Spirit Movie: ఏం ప్లాన్ చేస్తున్నావ్ సందీప్ మామ? ప్రభాస్ స్పిరిట్ ఆ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా !
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పిరిట్' సినిమా ఇటీవలే అధికారికంగా లాంఛ్ అయ్యింది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ పోలీస్ కాప్ స్టోరీలో బాలీవుడ్ బ్యూటీ, యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. అతను నటించిన లేటెస్ట్ సినిమా ‘ది రాజా సాబ్’ విడుదలకు సిద్ధమవుతోంది. మారుతి తెరకెక్కించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగానే ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమా ‘ స్పిరిట్’ కూడా అధికారికంగా పట్టాలెక్కింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, ‘యానిమల్’ సినిమాలతో పాన్ ఇండియా ఫేమస్ అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ముహూర్తం జరిగింది. గా స్టార్ చిరంజీవి ముహూర్త వేడుకకు వచ్చి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ‘స్పిరిట్’ చిత్ర తారాగణం గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడు. అదేవిధంగా, ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్. కాబట్టి ‘స్పిరిట్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ ను ఈ క్రేజీ ప్రాజెక్టులో చేర్చే అవకాశం ఉంది.
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్, తృప్తి దిమ్రీ, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు బాలీవుడ్ చాక్లెట్ బాయ్, యానిమల్ మూవీ హీరో రణ్ బీర్ కపూర్. ‘స్పిరిట్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని చెబుతున్నారు. సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశంలో రణ్ బీర్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్త విని అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రభాస్, రణ్‌బీర్ కపూర్ ఒకే సినిమాలో నటించడం ఇదే మొదటిసారి కాబట్టి అభిమానులకు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
‘స్పిరిట్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నటుడు రణబీర్ కపూర్ మధ్య మంచి అనుబంధం ఉంది. ‘యానిమల్’ సినిమాతో వారు బ్లాక్ బస్టర్ అందుకున్నారు . ఇప్పుడీ స్నేహం కారణంగానే రణబీర్ కపూర్ ‘స్పిరిట్’ సినిమాలో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించి ఉండవచ్చు. అయితే దీనిపై చిత్ర బృందం నుండి అధికారిక సమాచారం లేదు.
స్పిరిట్ సినిమా లాంఛింగ్ ఫొటోస్..
India’s biggest superstar #Prabhas’s SPIRIT has been launched with Megastar @KChiruTweets garu as the special guest. 🙏🔥 #BhushanKumar @imvangasandeep.@tripti_dimri23 @VangaPranay @ShivChanana#OneBadHabit@vivekoberoi @prakashraaj #KrishanKumar @neerajkalyan_24… pic.twitter.com/Xmq6O4jfwk
— Bhadrakali Pictures (@VangaPictures) November 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




