Brahmamudi, December 30th episode: పెళ్లి మండపంలో కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నట్టు చెప్పేసిన అప్పూ.. కళ్యాణ్ ఏం చేస్తాడో!
'మహా సంగ్రామం ఎపిసోడ్' ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. గత పది రోజులుగా సాగుతున్న బ్రహ్మముడి, నువ్వూ నేను ప్రేమ సీరియల్స్ నటులు చేస్తున్న మహా సంగ్రామం ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. కళ్యాణ్, అనామికల పెళ్లి సందర్భంగా రెండు సీరియల్స్‌కి సంబంధించిన యాక్టర్స్ కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కళ్యాణ్, అనామికల పెళ్లికి సంబంధించి అన్ని రకాల పెళ్లి వేడుకలు పూర్తి కాగా.. అసలు ఘట్టం ఈ రోజు..
‘మహా సంగ్రామం ఎపిసోడ్’ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. గత పది రోజులుగా సాగుతున్న బ్రహ్మముడి, నువ్వూ నేను ప్రేమ సీరియల్స్ నటులు చేస్తున్న మహా సంగ్రామం ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. కళ్యాణ్, అనామికల పెళ్లి సందర్భంగా రెండు సీరియల్స్‌కి సంబంధించిన యాక్టర్స్ కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కళ్యాణ్, అనామికల పెళ్లికి సంబంధించి అన్ని రకాల పెళ్లి వేడుకలు పూర్తి కాగా.. అసలు ఘట్టం ఈ రోజు జరగనుంది. దీంతో ఇవాళ్టి పెళ్లిలో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.
ఈ సస్పెన్స్‌లు చూస్తుంటే కళ్యాణ్ – అనామికల పెళ్లి ఎలా జరుగుతుందో.. అసలు జరుగుతుందో లేదో అన్న క్యూరియాసిటీ నెలకొంది. ఒక వైపు కళ్యాణ్.. అనామికను ఇష్ట పడుతూ పెళ్లికి సిద్ధమయ్యాడు. మరోవైపు అప్పూపై ప్రేమను కూడా చూపిస్తున్నాడు. దీంతో అనామికను పెళ్లి చేసుకుంటాడో లేక అప్పూ మెడలో తాళి కడతాడో తెలియాలంటే ఎదురు చూడాల్సి ఉంది. ఇక నాలుగు రోజుల నుంచి మహా సంగ్రామం ఎపిసోడ్స్‌ని రివీల్ చేయకుండా ప్రేక్షకులను సస్పెన్స్‌లో ఉంచుతున్నారు. ఇలా క్షణం క్షణం కళ్యాణ్ పెళ్లిలో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులను సస్పెన్స్ లో పెట్టారు. ఈ రోజు మహా సంగ్రమం ఎపిసోడ్‌ని ముందుగా విడుదల చేయలేదు. నిన్నటి ప్రోమో ప్రకారం కళ్యాణ్ పెళ్లి ఆగిపోతుందని మాత్రం తేలింది.
ఆగిన కళ్యాణ్ పెళ్లి..
కళ్యాణ్, అనామికలను పెళ్లి బట్టలు మార్చుకుని రమ్మంటాడు పంతులు గారు. ఈలోపు కళ్యాణ్, అనామికల పెళ్లిని ఆపడానికి తెగ ట్రై చేస్తుంది రుద్రాణి. ఈలోపు రుద్రాణి చేతికి బంటి రాసిన లెటర్ అందుతుంది. దీంతో అవకాశం కోసం రెచ్చిపోయిన రుద్రాణి.. ఆ లెటర్ తీసుకుని ధాన్య లక్ష్మికి చూపిస్తుంది. అది చూసిన ధాన్య లక్ష్మి షాక్ అవుతుంది. వెంటనే పెళ్లి మండపం దగ్గరకు వచ్చి.. అప్పూని, కనకాన్ని పట్టుకుని దులిపేస్తుంది. ఇది నాటకం కాదు ఆంటీ.. నిజంగానే నేను కళ్యాణ్‌ని ప్రేమించానని అప్పూ చెప్తుంది. అప్పూ నిజం చెప్పడంతో.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి అప్పూ ప్రేమ గురించి కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఈ నిజం తెలుసుకున్న అనామిక అండ్ ఫ్యామిలీ ఏం చేస్తారు? కనకం ఫ్యామిలీ ఎలాంటి నిందలు మోస్తారో తెలియాలంటే ఈ రోజు రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే.
నిన్నటి ఎపిసోడ్‌లో..
తాగిన మైకంలో కళ్యాణ్‌కు ఐలవ్‌వ్యూ చెప్తుంది అప్పూ. ఇది విన్న శైలు, సుబ్రమణ్యంలు ఒక రేంజ్‌లో అప్పూ, కనకంపై నిందలు వేస్తారు. దొరికిందే సందు కదా అని రుద్రాణి కూడా రెచ్చి పోతుంది. దీంతో కళ్యాణ్ రియాక్ట్ అయి.. ఒక ఫ్రెండ్.. ఇంకో ఫ్రెండ్‌ని హగ్ చేసుకుని ఐలవ్‌వ్యూ చెప్పుకోరా.. ఏ కాలంలో ఉన్నారు? అని అంటాడు. కళ్యాణ్‌కు ఇందిరా దేవి కూడా మద్దతు ఇస్తుంది. నెక్ట్స్ అందరూ కలిసి సంతోషంగా డ్యాన్సులు చేస్తారు.
ఆ తర్వాత అరుణ్‌ని లాక్కుని కనకం, స్వప్న వెళ్లడం.. మురళి చూస్తాడు. అదంతా చూసి తాగుబోతు సన్నీ.. ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉందని వీడియో తీసి రికార్డ్ చేస్తారు. అరుణ్‌ని కట్టిపారేయడం చూసిన మురళి.. వెంటనే ఈ మేటర్ రుద్రాణి వాళ్లకు చెప్పాలని వెళ్లి.. వాళ్లను తీసుకొస్తాడు.
ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్, అనామికలు పెళ్టి పీటల మీద కూర్చుని గణపతి పూజ చేస్తూ ఉంటారు. అరుణ్ దగ్గరకు వెళ్లిన రుద్రాణి గ్యాంగ్.. కట్లు విప్పి.. అప్పటికప్పుడు మరో ప్లాన్ వేసేస్తారు. ఇక పెళ్లి మండపంలోకి వెళ్లి రచ్చ స్టార్ట్ చేస్తుంది రుద్రాణి. అదే సమయానికి పద్మావతి.. అరుణ్‌ని తీసుకొచ్చి.. అసలు నిజం చెప్పిస్తారు. రాజ్, విక్కీలు కలిసి అరుణ్ చేత నిజం చెప్పిస్తారు. అందరి ముందూ భార్యా, బిడ్డల్ని అవమానిస్తావా అని రాహుల్‌కి ఒక్కటి ఇస్తుంది స్వప్న.