
బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్ గా మొదలైంది. ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్ద మందారం సీరియల్ ఫేమ్ తనూజ గౌడ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఫస్ట్ కామనర్ గా ఇంట్లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్ అలియాస్ సోల్జర్ కళ్యాణ్. ప్రజల ఓటింగ్ ఆధారంగా బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో విజేతగా నిలిచాడు. వెంటనే అతడిని స్టేజ్ పైకి ఆహ్వానించాడు నాగ్. అయితే హౌస్ లోకి వెళ్లిన తర్వాత పవన్ కు ఓ టాస్క్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ముందుగా పవన్ కళ్యాణ్, ఫ్లోరా షైనీలను తీసుకుని బాత్ రూమ్స్ చూపించాలని తనూజకు చెప్పారు కింగ్ నాగార్జున.
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..
ఆ తర్వాత కాసేపటికి వెంటనే ఆ ఇద్దరిలో బాత్ రూమ్స్ క్లీన్ చేసే బాధ్యతను ఎవరికీ అప్పగిస్తావని పవన్ కళ్యాణ్ ను అడగ్గా.. వెంటనే పక్కనే ఉన్న ఆశా షైనీ తనకు ఇవ్వద్దంటూ రిక్వెస్ట్ చేసింది. దీంతో కళ్యాణ్ వెంటనే మరో మాట లేకుండా ఆమెకే బాత్ రూమ్ క్లీన్ చేసే బాధ్యతను అప్పగించాడు. దీంతో తనకు టైమ్ వస్తుందని..అప్పుడు చూసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
ఇక సోల్జర్ కళ్యాణ్ విషయానికి వస్తే..
సోల్జర్ కళ్యాణ్ పూర్తి పేరు పవన్ కళ్యాణ్ పడాల. ఏపీలోని విజయనగరానికి చెందిన అతడు భారత సైన్యంలోకి సైనికుడిగా సేవలందిస్తున్నారు. మూడేళ్లుగా దేశసరిహద్దుల్లో సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కామనర్స్ ప్రోగ్రామ్ అప్లై చేసుకున్న అతడు ఆ తర్వాత బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో విజేతగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?