Bigg Boss 7 Telugu: శివాజీకి ఎదురుదెబ్బ.. ఈసారి ఓటింగ్‌లో అతనే టాప్.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
సెలబ్రిటీ గేమ్ షో 12 వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్లు హోరాహోరీగా సాగాయి. మాటల తూటాలు, గొడవల మధ్య కంటెస్టెంట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మొత్తం మీద గత వారం లాగే ఈ వారం కూడా 8 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్‌లోకి వచ్చారు.
బుల్లితెర ఆడియెన్స్‌ను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో 12 వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్లు హోరాహోరీగా సాగాయి. మాటల తూటాలు, గొడవల మధ్య కంటెస్టెంట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మొత్తం మీద గత వారం లాగే ఈ వారం కూడా 8 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్‌లోకి వచ్చారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి, అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, అంబటి అర్జున్ 12 వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లలో ఉన్నారు. వీరికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ కూడా గత వారాల కంటే భిన్నంగా సాగుతోంది. నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండడం, అందులోనూ టైటిల్ ఫేవరెట్లు ఉండడంతో భారీగా పోలీజ్ జరుగుతోంది. అయితే గత కొన్ని వారాలుగా సాగుతున్నట్లు 12 వారం ఓటింగ్‌లో శివాజీ టాప్ ప్లేస్‌లో లేడు. నిన్నటివరకు అమర్ దీప్ చౌదరి అగ్ర స్థానంలో ఉండగా తాజాగా పల్లవి ప్రశాంత్ టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. రైతు బిడ్డకే ఏకంగా 32 శాతంకు పైగా ఓట్లు పడడం గమనార్హం. ఇక రెండో స్థానంలో శివాజీ కొనసాగుతున్నాడు. అతనికి 21 శాతం ఓట్లు పడ్డాయి.
కాగా నిన్నటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన అమర్ దీప్ చౌదరి ఇప్పుడు మూడో ప్లేస్‌లోకి పడిపోయాడు. అతనికి 17 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక 11 శాతం ఓట్లతో ప్రిన్స్ యావర్ నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. 5 శాతం ఓట్లతో గౌతమ్ కృష్ణ ఐదో స్థానంలో, 4.09 శాతం ఓట్లతో అర్జున్ అంబటి ఆరో ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఇక హౌజ్‌లో వీక్ కంటెస్టెంట్స్‌గా పేరున్న రతికా రోజ్ ( 4.02) శాతం ఓట్లతో ఏడో స్థానంలో ఉండగా, ఆఖరి స్థానంలో అశ్విని శ్రీ ఉంది. ఆమెకు కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే ఈ వారం రతికా, అశ్విని శ్రీ డేంజర్ జోన్‌లో ఉన్నారన్నమాట. నాగార్జున ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు. సో.. ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే రతిక, అశ్వని శ్రీ ఇద్దరూ ఎలిమినేట్ కావొచ్చన్నమాట.
బిగ్ బాస్ లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.