AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయి ముస్లిం, అబ్బాయి హిందూ.. సీరియల్‌లో తల్లి.. బయట భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లిచేసుకున్న నటి

సినిమా హీరోయిన్స్ తో పాటు సీరియల్ బ్యూటీలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ చాలా డిఫరెంట్.. ఆమె సీరియల్స్ తో పాటు వ్యక్తిగత విషయాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.

అమ్మాయి ముస్లిం, అబ్బాయి హిందూ.. సీరియల్‌లో తల్లి.. బయట భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లిచేసుకున్న నటి
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2025 | 12:09 PM

Share

సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ లు చాలా కామన్. తోటి హీరోలను పెళ్లి చేసుకున్న వారు చాలా మంది ఉంది. కొంతమంది హీరోయిన్స్ దర్శకులను పెళ్లి చేసుకున్నారు మరికొంతమంది నిర్మతలను పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ సీరియల్ బ్యూటీ మాత్రం చాలా డిఫరెంట్ ఆమె కూడా తన కో స్టార్ నే పెళ్లి చేసుకుంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.. సీరియల్ లో తన కొడుకుగా నటించిన వ్యక్తినే.. బయట ప్రేమించి పెళ్లాడింది. అంతే కాదు ఆతను ఆమె కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. ఈ ఇద్దరి పెళ్లి పై చాలా విమర్శలు వచ్చాయి. నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ కూడా చేశారు. అంతే కాదు వీరి పెళ్ళికి వాళ్ల పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు.

వీటితో పాటు ఊహించని ట్విస్ట్ మరొకటి ఏంటంటే.. ఈ ఇద్దరి మతాలు వేరు.. అమ్మాయి ముస్లిం, అబ్బాయి హిందూ.. ఇంతకూ ఈ నటి ఎవరు అనేది ఒక్కసారి చూద్దాం.! సినీ హీరోయిన్స్ తో పాటు సీరియల్ బ్యూటీస్ కూడా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. టీవీ సీరియల్స్ లో పాపులర్ అయిన భామల్లో కిశ్వర్ మర్చెంట్ ఒకరు. హిందీలో పలు సీరియల్స్ తో పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. ప్యార్ కి యే ఏక్ కహానీ సీరియల్ తో పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు నటనతో పాటు అందంతో మెప్పించింది. ఇక ఈ అమ్మడు తనకన్నా చిన్న వాడిని పెళ్లాడింది అతను ఎవరో కాదు ప్యార్ కి యే ఏక్ కహానీ సీరియల్‌లో కిశ్వర్ మర్చెంట్ కొడుకు పాత్రలో నటించిన సుయాష్ రాయ్ ను ప్రేమించి పెళ్లాడింది.

ఇవి కూడా చదవండి

కిశ్వర్ మర్చెంట్ కంటే సుయాష్ రాయ్ ఎనిమిదేళ్ళు చిన్నవాడు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటి నుంచి వీరిపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆతర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెద్దలు కూడా వెతిరేకించారు. ఇద్దరూ వేరు వేరు మతాలకు చెందిన వారుకావడంతో వీరి పెళ్ళికి పెద్దలు అడ్డు చెప్పారు. కానీ వీరు వివాహం చేసుకున్నారు. తమ పై వస్తున్న ట్రోల్స్ వస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఈ జంటకు ఓ కొడుకు ఉన్నాడు. వీరి కొడుకు పై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో ఈ జంట తమ ఫొటోలతో అలరిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us