Bigg Boss 7 Telugu:ఏంటి మమ్మీ.. ఎవరీళ్లు..! మరీ ఇంత దారుణంగా ఉన్నారు..

దివాలీ పండగ దినాన.. లక్ష్మీ బాంబ్‌లా పేలుతుందనుకున్న ఇవ్వాళ్టి నామినేషన్స్ ఎపిసోడ్ ... బిగ్ బాస్ అంచనాలకు అందని విధంగా తుస్సు మంది. మరి అందుకు కారణం ఎవరంటారా..? మన ల్యాగ్ స్టార్ రతిక & ఆమెకు సపోర్ట్‌గా.. వెన్నుదన్నుగా ఉన్న క్రైయింగ్ స్టార్ అశ్విని! మరి వీళ్లిద్దరి మూకుమ్మడి నామినేషన్‌ పోరాటం ఎవరి మీద అంటారా..? బిగ్ బాస్ డామినేషన్స్ రాణులు శోభ, ప్రియాంక మీద! ఇక వీళ్లదే కాక మధ్యలో మరో ఇరిటేటెడ్‌ నామినేషన్ కూడా ఉంది. మరి ఇది ఎవరిదంటారా? అర్జున్‌ది..! ఇలా మూకుమ్మడిగా... హౌస్‌లో ఉన్న ఈ కంటెస్టెంట్స్.. ఇవ్వాళ్టి ఎపిసోడ్‌ను పేద్ద... ల్యాగ్ గా.. సోది నామినేషన్స్‌గా మార్చారు. ఆశగా.. ఆతురతగా చూస్తున్న బిగ్ బాస్ ఆడియెన్స్‌ను తల పట్టుకునేలా చేశారు.

Bigg Boss 7 Telugu:ఏంటి మమ్మీ.. ఎవరీళ్లు..! మరీ ఇంత దారుణంగా ఉన్నారు..
Bigg Boss 7 Telugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 14, 2023 | 2:09 AM

దారుణంగా.. అత్యంత ఘోరంగా.. చాలా ల్యాగ్‌గా.. భరించలేనంత ఇరిటేటెడ్‌గా సాగింది ఇవ్వాళ్టి అంటే 72వ ఎపిసోడ్‌! చెప్పడానికి.. మీరు చదవడానికి కాస్త అతిగా ఉన్నా కూడా.. ఇదే నిజం. నిజంగా నిజం! ఎప్పుడూ నామినేషన్స్ డే అంటే.. ఏదో హీటెడ్ డిస్కషన్ ఉంటుందనే ఫీలింగ్ మనందర్లో ఉంది. హౌస్‌ మేట్స్ మధ్య కొట్లాటలు.. వాదనలు.. ఛాలెంజ్‌లు విసురుకోడాలు.. ఈక్రమంలో హద్దులు దాటడాలు..! ఇలా ఉంటుంది.. సాగుతుందనే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మనలో ఉంది.

దివాలీ పండగ దినాన.. సుతిల్ బాంబులా… పోనీ.. లక్ష్మీ బాంబ్‌లా పేలుతుందనుకున్న ఇవ్వాళ్టి నామినేషన్స్ ఎపిసోడ్ … బిగ్ బాస్ అంచనాలకు అందని విధంగా తుస్సు మంది. మరి అందుకు కారణం ఎవరంటారా..? మన ల్యాగ్ స్టార్ రతిక, & ఆమెకు సపోర్ట్‌గా.. వెన్నుదన్నుగా ఉన్న క్రైయింగ్ స్టార్ అశ్విని! మరి వీళ్లిద్దరి మూకుమ్మడి నామినేషన్స్ పోరాటం ఎవరి మీద అంటారా..? బిగ్ బాస్ డామినేషన్స్ రాణులు శోభ, ప్రియాంక మీద!

వీళ్లదే కాక మధ్యలో మరో ఇరిటేటెడ్‌ నామినేషన్ ఉంది. మరి ఇది ఎవరిదంటారా? అర్జున్‌ది..! ఆయన నామినేషన్ ఎలిగేషన్స్‌కు… సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ది. ఇలా మూకుమ్మడిగా… హౌస్‌లో ఉన్న ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ ఇవ్వాళ్టి ఎపిసోడ్‌ను ల్యాగ్ చేశారు. సోది నామినేషన్స్‌గా మార్చారు. ఆశగా.. ఆతురతగా చూస్తున్న బిగ్ బాస్ ఆడియెన్స్‌కు తలనొప్పి వచ్చేలా.. తల పట్టుకునేలా చేశారు.

ఇక ఇవ్వాళ్టి ఎపిసోడ్‌.. శివాజీ, రతికకు హిదబోధ చేస్తున్న సీన్‌తో మొదలైన బిగ్ బాస్… ఆ తరువాత ఎలాంటి ల్యాగ్ లేకుండానే నామినేషన్స్‌కు షిఫ్ట్ అవుతుంది. కానీ సరిగ్గా అక్కడే రతిక కారణంగా షోకు బ్రేకు పడుతుంది.

తన వంతు వచ్చిన ప్రతీ సారీ.. చివర్లో వెళతా..! ఆలోచించడానికి టైం తీసుకుంటా…! ఎవరిని ఎంచుకోవాలో తెలియడంలేదు.. ! అంటూ ల్యాగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రతిక.. బిగ్ బాస్ పిలుపుతో.. ఈ సారి నామినేషన్స్‌ను స్టార్ట్‌ చేయాల్ని వచ్చింది. కానీ తనకలవాటైన పద్దతిలోనే.. నామినేషన్స్‌కు వెళ్లకుండా.. ఆలోచించుకుంటూ తన స్థానంలోనే ఉండి పోయింది.

ఓ పక్క కెప్టెన్ శివాజీ చెబుతున్నా.. మరో పక్క అమర్ బిగ్ బాస్ సీరియస్ అవుతారని వార్న్‌ చేస్తున్నా.. తన ల్యాగ్‌తో.. లేజీ యాటిట్యూడ్‌తో.. రతిక అలాగే ఉంది పోయింది. దీంతో బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చేలా చేసుకుంది. పోనీ బిగ్ బాస్ వార్నింగ్‌కు భయపడి నామినేషన్స్ మొదలెట్టిందా.. అంటే.. అదీ లేదు. తన మైండ్‌లో ఒకరే ఉన్నారు. రెండో నామినేషన్ ఎవరు అనేది ఆలోచించుకోవాలి.. అంటూ.. మళ్లీ బిగ్ బాస్‌నే రిక్వెస్ట్ చేసింది రతిక. దీంతో బిగ్ బాస్ .. ఇక చాలు నీ ఎక్స్‌ట్రాలు అన్నట్టు.. కాస్త సీరియస్ అయ్యాడు. వెంటనే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయకపోతే… సెల్ఫ్ నామినేట్ చేస్తా అంటూ వార్న్‌ చేస్తాడు.

ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన ఈ ఒక్క వార్న్‌తో రెచ్చిపోయే మోడ్‌లోకి షిప్ట్ అయిన రతిక.. ఫస్ట్ నామినేషన్‌గా శోభను, తన సెకండ్ నామినేషన్‌గా ప్రియాంకను ఎంచుకుంటుంది. ఇక ఆక్రమంలోనే ఇద్దరితో ఓ రేంజ్‌లో గొడవ పడుతుంది. అయితే రతిక నామినేషన్స్‌లో సరైన కారణాలు ఉన్నాయా? లేవా? అన్నది పక్కకు పెడితే… తన నామినేషన్ ప్రక్రియలో రతిక అరవడమే ఎక్కువైంది. కంటెంట్ ఇచ్చేందుకు గట్టిగా ట్రై చేసినట్టే అనిపించింది. ఆ క్రమంలోనే శివాజీ హితబోధ గాలికి వదిలేసింది.

ఇక అటు శోభ, ప్రియాంక కూడా.. రతికకు తోడై… బీబీ చూస్తున్న ఆడియెన్స్‌ గూబగుయ్‌ మనేలా చేశారు. నాన్ సింకులో మాట్లాడుతూ.. మధ్యలో మధ్యలో అనవసరంగా అరుచుకుంటూ… నానా రచ్చ చేశారు. పాపం అనవసరంగా కింగ్ నాగ్‌ను కూడా మధ్యలో లాగారు. బిగ్ బాస్‌ పై కూడా అరిచారు.. ఇలా మొత్తానికి అందరికీ దిమ్మతిరిగేలా చేశారు. మీమర్స్‌కు మంచి కంటెంట్‌గా దొరికిపోయారు.

ఇక రతిక తర్వాత … నామినేషన్ ప్రక్రియలోకి వచ్చిన ప్రియాంక .. టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టు.. రతికను.. రతిక ఫ్రెండ్ అశ్విని నామినేట్ చేస్తుంది. ఆ క్రమంలో కూడా వీళ్ల సోది డిస్కషన్ అందరికీ కన్నీళ్లు పెట్టిస్తుంది. తల పట్టుకునేలా చేస్తుంది. ఇక ఆ తరువాత వచ్చిన అర్జున్ కూడా ప్రశాంత్‌ను నామినేట్ చేస్తూ… అమ్మాయిలను తీసిపోని విధంగా గోల చేయడం కూడా అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. దీని వల్ల.. అర్జున్ పై కాస్త నెగెటివిటీ కూడా పడేలానే ఉంది.

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్