Bigg Boss Telugu 9: ఈ ఓటింగ్ అసలు ఊహించలేదు.. డేంజర్ జోన్లోకి జెన్యూన్ కంటెస్టెంట్.. ఎలిమినేషన్ తప్పదా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 12వ వారం ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకోనుందా? చాలా మందికి ఫేవరెట్ అయిన టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నాడా? ప్రస్తుతం జరుగుతోన్న బిగ్ బాస్ ఓటింగ్ సరళిని చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో 12వ వారం ఎండింగ్ కు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇదిలా ఉంటే 12 వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయెల్, సంజనా గల్రానీ, భరణి, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, దివ్య నిఖిత నామినేషన్స్ లో ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా జరుగుతోంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ కానున్నాయి. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సస్పెన్స్ ని క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ సరళిని చూస్తుంటే.. కళ్యాణ్ పడాల టాప్ లో కొనసాగుతున్నాడు. తనూజ సెకెండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక మూడో పొజిషన్ లో ఇమ్మాన్యుయెల్ ఉండగా, నాలుగో స్థానంలో సంజనా గల్రానీ ఉన్నారు.
మొదటి రెండు రోజుల్లో డౌన్‌లో ఉన్న భరణి ఇప్పుడు ఓటింగ్ లో చాలా మెరుగయ్యాడు. ప్రస్తుతం అతను ఐదో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక ఆరో స్థానంలో డిమాన్ పవన్ ఉండగా ఏడో ప్లేసులో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. ఆఖరి స్థానంలో దివ్య నికితా ఉంది. కాగా బిగ్ బాస్ హోస్ లో మొదటి నుంచి టాప్ కంటెస్టెంట్ గా ఉన్న సుమన్ శెట్టి ఇప్పుడు డేంజర్ జోన్ లోకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జెన్యూన్ కంటెస్టెంట్ గా అభిమానుల మనసులు గెల్చుకున్న ఈ కమెడియన్ ఓటింగ్ లో అనూహ్యంగా వెనకబడిపోయాడు. ప్రస్తుతం అతను దివ్యతో పాటు డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే దివ్యతోపాటు సుమన్ శెట్టి కూడా ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఓటింగ్ కు మరో 24 గంటల సమయం ఉంది కాబట్టి.. సుమన్ శెట్టి స్థానం మెరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
బిగ్ బాస్ లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








