Bigg Boss telugu: ఫిబ్రవరిలో బిగ్‏బాస్ .. రాబోయే సీజన్ హోస్ట్ ఎవరో తెలుసా..

బిగ్‏బాస్ రియాల్టీ షోకు రోజు రోజుకీ ఆదరణ పెరిగిపోతుంది. ఇప్పటికే తెలుగులో 5 సీజన్లను ఘనంగా పూర్తిచేసుకుంది బిగ్‏బాస్

Bigg Boss telugu: ఫిబ్రవరిలో బిగ్‏బాస్ .. రాబోయే సీజన్ హోస్ట్ ఎవరో తెలుసా..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 24, 2021 | 8:57 AM

బిగ్‏బాస్ రియాల్టీ షోకు రోజు రోజుకీ ఆదరణ పెరిగిపోతుంది. ఇప్పటికే తెలుగులో 5 సీజన్లను ఘనంగా పూర్తిచేసుకుంది బిగ్‏బాస్. అయితే గత సీజన్ల కంటే ఈసారి సీజన్ 5 ప్రేక్షకులకు అంతగా నచ్చలేదనే చెప్పుకోవాలి. మొదటి నుంచి ఈ సీజన్ పై అసంతృప్తి ఎక్కువగా కనిపించింది. కంటెస్టెంట్స్ ఆట తీరు.. నాగార్జున హోస్టింగ్ పై అనేక రకాల కామెంట్స్ వచ్చాయి. ఇక ఎట్టకేలకు బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసింది. అయితే సీజన్ 5 గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై హోస్ట్ నాగార్జున రెండు నెలల్లో బిగ్‏బాస్ మళ్లీ రాబోతుందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే బిగ్‏బాస్ ఆరవ సీజన్ అని కొందరు అంటుండగా.. కాదు.. బిగ్‏బాస్ ఓటీటీ అంటూ మరికొందరు వాదిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు మేకర్స్ స్పందించలేదు.

గత కొద్ది రోజులుగా బిగ్‏బాస్ సీజన్ 6 గురించి నెట్టింట్లో చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు మూడు, నాలుగు, ఐదు సీజన్లకు నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించగా.. ఓటీటీలో రాబోతున్న బిగ్‏బాస్ షోకు నాగార్జున వ్యాఖ్యతగా కాకుండా.. మరో స్టార్ హీరోను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆ స్టార్ మరేవరో కాదు.. నందమూరి నటసింహం బాలకృష్ణ. అటు వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ సత్తా చాటుతున్నాడు బాలయ్య. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యతగా అన్ స్టాపబుల్ టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులను తనదైన స్టైల్లో ఇంటర్వ్యూ చేస్తూ ఆకట్టుకుంటున్నారు బాలయ్య. తాజా సమాచారం ప్రకారం బిగ్‏బాస్ ఓటీటీని బాలకృష్ణ హోస్ట్ గా చేయబోతున్నారట. బాలయ్య వ్యాఖ్యతగా బిగ్‏బాస్ షో జరిగితే టీఆర్పీ పెరిగిపోవడం ఖాయమంటున్నారు నందమూరి అబిమానులు. మరీ ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..