Bigg Boss : బిగ్బాస్లో చరిత్రలోనే తొలిసారి.. ఫస్ట్ కంటెస్టెంట్గా శునకం.. బుల్లితెరపై సందడి చేయనున్న ‘చార్లీ’..
తెలుగు, హిందీ కాకుండా.. తమిళం, కన్నడలోనూ బిగ్‌బాస్ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. మలయాళంలో ఐదో సీజన్ పూర్తయింది. అటు తమిళంలో ఏడో సీజన్ త్వరలోనే షూరు కానుంది. ఇక కన్నడలో మాత్రం పదవ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అక్టోబర్ 8 నుంచి ఈ షో ప్రారంభంకానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా బిగ్‌బాస్ కన్నడలో ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈసారి రాబోయే స్టార్స్ వీళ్లేనంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు హిందీలోనూ బిగ్‌బాస్ షో స్టార్ట్ కాబోతుంది. దేశవ్యాప్తంగా ఈ షోకు ఉన్న ఆదరణ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, హిందీ కాకుండా.. తమిళం, కన్నడలోనూ బిగ్‌బాస్ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. మలయాళంలో ఐదో సీజన్ పూర్తయింది. అటు తమిళంలో ఏడో సీజన్ త్వరలోనే షూరు కానుంది. ఇక కన్నడలో మాత్రం పదవ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అక్టోబర్ 8 నుంచి ఈ షో ప్రారంభంకానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా బిగ్‌బాస్ కన్నడలో ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈసారి రాబోయే స్టార్స్ వీళ్లేనంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లనున్న తొలి కంటెస్టెంట్ ఎవరన్నది ముందుగానే ప్రకటించారు.
‘777 చార్లీ’ సినిమాలోని చార్లీ శునకం బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతుంది. ఈమూవీ డైరెక్టర్ కిరణ్ రాజ్ వేదికపై ఉన్నారు. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన చార్లీ.. ఇప్పుడు కిరణ్ బిగ్‌బాస్ ఇంట్లో జాయిన్ కాబోతున్నారని అనుపమ గౌడ వెల్లడించారు. కన్నడ టెలివిజన్ చరిత్రలో ఇదే తొలిసారి. ఒక శునకం కంటెస్టెంట్ గా రావడం. బిగ్‌బాస్ ఇంట్లో కొన్ని నియమాలున్నాయి. బిగ్‌బాస్ పాటను ప్లే చేసినప్పుడు మీరు లేవాలి. టాస్క్ కొట్రే చేయాలి. మీరు టాస్క్ చేస్తేనే లగ్జరీ బడ్జెట్ పొందవచ్చు. లగ్జరీ బడ్జెట్ వస్తేనే బోన్ దొరుకుతుందని అనుపమ అన్నారు.
View this post on Instagram
777 చార్లీ సినిమాలో హీరో రక్షిత్ శెట్టితో కలిసి చార్లీ చేసిన అల్లరి ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అలాగే నవ్విస్తూనే జనాలను ఏడిపించింది చార్లీ. తన చేష్టలతో హీరోపై ఎంతో ప్రేమను కురిపించిన చార్లీ.. ఇప్పుడు బిగ్‌బాస్ లోకి వస్తుంది. దాదాపు 100 రోజులు చార్లీ ఎలా ఉంటుంది అనేది చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.