Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో బోరుమన్న విష్ణుప్రియ.. ప్రేరణ అలా చేయడంతో కన్నీళ్లు.. వీడియో
మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. నామినేషన్స్ ప్రక్రియలోనే కాకుండా గేమ్స్, టాస్కుల్లోనూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ హౌస్ ను హీటెక్కిస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. నామినేషన్స్ ప్రక్రియలోనే కాకుండా గేమ్స్, టాస్కుల్లోనూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ హౌస్ ను హీటెక్కిస్తున్నారు. ఇకె మంగళవారం ఎపిసోడ్ రేషన్ కోసం కంటెస్టెంట్స్ కు మూడు గేమ్స్ పెట్టాడు బిగ్ బాస్. అయితే సంచాలక్స్ గా వ్యవహరించిన మణికంఠపై ప్రేరణ, సోనియాపై యష్మి తెగ అరిచేశారు. ఈ గొడవ కొనసాగుతుండగానే హౌస్ లో మరో కొత్త రచ్చ మొదలైంది. ఫుడ్ విషయంలో ప్రేరణ ప్రవర్తించిన తీరు వల్ల విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా రిలీజైన ప్రోమో ప్రకారం హౌస్ లో ఏం జరిగిందంటే.. ‘హౌస్ మేట్స్ అందరి కోసం ప్రేరణ దోశలు పోస్తోంది. ఇదే సమయంలో విష్ణుప్రియ కోసం దోశలు తీసుకొచ్చేందుకు నాగ మణికంఠ ప్లేట్ తీసుకుని ప్రేరణ దగ్గరకు వెళ్లాడు.
అక్కడ నాగ మణికంఠ ప్లేటులో దోసెలు వేసింది ప్రేరణ. కానీ ఆమె వేసిన విధానం మాత్రం అస్సలు నచ్చలేదంటూ విష్ణుప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. తినే తిండి విషయంలో ఇలా ఎలా చేస్తారు అంటూ ఆమె అందరి ముందే కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేరణ దోసెలు వేసి ఇచ్చిన విధానం.. విసిరేసినట్లుగా చేయడం నచ్చలేదు అంటూ విష్ణుప్రియ బోరున ఏడ్చేసింది. ఎవరికైనా ఫుడ్డే కదా అని కన్నీళ్లు పెట్టుకుంది.
ఫుడ్ విషయంలో అలా చేస్తారా?
A heated debate erupts when contestants come to clash over mistakes made during the “Boorani Kottu Ration Pattu” task. Will they resolve it or will the drama escalate?#BiggBossTelugu8 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/Gveskuq10z
— Starmaa (@StarMaa) September 18, 2024
దీంతో నాగ మణికంఠ వీళ్లిద్దరి మధ్యలోకి వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ కూడా ప్రేరణ తన యాటిట్యూడ్ చూపించింది. నాగ మణికంఠపై గట్టిగా అరి చేస్తూ..’ పో వెళ్లు’ అంటూ నాగ మణికంఠను తిట్టేసింది. మరి ఈ గొడవ ఎంత దాకా వెళ్లిందో చూడాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.