Bigg Boss 6 Telugu: ఆ ఇద్దరికి ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్.. అంతా సెల్ఫీష్ అంటూ ఎమోషనల్..

రోహిత్, వాసంతిలలో ఒకరు రెండు వారాలు నేరుగా నామినేట్ అయితే బ్యాటరీ రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది చెప్పారు. దీంతో వారిద్దరు చర్చించుకున్న అనంతరం రోహిత్ నేరుగా నామినేట్ కావడానికి డిసైడ్ అయ్యా

Bigg Boss 6 Telugu: ఆ ఇద్దరికి ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్.. అంతా సెల్ఫీష్ అంటూ ఎమోషనల్..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 14, 2022 | 10:25 AM

గత రెండురోజ్రులుగా హౌస్మేట్స్ ఎమోషన్స్‏తో ఆడుకుంటున్నాడు బిగ్‏బాస్ . బ్యాటరీ రీచార్చ్ టాస్క్ ఇచ్చి ఇంటి సభ్యులకు సర్ ప్రైజ్ అంటూ ఏడిపిస్తున్నాడు. ఇంటి నియమాలు ఎవరు పాటించకపోయిన బ్యాటరీ తగ్గుతుందని బిగ్‏బాస్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్‏గా ఉండి.. అందరిని గమనించాల్సిన రేవంత్.. ఆదమరిచి నిద్రపోయి రెండుసార్లు బ్యాటరీ తగ్గేందుకు కారణమయ్యాడు. ఇంటి సభ్యులకు వాళ్ల ఫ్యామిలీలతో వీడియో కాల్, ఆడియో కాల్ లేదా వాళ్లకు సంబంధించిన ఏదైన స్వీట్ మెమొరీని అందుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో రోహిత్, వాసంతి ఇద్దరికీ ట్విస్ట్ ఇచ్చాడు. బ్యాటరీ రీచార్జ్ చేసుకునే అవకాశం ఇచ్చిన బిగ్‏బాస్.. రోహిత్, వాసంతిలలో ఒకరు రెండు వారాలు నేరుగా నామినేట్ అయితే బ్యాటరీ రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది చెప్పారు. దీంతో వారిద్దరు చర్చించుకున్న అనంతరం రోహిత్ నేరుగా నామినేట్ కావడానికి డిసైడ్ అయ్యారు.

నేను చివరి సారి సుదీప కోసం సెల్ఫ్ నామినేట్ అయ్యాను. నాకు సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం ఇష్టంలేదని.. మెరీనా వెళ్లిపోయిన మీరు స్ట్రాంగ్ గానే ఉంటారు. ఇద్దరిలో ఎవరు ఉన్నా ఇద్దరూ గెలిచినట్టే అని వాసంతి చెప్పింది. అయితే రోహిత్ ఎవరి గేమ్ వాళ్లదే కానీ.. మెరీనా చాలా వీక్ గా ఉంది. నేను ఉంటే స్ట్రాంగ్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సమయంలో వెళ్లిపోతే తను ఇంకా స్లో అవుతుంది అని చెప్పాడు రోహిత్. చివరి వరకు వాసంతి తగ్గకపోవడంతో చేసేదేమి లేక రెండువారాల పాటు డైరెక్ట్ నామినేట్ అయ్యేందుకు ఒప్పుకున్నాడు రోహిత్. అయితే వీరిద్దరూ డైరెక్టర్ నామినేట్ కావడానికి ఒప్పుకోకపోయి ఉంటే ఆట మరోరకంగా ఉండేది.

ఇవి కూడా చదవండి

ఇక చివరగా.. ఫైమా. కీర్తి, వాసంతి, సూర్యలకు ఫోన్ కాల్ వస్తే.. నువ్వు వెళ్లు అంటే నువ్వు వెళ్లు అని మాట్లాడుకున్నారు. దీంతో నామినేట్ అయిన రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. నేను నామినేషన్లలోకి వెళ్లాను. నా వల్ల బ్యాటీర రీచార్జ్ అయ్యింది. కనీసం ఒక్కరు కూడా నువ్వు ఫోన్ కాల్ కు వెళ్లు అని అనలేదు. అంతా సెల్ఫిష్ గా ఉన్నారు అంటూ తన భార్య మెరీనా దగ్గర భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు అన్నం సరిపోవడం లేదని.. కాస్త ఎక్కువ పెట్టాలని కెప్టెన్ రేవంత్ ను రిక్వెస్ట్ చేశాడు ఆదిరెడ్డి. దీంతో మరోసారి ఆటిట్యూడ్ చూపించాడు రేవంత్. రైస్ వేస్ కాకుడదు.. అయితే ఒప్పుకోను అని చెప్పగా.. బియ్యం ఎక్కువగానే ఉన్నాయి కదా.. మీ కెప్టెన్సీలో అన్నం లేక ఇబ్బంది పడడం మీకు ఇష్టమా ? అని ఆదిరెడ్డి అడగడంతో మీరు ఇబ్బంది పడ్డారా ? అంటూ అడ్డంగా వాదించాడు రేవంత్. కావాలంటే నైట్ రైస్ తగ్గించుకుందాం అని శ్రీహాన్ వచ్చి చెప్పినా.. అన్నం వేస్ట్ కావడం ఇష్టం లేదని తేల్చీ చెప్పేశాడు రేవంత్. అన్నం.. రూల్స్ విషయంలో పట్టుదలగా ఉన్న రేవంత్.. కెప్టెన్‏గా నిద్రపోకూడదు అనే విషయం మాత్రం మర్చిపోయినట్లుగా తెలుస్తోంది.