Bigg Boss OTT: ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ రీఎంట్రీ.. బిగ్‏బాస్ ఓటీటీలోకి కొత్తవారితో మాజీ కంటెస్టెంట్స్..

బిగ్‏బాస్ (Bigg Boss) రియాల్టీ షో.. బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ షోకు బుల్లితెరపై స్పెషల్ క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా

Bigg Boss OTT: ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ రీఎంట్రీ.. బిగ్‏బాస్ ఓటీటీలోకి కొత్తవారితో మాజీ కంటెస్టెంట్స్..
Bigg Boss Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2022 | 11:24 AM

బిగ్‏బాస్ (Bigg Boss) రియాల్టీ షో.. బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ షోకు బుల్లితెరపై స్పెషల్ క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా ఈషోకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా.. బిగ్‏బాస్ రియాల్టీ షోను ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు హిందీలో 15 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది ఈ షో. ఇక తెలుగు, తమిళ్, మలయాళ భాషలలోనూ సక్సెస్ అవుతుంది. ఇక తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసింది.

అయితే తెలుగులో ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో బిగ్‏బాస్ రియాల్టీ షోను ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ షో ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతుందని బిగ్‏బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బిగ్‏బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ ఎవరా ? అని ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే ఇందులో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ ఎవరనేది ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బిగ్‏బాస్ ఓటీటీలోకి కొత్త వారితోపాటు.. మాజీ కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్.

బిగ్‏బాస్ సీజన్ 4లో అబ్బాయిలకు ధీటుగా తన ఆట తీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా నిలిచిన అరియానా రీఎంట్రీ ఇస్తుందట. బిగ్‏బాస్ ఓటీటీలోకి అరియానాను తీసుకోబోతున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారట నిర్వాహుకులు. బిగ్‏బాస్ షోలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు అరియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక అరియానాతోపాటు.. మాజీ కంటెస్టెంట్స్ జాబితాలో ఆదర్శ, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజ పేర్లు ఉన్నట్లుగా సమాచారం. ఇక కొత్త వారిలో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, ఢీ 10 విన్నర్ రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్ వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే టీవీ నటి నవ్యస్వామి.. బిగ్‏బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సిరి ప్రియుడు శ్రీహాన్ కూడా బిగ్‏బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. మరి వీరిలో ఎవరెవరు ఫైనల్ ఫిక్స్ అయ్యారనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..

Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్

Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..

Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?