Bigg Boss 7 Telugu: షాకిచ్చిన నాగార్జున.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్.. ప్రోమో చూశారా ?..
సండే ఫన్ డే అంటూ నాగ్ వచ్చి సందడి చేయనున్నారు. అలాగే ఈ వారం బిగ్‍బాస్ వేదికపైకి రామ్ పోతినేని స్కంద ప్రమోషన్లలో భాగంగా అతిథిగా రానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం రిలీజ్ చేసిన ప్రోమోలో ముందుగా మీరు రామ్ ను మించిన డ్యాన్సర్స్ అని నిరూపించుకోవాలి అని నాగ్ చెప్పగా.. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మెగాస్టార్ పాటకు స్టెప్పులేశారు. ఆ తర్వాత శోభా శెట్టి, ప్రియాంక జైన్ డ్యాన్స్ చేసి అలరించారు.
బిగ్‍బాస్ సీజన్ 7 మూడో వారం మరింత రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. గొడవలు, కోట్లాటలు కాదు.. అంతా ప్లాన్.. సేఫ్ గేమ్.. టార్గెట్ ఎక్కువగా సాగిందనడంలో సందేహమే లేదు. ఇక శనివారం ఎపిసోడ్ లో సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ఇక ఇప్పుడు ఎలిమినేషన్ కు సమయం దగ్గరపడింది. సండే ఫన్ డే అంటూ నాగ్ వచ్చి సందడి చేయనున్నారు. అలాగే ఈ వారం బిగ్‍బాస్ వేదికపైకి రామ్ పోతినేని స్కంద ప్రమోషన్లలో భాగంగా అతిథిగా రానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం రిలీజ్ చేసిన ప్రోమోలో ముందుగా మీరు రామ్ ను మించిన డ్యాన్సర్స్ అని నిరూపించుకోవాలి అని నాగ్ చెప్పగా.. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మెగాస్టార్ పాటకు స్టెప్పులేశారు. ఆ తర్వాత శోభా శెట్టి, ప్రియాంక జైన్ డ్యాన్స్ చేసి అలరించారు.
ఇక ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్నవాళ్లను నిల్చోమన్నారు నాగ్. ఆ తర్వాత ఒక్కొక్కరి ఫోటోలు ఉన్న పలకలను నాగార్జున సుత్తితో పగులగొట్టారు. అయితే ఇది నామినేషన్స్ ప్రక్రియలో భాగం అయ్యి ఉండొచ్చు. అయితే ఫోటోస్ పగులగొడుతున్న సమయంలో కంటెస్టెంట్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈరోజు దామిని ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram
ఈ వారం అత్యధిక ఓటింగ్ తో ప్రిన్స్ యావర్ మొదటి స్థానంలో ఉండగా.. డేంజర్ జోన్ లో శుభా శ్రీ, దామిని ఉన్నారు. చివరకు దామిని ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వారం బిగ్‍బాస్ షోకు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అతిథిగా విచ్చేశారు. స్కంద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ బిగ్‍బాస్ వేదికపై సందడి చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.