Bigg Boss Season 7: తుస్సుమన్న గౌతం బాంబ్.. బుర్రలేని అమరం..! సమరంలో పోటుగాళ్లదే విజయం..
ఇప్పటి వరకు అందరూ ప్రెడిక్ట్ చేయనట్టు.. కాస్త ఉల్టా పుల్టాగా సాగిన బిగ్ బాస్.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత జరిగిన ఫస్ట్ ఎపిసోడ్‌తో.. కాస్త ప్రెడిక్టబుల్‌గా సాగింది. ఇప్పటికే హౌస్‌లో ఉన్న సభ్యులను.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన సభ్యులను... రెండు గ్రూపులుగా డివైడ్ చేసిన బిగ్ బాస్.. వారి మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్దం చేసినట్టు.. ప్రీవియస్ ఎపిసోడ్‌తోనే తెలిసిపోయింది. ఇక రసవత్తర పోరులో.. సీక్రెట్ రూం నుంచి బయటికి వచ్చిన గౌతమ్ కృష్ణ.. ఇంటి సభ్యులపై ఎలా విరుచుకుపడతారనే ఈగర్ అందర్లో ఏర్పడింది. అయితే ఒక్క గౌతమ్ విషయంలో తప్ప.. ఆల్మోస్ట్ బీబీ లవర్స్ ప్రెడిక్ట్ చేసినట్టే ఆటగాళ్లు పోటుగాళ్ల మధ్య పోరు జరిగింది. విన్నర్ ఎవరో తేలిపోయింది. బుర్రలుని వాడిగా అమరంపై ముద్రపడింది.
ఎప్పటిలానే కంటెస్టెంట్స్… కిచన్‌లో వండడాలు.. లాన్‌లో ముచ్చట పెట్టుకోడాలు.. తమ తమ బాధలను చెప్పుకోవడాలను పక్కకు పెడితే.. ఈ సారి బిగ్ బాస్లో రెండు సూపర్ డూపర్ గేమ్స్‌ను పెట్టారు బిగ్ బాస్. అయితే అంతకు ముందు.. గార్డెన్లో అసెంబుల్ అయిన కంటెస్టెంట్స్ మధ్యకు సీక్రెట్ రూం నుంచి బయటికి వచ్చిన గౌతమ్ ఎప్పటిలానే ఆరంభ శూరత్వం ప్రదర్శించాడు. ‘రాననుకున్నారా..రాలేననుకున్నారా’ అంటూ.. హౌస్‌లో ఉన్న సీక్రెట్ రూం నుంచి బటయటికి వచ్చిన గౌతమ్.. తేనె పూసిన కత్తిని దించారంటూ.. తనను ఎలిమినేట్ చేసిన కంటెస్టెంట్స్ పై విరుచుకుపడ్డాడు. ‘అశ్వత్థామ ఈజ్ బ్యాక్’ అంటూ.. దిస్ ఈజ్ బిగ్ బాస్ 2.0 బేబీ అంటూ.. రావడం రావడమో అరవడం మొదలెట్టాడు. ఇక ఈక్రమంలోనే గౌతమ్‌కు వెల్‌కమ్ చెబుతూ.. కెప్టెన్ ప్రశాంత్ చేయిచ్చినప్పటికీ అతని చేతిని పక్కకు నెట్టి మరీ.. అందరితో ఫైటింగ్ చేస్తాడనే ఫీల్ కలిగిస్తాడు. అనుకున్నట్టే.. శివాజీ పై ఓ రేంజ్‌లో సీరియస్ అయినంత పనిచేశాడు. కానీ శివాజీ అదే రేంజ్లో రిప్లై ఇవ్వడంతో.. ఎప్పటిలానే.. అయోమయంలో పడిపోయి సైలెంట్ అయిపోయాడు. అశ్వత్థామ కాస్త.. అయోమయం స్టార్‌గా మిగిలిపోడు. దీంతో బిగ్ బాస్ కూడా.. తాను అనుకున్నది కాకుండా.. ఇంకోదే జరిగిందనే డిస్సపాయింట్ టోన్‌తో.. ఇక చాలు నాయనా అన్నట్టు గౌతమ్‌ను ఆపుతాడు. ఆటగాళ్ల నుంచి వెంటనే ఒకరిని నేరుగా నామినేట్ చేయమని.. బదులుగా వాళ్ల నుంచి ఇంకొకరిని సేవ్ చేయమని చెబుతాడు.
అయితే అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన గౌతమ్ కాస్తా.. నీరసించిన గొంతుతో.. తనకు ఎలిమినేషన్ పెయిన్ తెలుసని ఎవరని నేరుగా నామినేట్ చేయనని చెబుతూ.. తన బెస్ట్ ఫ్రెండ్ మాస్టర్ ను మాత్రం సేవ్ చేస్తాడు. సుబ్బుకు ఇచ్చిన మాట కోసం ఇలా చేశానంటూ.. ఓ డైలాగ్ కూడా వేస్తాడు. ఇక ఎలిమినేషన్ భయంతో ఉన్న సందీప్ ఒక్కసారిగా నామినేష్స్ నుంచి బయటికి రావడంతో.. సంతోషంతో గౌతమ్ పై ఎగిరిదునికినంత పనిచేస్తాడు. చేతులకు ముద్దులిస్తూ.. హగ్ చేసుకుంటూ.. నాకు తెలుసురా.. నువ్వురా ఫ్రెండ్ అంటూ.. డైలాగులు చెబుతాడు.
ఇక ఈ ఎసిసోడ్ తర్వాత కంటెస్టెంట్స్ అందరికీ కాస్త గ్యాప్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆటాగాళ్లు .. పోటుగాళ్లు ఓ రెండు టాస్కులు పెట్టేందుకు రెడీ అవతాడు. గెలిచిన టీం నుంచే.. కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఎన్నికవుతారని చెబుతాడు. అయితే ఈ రెండు టీమ్‌లు కాకుండా సీక్రెంట్ రూం నుంచి మధ్యలో వచ్చిన గౌతమ్ ఉన్నట్టుండి ప్లేటు పిరాయిస్తాడు. తనను వద్దునుకున్న కంటెస్టెంట్స్ కంటే.. కొత్తగా తన జెర్నీ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అవుతాడు. వైల్డ్ కార్డ్‌లో ఎంట్రీ ఇచ్చిన పోటుగాళ్ల పక్షాన నిలుస్తాడు. వాళ్ల టీంలో చేరి.. టాస్క్‌లో కీ ప్లేయర్ అవుతాడు.
ఆటగాళ్లు, పోటుగాళ్ల మధ్య.. ఫిజికల్ అండ్ మెంటల్ రెండు టాస్కులను పెడతాడు బిగ్ బాస్. మొదట ఫిట్ నెస్ టాస్క్‌లో భాగంగా.. గార్డెన్‌లో రాడ్‌కు ఉన్న టైర్లను.. సిమ్మింగ్ పూల్లో ఉన్న రాడ్‌కు వేయాలని చెబుతాడు. ఈ గేమ్‌లో ప్రతి టీం నుంచి ఇద్దరు ఆడాలని చెబుతాడు. అయితే స్విమ్మింగ్ పూల్లో అప్పటికే కొన్ని నెంబర్స్ పడి ఉంటాయని… స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఒక సభ్యుడు.. ఆ నెంబర్‌ను తీసి బయట ఉన్న మరొక సభ్యుడికి ఇస్తే.. ఆ నెంబర్ ఉన్న టైర్‌ను.. బయట ఉన్న సభ్యుడు తీసుకొచ్చి.. సిమ్మింగ్ పూల్లో ఉన్న సభ్యుడికి ఇవ్వాలని.. అతను పూల్లో ఉన్న రాడ్‌కు ఆ టైర్‌ను వేయాలని చెబుతాడు.ఇలా ఏ టీం ముందుగా గార్డెన్లో రాడ్‌కు ఉన్న టైర్లంన్నింటిని ..పూల్లో ఉన్న రాడ్‌కు తగిలిస్తారో ఆ టీం విన్నవుతుందని చెబుతాడు.
ఆటగాళ్ల టీం నుంచి ప్రిన్స్ యావర్, సందీప్ ఆడగా.. పోటుగాళ్ల టీం నుంచి అర్జున్, గౌతమ్ ఆటకు రెడీ అవుతారు. సందీప్ , గౌతమ్ పూల్లో.. ప్రిన్స్ యావర్, అర్జున్ లాన్‌లో ఉండి ఆట షురూ చేస్తారు. ఎవరి టీం వారు బానే ఎఫర్ట్ పెట్టి ఆడుతారు. అయితే ప్రిన్స్ యావర్, సందీప్ ఆల్మోస్ట్ చివరికి వచ్చాక.. ఓ నెంబర్ దొరకక టైంలో వెనకపడతారు. కానీ ఇంతలో.. మొదట పూల్లో నెంబర్ దొరకబట్టడానికి స్ట్రగుల్ అయిన గౌతమ్.. షాకింగ్‌గా.. టాస్క్ ఫినిష్ చేసి.. విన్నర్‌గా నిలుస్తాడు. దీంతో బిగ్ బాస్ ఫిట్ నెస్ టాస్క్‌లో పోటుగాళ్లు విన్నైనట్టు ప్రకటించి.. గార్డెన్ ఏరియాలో ఉన్న బోర్డ్‌లో వారి ఖాతాలో పోటుగాళ్ల బ్యాడ్జ్‌ను అతికించమని టీంకు చెబుతాడు.
ఇక తరువాత జరిగిన జీనియస్ టాస్క్‌లో పోటుగాళ్ల టీం నుంచి మళ్లీ గౌతమ్ రాగా.. ఆటగాళ్ల టీం నుంచి అమర్ పోటీకి వస్తారు. ఈ టాస్క్‌లో భాగంగా యాక్టివిటీ రూంలో ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్ పై పడిన బొమ్మ నుంచి మొంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు బిగ్ బాస్. అయితే అప్పటికే నాగ్ చేత.. ‘అర్థం కాని బుర్ర అమర్‌ది’ అంటూ చీవాట్లు తిన్న అమర్.. మరో సారి అదే చేశాడు. ‘చెట్టుపై ఉన్న పిట్టలను తుపాకీతో కాలిస్తే ఎన్ని ఉంటాయ్’ అన్న ప్రశ్నకు తప్ప వేరేవాటికి సమాధానం చెప్పేలేక పోతాడు. మరో పక్క గౌతమ్ ఆన్సర్ చకచకా చెప్పేస్తూ.. గేమ్‌లో దూసుకుపోతాడు.
ఆన్సర్ చెప్పలేకపోతున్నానని అమరం పడుతున్న బాధను.. బిగ్ బాస్ తన జోవియల్ కామెంట్స్‌తో రెట్టింపు చేస్తాడు. ఒక కేకు 800 కేలరీలు ఉంటే.. కేకును రెండు భాగాలుగా కట్ చేస్తే 800 కేలరీలే ఉంటాయి అమర్… ఇందులో కన్ఫూజన్ ఏంముంది అంటూ.. పంచ్ వేస్తాడు. దీంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ నవ్వడం.. అమర్ మొఖము మాడడం ఒకే సారి జరిగిపోతుంది. ఇక ఆ తరువాత మీ ప్లేయర్‌ను మార్చుకుంటారా..? అని బిగ్ బాస్ అడిగిన ప్రశ్నతో.. అమర్ ప్లేస్‌లో తేజను పంపిస్తారు ఆటగాళ్లు. అయితే ఈ నిర్ణయంలో లాభపడతారు. రంగంలోకి వచ్చిన తేజ.. చకచకా ఆన్సర్స్ చెబుతాడు. ఇక అందరి నవ్వుల మధ్య.. బిగ్ బాస్ ఫన్నీ పంచుల మధ్య.. అమర్ ‘ఆన్సర్ చెప్పలేక పోయానే’ అనే బాధ మధ్య ముగిసిన ఈ టాస్క్‌లో.. విజేతలను కాసేపు ఆగి ప్రకటిస్తాడు బిగ్ బాస్. అయితే అందులోనూ.. ఆటగాళ్లకు మరో ట్విస్ట్ ఇస్తాడు. అమర్ ఫస్ట్ కొశ్చన్కు ఆన్సర్ శివాజీ అందించారని..కాస్త లేట్‌గా రియలైజ్ అయిన బిగ్‌బాస్.. ఒక పాయింట్‌ను ఆటగాళ్ల పట్టిక నుంచి తీసేస్తాడు. అయినా ఎక్కువ మార్కులు పోటుగాళ్లకు ఉండడంతో.. వాళ్లనే విజేతలుగా ప్రకటిస్తాడు. దీంతో బుర్రలేని వాడిగా.. బుర్ర తక్కువోడిగా.. అటు హౌస్ మేట్స్ మధ్య.. ఇటు బీబీ ఆడియెన్స్ మధ్య కామెడీగా మారిపోతాడు అమర్.
– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..