Brahmamudi Serial, August 3rd Episode: డబ్బు కోసం కనకం ప్రయత్నాలు.. జస్ట్ మిస్.. తప్పించుకున్న స్వప్న!!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కళ్యాణ్ ని బాగా ఏడిపిస్తుంది కావ్య. అయినా కళ్యాణ్ తగ్గకుండా వదినా ప్లీజ్ వదినా.. ఆ లెటర్ ఇచ్చేయండి అంటూ ప్రయత్నిస్తూంటాడు. మధ్యలో ఇంటిలోని సభ్యులు ఎవరో ఒకరు అడ్డం పడుతూ ఉంటారు. అయినా కావ్య తప్పించుకుని కళ్యాణ్ ని బాగా ఆటపట్టిస్తుంది. దీంతో కావ్య ఇంటి సభ్యులు ఏం చెప్తే అదే చేస్తాను అంటుంది. ఈలోపు కళ్యాణ్ కావ్యని, ఇంటి సభ్యుల్ని మాటల్లో పెట్టి ఆ లెటర్ ని లాక్కుంటాడు. ఆ తర్వాత కావ్య మళ్లీ నవ్వుతూ మళ్లీ పిలుస్తూ కవి గారూ.. మీ గుండెని ఇక్కడే వదిలి వెళ్లిపోతున్నారు అని చెప్పగా..

Brahmamudi Serial, August 3rd Episode: డబ్బు కోసం కనకం ప్రయత్నాలు.. జస్ట్ మిస్.. తప్పించుకున్న స్వప్న!!
Brahmamudi
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 10, 2023 | 8:46 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కళ్యాణ్ ని బాగా ఏడిపిస్తుంది కావ్య. అయినా కళ్యాణ్ తగ్గకుండా వదినా ప్లీజ్ వదినా.. ఆ లెటర్ ఇచ్చేయండి అంటూ ప్రయత్నిస్తూంటాడు. మధ్యలో ఇంటిలోని సభ్యులు ఎవరో ఒకరు అడ్డం పడుతూ ఉంటారు. అయినా కావ్య తప్పించుకుని కళ్యాణ్ ని బాగా ఆటపట్టిస్తుంది. దీంతో కావ్య ఇంటి సభ్యులు ఏం చెప్తే అదే చేస్తాను అంటుంది. ఈలోపు కళ్యాణ్ కావ్యని, ఇంటి సభ్యుల్ని మాటల్లో పెట్టి ఆ లెటర్ ని లాక్కుంటాడు. ఆ తర్వాత కావ్య మళ్లీ నవ్వుతూ మళ్లీ పిలుస్తూ కవి గారూ.. మీ గుండెని ఇక్కడే వదిలి వెళ్లిపోతున్నారు అని చెప్పగా.. మళ్లీ వచ్చి పూల కుండీని లాక్కుని గదిలోకి పరిగెడతాడు కళ్యాణ్. ఇదంతా చూసి రుద్రాణి, రాహుల్, స్వప్నలు కుళ్లుకోగా.. మిగతా ఇంటి సభ్యులందరూ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఇక లెటర్ ను తీసుకుని గదిలోకి పరిగెత్తిన కళ్యాణ్.. వెంటనే ఆ లెటర్ ని ఓపెన్ చేస్తాడు. “అబ్బా.. ఇన్నాళ్లకు ఒక కవిత అచ్చు అయిందన్నమాట. ఏంటి రాసిన కవితల్ని పత్రికకు పంపించడం కూడా తెలియని సుబ్బారావ్.. ఎలా బతుకుతావో ఏంటో.. ఏంటి ఉక్రోశంతో ముక్కు అలా ఎర్రబడింది కాస్ట్ లీ టమాటలా.. ఊరికే అన్నానులే. ముక్కు మామూలుగానే ఉందిలేవయ్య కవి. ఉలవచారు-మీగడ కాండినేషన్ లాగా, గోంగూర పచ్చడి-ఉల్లిపాయ జంటలాగా భాషకి, భావానికి జంట బాగా కుదిరింది. వాకిట్లో నేను ముగ్గు వేస్తే.. మా అమ్మ సాలిగూడిలాగా ఉందని తిట్టింది. ఆ కోపంతో వచ్చి అప్పుడే ఇంట్లో పడ్డ వీక్లీని మా నాన్న బయటకు విసిరేస్తుంటే.. క్రికెట్ ప్లేయర్ లాగా కాచ్ పట్టుకుని గార్డెన్ లోకి వెళ్లి కూర్చొని అప్పుడు చదివాను నీ కవిత.. చిరాకు అంతా పరార్ అయింది. ఇదంతా ఆ లెటర్ లో ఉంటుంది.” నేను ఎలా తెలుసు.. పేరే రాయలేదేంటి.. అని పేరు కోసం వెతుకుతాడు కళ్యాణ్. నీ రచయితలోనే నా పేరు మొదటి అక్షరం దాగి ఉంది.. వెతుక్కోవోయ్ చాక్లెట్ బాయ్.. అని ఉంటుంది. నా చేతిలో నీ పేరు ఏంటమ్మాయ్.. గులాబి అయి ఉంటుందా? తన పేరు అని ఆలోచిస్తూంటాడు కళ్యాణ్.

ఈ సీన్ కట్ చేస్తే.. కడుపులో నొప్పితో బాధపడుతుంది స్వప్న. ఈ నొప్పితో భరించలేకపోతున్నా.. ట్యాబ్లెట్స్ తెచ్చుందామంటే దొరికపోతాను.. వేరే వాళ్లను పంపించలేను. ఇప్పుడెలా అని ఆలోచిస్తూ.. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తుంది. ట్యాబ్లెట్స్ తొందరగా వస్తే బాగుండు అని వెయిల్ చేస్తూ ఉంటుంది. ఈ లోపు సేటుకు ఇవ్వాల్సిన రూ.50 వేల గురించి రంగమ్మ అత్తని అడుగుదామని అప్పుతో చెప్తుంది కనకం. రంగమ్మ అత్త మనకెందుకు పైసుల ఇస్తుంది అని అప్పు అడ్డగ్గా.. ఇప్పుడు మనం ఆలోచించే పరిస్థితిలో లేము.. ఎలాగోలా చిట్టీ ఏసి ఎత్తుకుని పైసలు కట్టేయాలి అని చెప్తుంది కనకం. అలా అప్పు, కనకం ఇద్దరూ కలిసి రంగమ్మ అత్త ఇంటికి వెళ్తారు.

ఇవి కూడా చదవండి

ఎప్పుడూ లేనిది మా ఇంటికి వచ్చావ్ ఏంటి? ఇద్దరు కూతుళ్లు గొప్పింటోళ్ల కోడళ్లు అయ్యారు కదా ఇక నీకేం అవసరం ఉంది? అని అడుగుతుంది. ఎంత డబ్బు ఉంటే ఎందుకు.. వెళ్లి చేయి వాళ్ల దగ్గర చేయి చాస్తామా రంగమ్మ అంటూ కనకం అంటుంది. చాలా పెద్ద అవసరం వచ్చింది. ఈ నెల చిట్టి 50 వేలుతో మొదలు పెడుతున్నావ్ అంట కదా అని కనకం అడగ్గా.. అవును అని రంగమ్మ సమాధానం ఇస్తుంది. అదే 50 వేల చిట్టీ వేసి పాడేద్దామని కనకం చెప్పగా.. ఆ చిట్టీల రంగమ్మ మాత్రం దానికి ఒప్పుకోదు. కనకాన్ని ఎత్తిపొడుస్తూ మొదటి నెల నువ్వు చిట్టీ ఎత్తుకొని వెళ్తే.. మిగిలిన 9 నెలలు నేను చిట్టీ డబ్బుల కోసం నీ ఇంటి చుట్టూ తిరగాలా? అని అడుగుతుంది. అంతేకాకుండా కూతుళ్ల పెళ్లిళ్ల గురించి కూడా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది. దీంతో అప్పు ఫైర్ అవుతూ మాట్లాడదామని ట్రై చేస్తే కనకం ఆపుతుంది. అప్పుడే రంగమ్మని లోపటి నుంచి ఎవరో వచ్చి పిలుస్తారు. దీనికి అప్పు రియాక్ట్ అవుతూ.. రంగమ్మ అత్త ఎవరీ అంకుల్ అని అడుగుతుంది. ఎవరేంటి? నా మొగుడు అని చెబుతుంది. మరి మొన్న సినిమా హాల్లో నీకు పూలు కొనిచ్చి.. నీ మీద వాలిన ఆ అంకుల్ ఎవరు? అని అడుగుతూ.. కరెక్ట్ గా బుక్ చేస్తుంది అప్పుడు. ఇది విన్న రంగమ్మ మొగుడు.. ఆమెను వాయించేస్తాడు. వెంటనే అప్పును తీసుకుని కనకం వెళ్లిపోతుంది.

ఇక కడుపు నొప్పితో బాధపడుతూ ట్యాబ్లెట్స్ కోసం ఎదురు చూస్తున్న స్వప్నకి డెలివరీ బాయ్ కాల్ చేస్తాడు. వెంటనే కిందకు దిగి ట్యాబ్లెట్స్ తీసుకుని దాచేస్తుంది. ఇదంతా రుద్రాణి ఫోన్ మాట్లాడుతూ మేడపై నుంచి చూస్తుంది. ఇదేంటి? ఏదో తప్పు చేసినట్లు కంగారుగా వెళ్తుంది. చేతిలో ఆ కవర్ ఏంటి? అని రుద్రాణికి అనుమానం వస్తుంది. ఇక లోపలికి వెళ్లిన స్వప్న.. వెంటనే ఆ ట్యాబ్లెట్ వేసుకుని.. అనుమానం రాకుండా లోపల దాచేస్తుంది. స్వప్న బయటకు రాగానే.. లోపలికి వెళ్తుంది రుద్రాణి. ఆ ట్యాబ్లెట్స్ ఎక్కడ పెట్టిందని వెతుకుతుంది. మొత్తానికి అవి దొరగ్గానే ఏంటి? ఇది ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంది? అయితే దీనికి కడుపు లేదా? అని కోపంతో ఊగిపోతుంది.

ఈలోపు కావ్య.. రాజ్ కి మెసేస్ చేస్తుంది. మీరు ఇచ్చిన 50 వేలు నేను మా అమ్మా వాళ్లకి ఇవ్వాలనుకుంటున్నా.. థ్యాంక్యూ అని మెసేజ్ పెడుతుంది. దీనికి రాజ్ రియాక్ట్ అవుతూ.. అది నీ డబ్బు.. నీ ఇష్టం.. ఎవరికైనా ఇవ్వొచ్చని.. ఇంకొక విషయం.. నాకు నీ థ్యాంక్స్ వద్దు. ఎందుకంటే నీకు హెల్ప్ చేయలేదు. నువ్వు చేసిన పనికి రెమ్యునరేషన్ ఇచ్చాను అంతే అంటూ మరో మెసేజ్ చేస్తాడు. దీనికి కావ్య.. మంచితనంలో కూడా మూర్ఖత్వం అంటే దీన్నే అంటారు. అంత ముద్దుగా థ్యాంక్స్ చెప్పాను తీసుకోవచ్చు కదా.. ముద్దు ముచ్చట తెలియని మొగుడు దొరికాడు అనుకుంటుంది.

ఈలోపు రాహుల్ వచ్చి.. ఏంటి మామ్ ఇక్కడేం చేస్తున్నావ్? నా గది నుంచి బయటకు వస్తున్నావ్? ఎందుకలా ఉన్నావ్? అని అడగ్గా.. ట్యాబ్లెట్స్ డబ్బా చూపిస్తుంది. ఇదేంటి? అని అడుగుతాడు రాహుల్. ఇది లేడీస్ మెన్సెస్ టైమ్ లో కడుపు నొప్పి వస్తే తగ్గడానికి వేసుకునే ట్యాబ్లెట్స్ అంటుంది. ఇది నాకెందుకు చూపిస్తున్నావ్ అని రాహుల్ అడగ్గా.. ఇది నీ పెళ్లాం ఇందాకే ఆన్ లైన్ బుక్ చేసుకుని తెప్పించుకుంది. అని చెప్తుంది. అది కడుపుతో ఉంది కదా అంటాడు రాహుల్.. మరి ఎందుకు తెప్పించుకుంది అమ్మా అంటాడు రాహుల్. అంటే స్వప్నకి కడుపు లేదా అని అంటాడు. అదే మనం తెలుసుకోవాలి అంటుంది రుద్రాణి.

ఇంతలో స్వప్న అక్కడికి వస్తుంది. రుద్రాణి చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ చూసి షాక్ అవుతుంది. వెంటనే లాగేసుకుంటుంది. బాటిల్ లాక్కుంటే నిజం అబద్ధం అయిపోతుందా? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఈ ట్యాబ్లెట్స్ నీ దగ్గర ఎందుకున్నాయ్? అంటే నీకు కడుపు లేదా అంటూ రాహుల్, రుద్రాణిలు గట్టిగా నిలదీస్తారు. ఇక రుద్రాణి చెడామడా వాయించేస్తుంది స్వప్నని. దీంతో వీరి దగ్గర్నుంచి ఎలా తప్పించుకోవాలి అంటూ తెగ ఆలోచిస్తుంది స్వప్న. సరిగ్గా అప్పుడే ఏమైంది అక్కా అంటూ కావ్య వస్తుంది. గొడవైంది అంటుంది స్వప్న.. దేనికి అని కావ్య అడగ్గా.. నీ వల్లనే.. కడుపు నొప్పిగా ఉంది ట్యాబ్లెట్స్ ఆర్డర్ పెట్ట అన్నావ్ కదా.. తెప్పించేసరికి.. అది నాకోసం అనుకుని నా అత్త, మొగుడు నన్ను ఇంట్రాగేషన్ చేస్తున్నారు అని .. ఆ ట్యాబ్లెట్స్ డబ్బాను కావ్య చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్తిపోతుంది స్వప్న. దీంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!