Bigg Boss 15: బిగ్‌బాస్ టైటిల్ మరోసారి మహిళకే.. సీజన్ 15 విజేత ఎవరంటే..
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ (Bigg Boss). ఈ షోకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల నుంచి విపరీతమైన
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ (Bigg Boss). ఈ షోకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ అందుతోంది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో బిగ్‌బాస్ రియాల్టీ షో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు విజేతా విజే సన్నీ గెలివగా.. రన్నరప్‌గా యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ నిలిచాడు. ఇదిలా ఉంటే.. హిందీలో బిగ్‌బాస్ రియాల్టీ షో 1 (Bigg Boss Season 15) సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది.
ఇప్పటివరకు హిందీలో బిగ్‌బాస్ రియాల్టీ షో 14 సీజన్లు ముగిశాయి. ఇక నిన్న ఆదివారం (జనవరి 31న) బిగ్‌బాస్ సీజన్ 15 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. ఇక ఈసారి బిగ్‌బాస్ టైటిల్ మరోసారి మహిళకే దక్కడం విశేషం. ఎంతో ఉత్కంఠంగా సాగిన సీజన్ 15 గ్రాండ్ ఫినాలేలో బుల్లితెర నటి తేజస్వి ప్రకాష్ బిగ్‌బాస్ విజేతగా నిలిచింది. ఇక మోడల్.. నటుడు ప్రతీక్ సెహజ్ పాల్ రన్నరప్ అయ్యాడు. బిగ్‌బాస్ విజేతగా మహిళ నిలవడం ఇది మొదటి సారి కాదు. సీజన్ 12 విజేతగా దీపికా కాకర్ నిలవగా.. సీజన్ 13 నటుడు సిద్ధార్థ్ శుక్లా విన్నర్ అయ్యాడు. ఇక సీజన్ 14 బుల్లితెర నటి రుబినా దిలక్ బిగ్‌బాస్ విన్నర్ కాగా.. సీజన్ 15 టైటిల్ కూడా బుల్లితెర నటినే వరించింది.
ఇక బిగ్‌బాస్ సీజన్ 15లో నటుడు కరణ్ కుంద్రా మూడో స్థానంలో నిలవగా.. నటి షమితా శెట్టి నాల్గవ స్థానంలో.. కొరియోగ్రాఫర్ నిశాంత్ భట్ ఫైనల్ నుంచి తప్పుకుని రూ. 10 లక్షలు తీసుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 15 విజేత తేజస్వీ ప్రకాష్ పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అంతేకాకుండా..స్వరాగిణి సీరియల్ ద్వారా తేజస్వీ ప్రకాష్ ఎక్కువగా పాపులారిటీ సంపాందించుకుని బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.
Thank you #TejaTroops and everyone who made this dream come true! A dream come true after 4 months of a very challenging journey! The trophy comes home!!! #BiggBoss15 #BiggBoss #TejasswiPrakash #TejaTroops #TCrew pic.twitter.com/jC266ww151
— Tejasswi Prakash (@itsmetejasswi) January 30, 2022
Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..
Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్
Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..
Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?