీ ఫ్యామిలీ కోసం నటించారు.. నేను నా అక్క కోసం నటించాను ఇందులో ఇద్దరి తప్పూ ఉంది.

నేను నటించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారు: కావ్య

నాది నాటకం అయితే.. మీదీ నాటకమే అని కావ్య అంటుంది. నీతో కలిసి కాపురం చేయాలని ఎప్పుడూ అనుకోవడం లేదు. భార్యగా ఎప్పుడూ ఒప్పుకోదలచు కోలేదని రాజ్ తెగేసి చెప్తాడు. అంటే నేను కూడా ఈ ఇంట్లో మీలా నటించాలా అని కావ్య అడిగితే.. ఈ మొహం పెట్టుకుని ఉండాలనుకుంటే ఉండని రాజ్ హార్ష్ గా మాట్లాడతాడు. నేను నిజంగా నటిస్తే.. అది నిజం కాదని ఎవ్వరూ ఊహించ లేరని కావ్య అంటే.. రాజ్ నవ్వుతాడు. సరే అయితే మీకు కావాల్సింది నటనే కదా.. ఆయన మారాలి అంటే ఆయన రూట్ లోనే వెళ్లాలి అనుకుంటుంది కావ్య. నేను కూడా నటించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో మీరు ముందు ముందు మీరే చూస్తారు వస్తాను అని వెళ్లి పోతూ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది కావ్య.

స్పప్నపై మరో ప్లాన్ సిద్ధం చేసిన రుద్రాణి, రాహుల్:

ఈ సీన్ కట్ చేస్తే.. స్వప్న వైపు కోపంగా చూస్తాడు రాహుల్. అప్పుడే వచ్చిన రుద్రాణి.. ఒక వైపు ఆస్తి దక్కలేదని బాధ పడుతుంటే.. నువ్వు నీ పెళ్లం రెడీ అవుతుందని మురిసి పోతున్నావా అని అంటుంది. లేదు మామ్.. నీ కోడల్ని ఇంట్లో నుంచి ఎలా తరిమేయాలని ఆలోచిస్తున్నా అని రాహుల్ అంటాడు. ఇప్పటికే ఈ ఇంట్లో అందరూ మన మీద కోపంగా ఉన్నారు. ఈ పిచ్చి పనులు ఆపు. నిన్ను కవర్ చేయలేక నేను చచ్చి పోతున్నా అని రుద్రాణి అంటుంది. ఎలాగైనా దీన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే.. గొడవ వదిలి పోతుంది. అలాగే స్వప్నకి కాలేజ్ లో ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. స్వప్న కోరింది కొనిచ్చేవాడు. చివరికి ప్రేమ అనేసరికి నో అని సైడ్ చేసేంది స్వప్న. వాడు మాత్రం స్వప్న ఇంట్లో వాళ్లని ఒప్పించాడు కానీ చివరిలో స్వప్న పెళ్లి ఆపేసింది. కానీ పెళ్లికి ముందు చేస్తే తప్పు లేదు. కానీ ఆ తర్వాత రిలేషన్ లో ఉంటే అని రాహుల్ చెప్తే.. రుద్రాణి షాక్ అవుతుంది. కానీ మనం పెళ్లి తర్వాత కూడా రిలేషన్ లో ఉందని నమ్మించి.. ఇంట్లో వాళ్లని ఒప్పిస్తే సరిపోతుంది కదా అని రాహుల్ చెప్తాడు. అయితే ఇంట్లో అందర్నీ నమ్మించడం చాలా కష్టం.. ముందు రాజ్ కి, అపర్ణకి అనుమానం వచ్చేలా చేయాలి. నెక్ట్స్ రాహుల్, రుద్రాణి కలిసి ప్లాన్ వేస్తారు.

అప్పూకి షాక్ ఇచ్చిన కళ్యాణ్.. హ్యాపీలో అనామిక:

ఇక రోడ్డు మీద అప్పూ, అనామికలను బయటకు పిలిచి ఆన్ లైన్ లో ఆర్డర్ పెడతాడు కళ్యాణ్. నాకు పని ఉందని చెప్పినా పిలిచావ్.. అని అప్పూ చిరాకు పడుతుంది. ప్రతి దానికి విసుక్కుంటున్నావ్ అని కళ్యాణ్ అంటాడు. వీళ్లిద్దరూ గొడవ పడటం చూసి అనామిక వింతగా చూస్తుంది. ముందు మీరు గొడవలు పడటం మానేసి ముందు అందేంటో చెప్పు టెన్సన్ తో చచ్చిపోతున్నా అని అంటుంది అనామిక. మా ఇంట్లో వాళ్లు మన పెళ్లికి డేట్ ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారని కళ్యాణ్ చెప్పేస్తాడు. ఇది విన్న అప్పూ షాక్ అవుతుంది. కానీ అనామిక మాత్రం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనామిక వెళ్లి కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్