AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి ‘కాంత’.. దుల్కర్ సల్మాన్‌, దగ్గుబాటి రానాల సినిమా స్ట్రీమింగ్ వివరాలివే

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కాంత. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. దగ్గుబాటి రానా, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోయింది.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి 'కాంత'.. దుల్కర్ సల్మాన్‌, దగ్గుబాటి రానాల సినిమా స్ట్రీమింగ్ వివరాలివే
Kaantha Movie
Basha Shek
|

Updated on: Nov 27, 2025 | 7:45 AM

Share

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కాంత.సెల్వమణి సెల్వరాజ్‌ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే సముద్రఖని, దగ్గుబాటి రానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.పాన్ ఇండియా ప్రాజెక్టుగా వచ్చిన ఈ మూవీ కేవలం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే ఓ వర్గం ఆడియెన్స్ కు కాంత సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ మూవీకి ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడీ కాంత సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియాట్రిక్ రన్ క్లోజ్ కావడంతో నెలలోపే ఓటీటీ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో డిసెంబర్‌ 12న నెట్‌ ఫ్లిక్స్ లో కాంత సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారని సమాచారం. తెలుగు సహా దక్షిణాది భాషలన్నీ ఆ రోజే అందుబాటులోకి రానున్నాయి. అయితే హిందీ వెర్షన్ మాత్రం 8 వారాల తర్వాతే వస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

కాంత సినిమా కథ విషయానికి వస్తే.. 1950 బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే కథ ఇది. హీరో, డైరెక్టర్ మధ్య వచ్చే ఇగో క్లాష్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సినీ పరిశ్రమలో హీరోలు, నటీనటుల క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వచ్చే సంఘర్షణలను చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే సముద్రఖని, రానా దగ్గుబాటి నటన కూడా మెప్పించింది. ఓవరాల్ గా సినిమాకు తమిళనాట మంచి రివ్యూలే వచ్చాయి. కానీ ఇతర భాషల్లో మాత్రం అనుకున్న రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలో చూడకపోయి ఉంటే ఈ కాంత సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

కాంత సినిమాలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ భోర్సే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల