Bigg Boss 5 Telugu: నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు.. దీప్తి పోస్ట్ షణ్ముఖ్ కోసమేనా ?..
బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల నుంచి ఆదరణ
బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల నుంచి ఆదరణ అందుకుంటుంది ఈషో. ఇటీవలే తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 5 ఘనంగా ముగిసింది. అయితే గత సీజన్ల కంటే సీజన్ 5 మాత్రం ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. మొదటి వారం నుంచి చప్పగా సాగిన షో.. ముగింపు దశకు వచ్చేసరికి ఈషో టీఆర్పీ పూర్తిగా మారిపోయింది. సన్నీ, షణ్ముఖ్ మధ్య జరిగిన టైటిల్ పోరు.. క్షణక్షణం మారిపోయిన ఓటింగ్స్తో బిగ్‌బాస్ విజేత ఎవరనేది విషయంపై ప్రేక్షకులను ఆసక్తి చూపించారు. అయితే ఈసారి సీజన్లో సిరి, షణ్ముఖ్ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అందరి ఆటను కనిపెడుతూ.. గేమ్ ప్లాన్స్ చేస్తూ.. బిగ్‌బాస్ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు షణ్ముఖ్. అయితే బిగ్‌బాస్‌లోకి షన్నూ ఎంట్రీ ఇవ్వగానే టైటిల్ కొట్టేస్తాడు అనుకున్నారంతా .. కానీ ఎక్కువగా ఆలోచించడం.. ఆడియన్స్ ఓటింగ్ విషయంలోనూ షన్నూ అసహనం… సిరితో పదే పదే హగ్గులు.. ముద్దులు చేస్తుండడంతో షన్నూ పూర్తిగా నెగిటివిటిని సంపాదించుకుని రన్నరప్ గా మిగిలిపోయాడు. అయితే సిరి, షన్నూ.. బయట అల్రేడి రిలేషన్ లో ఉన్నప్పటికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాం అని ఒప్పుకోవడం.. ఫ్యామిలీ ఎపిసోడ్ లో సిరి తల్లి వచ్చి హగ్ చేసుకోవడం నచ్చలేదు అని చెప్పడం.. షణ్ముఖ్ మదర్ సైతం ఎమోషనల్ అవ్వకండి అంటూ చురకలు వేసిన వీరిద్ధరి హగ్గులు మాత్రం తగ్గలేదు. అంతేకాకుండా.. ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్.. ఫ్రెండ్ షిప్ హగ్ అని చెప్పడంతో పూర్తిగా వీరిద్దరూ నెటిగివిటిని సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. షన్నూ రన్నరప్ కావడానికి సిరితో స్నేహం చేయడమే కారణమంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఇక ఇదే విషయాన్ని అరియానా ముందు కూడా షన్నూ ఒప్పుకున్నాడు. అయితే షన్నూ.. బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నప్పుడు తనపై వస్తున్న నెగిటివిటిని తగ్గించేందుకు అతని ప్రేయసి దీప్తి సునయన కూడా ప్రయత్నించింది. ఎపిసోడ్ చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయకండి అంటూ పోస్ట్స్ చేసింది. తాజాగా దీప్తి చేసిన పోస్ట్స్ మాత్రం షన్నూ విషయంలో హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆమె పెడుతున్న వరుస పోస్టులతో షన్నూ, దీప్తి ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
దీప్తి ఇన్ స్టా స్టోరీలలో.. కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు.. అని రాసుకొచ్చింది. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసనప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా.. ఈ సంవత్సరం నాకేమి బాగా అనిపించలేదు. కానీ చాలా నేర్చుకున్నాను అంటూ వరుస పోస్టులు పెట్టింది దీప్తి. దీంతో షన్నూ విషయంలో దీప్తి హర్ట్ అయినట్లుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉందా ? లేదా బ్రేకప్ చెప్పుకునేలా ఉన్నారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఈ లవ్ బర్డ్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: Anasuya: పుష్పలో దాక్షయణి పాత్రకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా ?.. ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్..