Bigg Boss Season 8: బిగ్బాస్ సీజన్ 8లో ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లే… మాములోళ్లు కారు గురూ..
సీజన్ 7 సక్సెస్ అయినట్లే ఈసారి సీజన్ 8 కూడా సూపర్ సక్సెస్ చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రెడీ చేశారని.. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ ఎవరనేది ఫిక్స్ చేసి వారితో చర్చలు జరుపుతున్నారని నెట్టింట ప్రచారం జరుగుతుంది. అయితే ఈ షోలో స్టార్ట్ అయ్యేవరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్. ఈ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది సీజన్ 7 సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో ఈసారి సీజన్ 8 కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారు మేకర్స్. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈఏడాది నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. సీజన్ 7 సక్సెస్ అయినట్లే ఈసారి సీజన్ 8 కూడా సూపర్ సక్సెస్ చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రెడీ చేశారని.. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ ఎవరనేది ఫిక్స్ చేసి వారితో చర్చలు జరుపుతున్నారని నెట్టింట ప్రచారం జరుగుతుంది. అయితే ఈ షోలో స్టార్ట్ అయ్యేవరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో బిగ్బాస్ షోకు సంబంధించిన ప్రతి విషయం వైరలవుతుంది. కొంతమంది యూట్యూబర్స్ కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ కొందరి పేర్లు రివీల్ చేస్తున్నారు.
అలాగే ఈసారి గతంలో షోలోకి వచ్చిన కంటెస్టెంట్లను కూడా మళ్లీ తీసుకురాబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ వాళ్లేవరో తెలుసుకుందామా. సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి వారంలోనే బయటకు వచ్చేసిన నయని పావనికి ఇప్పుడు మళ్లీ ఛాన్స్ ఇచ్చారట. నిజానికి నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అబ్బాయిలకు ధీటుగా గేమ్ ఆడుతూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. కానీ నయనిని వారంలోనే బయటకు పంపడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వేరొకరిని సేవ్ చేయడానికి ఆమెను అన్యాయంగా బయటకు పంపించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఈసారి నయని పావనిని మళ్లీ పంపిస్తున్నాట.
బిగ్బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్..
- అంజలి పవన్.. యాంకర్..
- వింధ్య విశాక.. యాంకర్..
- నయని పావని.. యూట్యూబర్..
- కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్ కమెడియన్..
- రీతూ చౌదరి.. యాంకర్..
- అమృతా ప్రణయ్..
- నిఖిల్.. యాంకర్..
- కుమారీ ఆంటీ..
- బర్రెలక్క..
- అనీల్ గీలా.. యూట్యూబర్..
- బుల్లెట్ భాస్కర్.. జబర్దస్త్ కమెడియన్..
- సోనియా సింగ్.. సినీనటి.
- బమ్ చిక్ బబ్లూ.. యూట్యూబర్..
- కుషితా కల్లపు.. హీరోయిన్..
- వంశీ.. యూట్యూబర్..
- సుప్రిత.. సురేఖ వాణి కూతురు..
ప్రస్తుతం వీరితోపాటు మరికొందరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో కొన్ని కారణాలతో ఎవరైనా ఆగిపోవచ్చు. లేదా మరికొందరు హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు. వీళ్లే కాకుండా టాలీవుడ్ యంగ్ హీరో, హీరోయిన్, పలువురు బుల్లితెర నటీనటులు, సింగర్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో సీజన్ 8 స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు.