AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: తప్పులన్నీ నువ్వు చేసి అందరిపై అరిస్తే ఎలా ?.. సందీప్ ఆట కట్టించిన నాగ్..

స్మైల్ టాస్క్ నుంచి కెప్టెన్సీ టాస్క్ రంగుపడుద్ది రాజా టాస్క్ వరకు ప్రతి దాంట్లో ఫౌల్ చేయడం.. ఆ తర్వాత మిగితా ఇంటి సభ్యుల మీదికే తిరగబడుతూ తమ తప్పును సమర్దించుకోవడం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో గొంతు పెంచుతూ అరుస్తూ నానా హంగామా సృష్టించారు వీరిద్దరు. ఇక ఈవారం వీరిద్దరి చేసిన తప్పులను వీడియోలతో సహా బయటపెట్టారు నాగ్. దీంతో సందీప్, అమర్ దీప్ బిక్కమొహం వేశారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అల్లాడించేశారు నాగ్.

Bigg Boss 7 Telugu: తప్పులన్నీ నువ్వు చేసి అందరిపై అరిస్తే ఎలా ?.. సందీప్ ఆట కట్టించిన నాగ్..
Sandeep Bigg Boss 7 Telugu
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2023 | 8:33 AM

Share

ఐదో వారం హౌస్‏లో జరిగిన టాస్కులు.. అందులో కంటెస్టెంట్స్ చేసిన తప్పోప్పులను నిలదీశారు నాగ్. ముఖ్యంగా ఈ వారం అమర్ దీప్, సందీప్ లను నిల్చోబెట్టి పాయింట్ టూ పాయింట్ మాట్లాడుతూ చుక్కలు చూపించారు. ఈవారం మొత్తం ఆటలో వీరిద్దరి చేసినన్నీ తప్పులు ఇంకెవరూ చేయలేదంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. స్మైల్ టాస్క్ నుంచి కెప్టెన్సీ టాస్క్ రంగుపడుద్ది రాజా టాస్క్ వరకు ప్రతి దాంట్లో ఫౌల్ చేయడం.. ఆ తర్వాత మిగితా ఇంటి సభ్యుల మీదికే తిరగబడుతూ తమ తప్పును సమర్దించుకోవడం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో గొంతు పెంచుతూ అరుస్తూ నానా హంగామా సృష్టించారు వీరిద్దరు. ఇక ఈవారం వీరిద్దరి చేసిన తప్పులను వీడియోలతో సహా బయటపెట్టారు నాగ్. దీంతో సందీప్, అమర్ దీప్ బిక్కమొహం వేశారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అల్లాడించేశారు నాగ్.

ముందుగా నాగ్ మాట్లాడుతూ.. స్మయిల్ బోర్డ్ ఛాలెంజ్ గురించి మాట్లాడుతూ.. టాస్క్ కంప్లీట్ కాకుండానే బెల్ కొట్టేశావ్ అది తప్పే కదా అని నాగ్ అడగ్గా.. దానికి కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు నాగ్. అయితే సందీప్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాయింట్ టూ పాయింట్ మాట్లాడారు నాగ్. అప్పుడు చికెన్ టాస్క్ లో ప్రశాంత్ పూర్తి చేయకుండానే బెల్ కొట్టాడని అతడిని ఆట నుంచి తప్పించావ్. ఇప్పుడు నువ్వు చేసిందేంటీ ?.. మనం చేస్తే తప్పు కాదు.. మిగతావాళ్లు చేస్తే తప్పు.. మన తప్పులు మనకు కనబడవా అంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. నువ్వు బెల్ కొట్టి మిగతావాళ్ల ఫౌల్స్ గురించి మాట్లాడావ్.. ఇదెక్కడి న్యాయం సందీప్ అంటూ కౌంటరిచ్చాడు.

ఆ త్రవాత ఫ్రూట్ నింజా టాస్కులో చేసిన ఫౌల్ గురించి మాట్లాడుతూ.. వీడియో చూపించి మరీ ఉతికారేశారు. తప్పే కానీ గేమ్ లో భాగమే అంటూ సమర్ధించుకోబోయాడు. ఆ తర్వాత లెటర్ త్యాగం చేస్తే అమర్ కంటెస్టెండర్ అయ్యేవాడు కానీ నీ గురించి మాత్రమే ఆలోచించుకున్నావ్ అని నాగ్ అనగా.. అమర్ దీప్ ను సేవ్ చేయాలనుకున్నానంటూ తెలివిగా ప్రశ్న దాటవేసే ప్రయత్ం చేశాడు. ఇదే విషయంపై మరోసారి ప్రశ్నించగా.. నా హౌస్మేట్ తనకు ఇచ్చేయండి అంటూ డైలాగ్ వేశాడు. గెలవడం ఎంత ముఖ్యమో ఆ గెలుపు కోసం మనం ఎలా ప్రయత్నిస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకో అన్నారు నాగ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి