Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్

విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం 'భళా తందనాన' అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో న‌టిస్తున్నాడు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుంది.

Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది 'భళా తందనాన' టీజర్
Bhala Thandanana
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 31, 2022 | 5:38 AM

Bhala Thandanana: విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ‘భళా తందనాన’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో న‌టిస్తున్నాడు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్ప‌టికే ఫస్ట్ లుక్ పోస్టర్, మ్యూజికల్ ప్రమోషన్స్‌తో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా న్యాచురల్ స్టార్ నాని ఈ మూవీ టీజర్ విడుదల‌చేశారు. ‘రాక్షసున్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి.. నేను మామూలు మనిషిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొద‌లైంది. ఇక శ్రీవిష్ణు సాఫ్ట్ రోల్‌లో కనిపించగా.. కేథరిన్ థ్రెస్సా మాత్రం పొగరుగా కనిపించారు. నీ దారిలో నువ్వు.. నా దారిలో నేను.. ఇద్దరి లక్ష్యం ఒకటే అనే డైలాగ్‌తో హీరో హీరోయిన్ల ప్రయాణం, లక్ష్యం ఏంటో చెప్పేశారు. యాక్షన్ సీక్వెన్స్, శ్రీ విష్ణు నటన ప్రత్యేకంగా నిలిచింది. ఇక రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ముగిసిన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది.

టీజర్‌లోని డైలాగ్స్ సినిమా కథ ఎలా ఉండోబోతోంది అనేది చెప్పేశాయి. డైలాగ్సే సినిమాకు మేజర్ హైలెట్ అని తెలుస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను పక్కా కమర్షియల్‌గా తెరకెక్కించారు దర్శకులు చైతన్య దంతులూరి. ఇక ఈ టీజర్ మొత్తంలో శ్రీవిష్ణు తన నటనతో అందరినీ మెప్పించారు. నటనలోని వేరియేషన్స్ చక్కగా చూపించారు. కేథరిన్ ఈ రోల్‌కు పర్ఫెక్ట్ అనిపించేలా నటించారు. శ్రీనివాస్ రెడ్డి కామెడీ, కేజీయఫ్ ఫేమ్ రామచంద్ర రాజు విలనిజం బాగా కుదిరాయి. సోషల్ మీడియాలో ఈ టీజర్ తెగ వైరల్ అవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తుండ‌గా.. సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?

Bhama Kalapam: భామా కలాపం ట్రైలర్ లాంచ్ రేపే.. హాజరుకానున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ..

Athulya Ravi: అందంతో అదరగొడుతున్న ‘అతుల్య రవి’.. ముగ్ధులవుతున్న కుర్రకారు.. (ఫొటోస్)

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?