AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఆ ఇద్దరిపై వేటు.. ఈసారి డబుల్ ఎలిమినేషన్.. హింట్ ఇచ్చిన నాగ్..

మొత్తం పది మంది అభిప్రాయాల ప్రకారం అమర్ దీప్, గౌతమ్, తేజ అనర్హులుగా సెలక్ట్ అయ్యారు. అయితే ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఎవరెవరు అనర్హులు అనేది ఆదివారం చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు నాగ్. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తం హౌస్ నుంచి ముగ్గురిని ఎలిమినేట్ చేస్తారని.. అందులో ఒకరిని సీక్రెట్ రూంకు పంపిస్తారని టాక్ వినిపిస్తుంది.

Bigg Boss 7 Telugu: ఆ ఇద్దరిపై వేటు.. ఈసారి డబుల్ ఎలిమినేషన్.. హింట్ ఇచ్చిన నాగ్..
Bigg Boss 7 Telugu Eliminat
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2023 | 7:29 AM

Share

బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‏లో ఒక్కొక్కరి ఆట కట్టించారు హోస్ట్ నాగార్జున. రావడంతోనే హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ అయిన ప్రశాంత్ ను ప్రశంసించారు. ఆ తర్వాత టాస్కులలో అతి తెలివిగా ప్రవర్తించిన సందీప్, అమర్ దీప్ లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొ జంటను నిలబెట్టి కడిగిపారేశారు. చివరగా ఇంట్లో ఉండేందుకు అనర్హులు ఎవరో చెప్పాలన్నారు. అందులో ఆల్ రెడీ హౌస్ మెట్ అయిన వారిని సెలక్ట్ చేయకూడదు అని.. మిగిలిన ఏడుగురిలో ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేయాలన్నారు. దీంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే మొత్తం పది మంది అభిప్రాయాల ప్రకారం అమర్ దీప్, గౌతమ్, తేజ అనర్హులుగా సెలక్ట్ అయ్యారు. అయితే ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఎవరెవరు అనర్హులు అనేది ఆదివారం చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు నాగ్. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తం హౌస్ నుంచి ముగ్గురిని ఎలిమినేట్ చేస్తారని.. అందులో ఒకరిని సీక్రెట్ రూంకు పంపిస్తారని టాక్ వినిపిస్తుంది.

మొత్తం 14 మందితో మొదలైన బిగ్‌బాస్ గేమ్ లో ఇప్పుడు పది మంది మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీల, సింగర్ దామిని, రతిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఐదోవారం శోభా, సందీప్, ప్రశాంత్ మినహా మిగిలిన ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఇక మొదటి రోజు నుంచే టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు శివాజీ. ఆ తర్వాత యావర్, గౌతమ్ కృష్ణ ఉండగా.. నాల్గవ స్థానంలో అమర్ దీప్,ఆ తర్వాతి స్థానాల్లో శుభ శ్రీ, ప్రియాంక, తేజ ఉన్నారు. అయితే ఐదో వారం ప్రియాంక ఎలిమినేట్ కానుందని టాక్ నడించింది.

ఇప్పుడు అనుహ్యంగా ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ పేరు మారింది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి ముగ్గురిని బయటకు పంపిస్తున్నారట. ఇప్పటివరకు డేంజర్ జోన్ లో ప్రియాంక, తేజ, శుభ శ్రీ ఉన్నారు. వీరిలో తేజ సేవ్ కాగా.. శుభ శ్రీ, ప్రియాంక ఒకేసారి ఎలిమినేట్ కానున్నారని.. అందులోనూ ప్రియాంకను పూర్తిగా ఎలిమినేట్ కాకుండా సీక్రెట్ రూంలో ఉంచారని సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతున్న సంగతి తెలిసిందే. అర్జున్ అంబటి, పూజా మూర్తి, అంజలి పవన్, సింగర్ భోలే షావలితోపాటు నయని పావని కూడా ఎంట్రీ ఇస్తుందనే టాక్ నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఆకు కూరలతో అద్భుతాలు జరుగుతాయ్.. ఇంట్లోనే సింపుల్‌గా పెంచుకోండి
ఈ ఆకు కూరలతో అద్భుతాలు జరుగుతాయ్.. ఇంట్లోనే సింపుల్‌గా పెంచుకోండి
ఆ కారణాలతో ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్
ఆ కారణాలతో ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్
ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగమ్మాయి..!
ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగమ్మాయి..!
సాయంత్రం వేళ వీటిని దానం చేస్తే.. ఇంట్లో గొడవలు పక్కా
సాయంత్రం వేళ వీటిని దానం చేస్తే.. ఇంట్లో గొడవలు పక్కా
ఈఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా? పాన్ఇండియా స్టార్
ఈఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా? పాన్ఇండియా స్టార్
ఇక ఇంటర్నెట్‌ లేకుండానే AI వాడుకోవచ్చు!
ఇక ఇంటర్నెట్‌ లేకుండానే AI వాడుకోవచ్చు!
ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
మరో 2 రోజుల్లోనే TET 2026 నోటిఫికేషన్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే
మరో 2 రోజుల్లోనే TET 2026 నోటిఫికేషన్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే
గ్యాస్ లేకుండా మంటను సృష్టించే ప్లాస్మా స్టవ్ గురించి మీకు తెలుసా
గ్యాస్ లేకుండా మంటను సృష్టించే ప్లాస్మా స్టవ్ గురించి మీకు తెలుసా
పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ తెచ్చిన తంట..!
పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ తెచ్చిన తంట..!