AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: బిగ్‏బాస్ హోస్టింగ్ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. ఇక పై ఆ ఛాన్స్..

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ఇలా భాషతో

Bigg Boss Telugu: బిగ్‏బాస్ హోస్టింగ్ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. ఇక పై ఆ ఛాన్స్..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2021 | 12:52 PM

Share

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ఇలా భాషతో సంబంధం లేకుండా బుల్లితెరపై దూసుకుపోతుంది బిగ్‏బాస్. ఇప్పటివరకు తెలుగులో ఘనంగా 5 సీజన్లను పూర్తిచేసుకుంది. ఇటీవలే సీజన్ 5 ఎంతో ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఐదవ సీజన్ విజేతగా వీజే సన్నీ నిలవగా..షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‏గా నిలిచారు. అయితే సీజన్ 5 గత సీజన్ల కంటే వరస్ట్‏గా సాగింది అనడంలో సందేహం లేదు. ఈసారి షో ప్రేక్షకులకు విసుగు పుట్టింది. కంటెస్టెంట్స్ ఎంపిక, హోస్టింగ్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. మొదటి నుంచి చప్పగా సాగిన ఈ షో.. చివరి రెండు మూడు వారాల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠను కల్గించింది. ఈసారి విన్నర్ ఎవరనే విషయం తీవ్ర సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.

షణ్ముఖ్, వీజే సన్నీ మధ్య హోరా హోరీ పోటీ సాగింది. చివరకు వీజే సన్నీ బిగ్‏బాస్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక సీజన్ 5 గ్రాండ్ ఫినాలే స్టే్జ్ పై బిగ్‏బాస్ మళ్లీ షూరు కాబోతుందని హోస్ట్ నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో మళ్లీ బిగ్‏బాస్ రియాల్టీ షో రాబోతుందని.. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు నాగార్జున తెలిపారు. అయితే బిగ్‏బాస్ సీజన్ 5 కు.. కేవలం రెండు నెలల సమయం తేడాతోనే బిగ్‏బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతుందని అంతా అనుకున్నారు. ఇదే సమయంలో బిగ్‏బాస్ సీజన్ 6 కాకుండా.. ఓటీటీలో తెలుగు బిగ్‏బాస్ షో రాబోతుందంటూ సమాచారం. బిగ్‏బాస్ ఓటీటీకి నాగార్జున కాకుండా బాలకృష్ణ హోస్టింగ్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై నాగార్జున స్పందించారు.

నాగార్జున మాట్లాడుతూ.. బిగ్‏బాస్ ప్రేమికులకు ధన్యవాదాలు. కరోనా సమయంలో బిగ్‏బాస్ అందరిని ఎంటర్ టైన్ చేసింది. నాకు వ్యక్తిగతంగా మంచి అనుభవాన్ని అందించింది. ఈ షో ఎంతో మంది జీవితాలను మార్చివేసింది. బిగ్‏బాస్ షో దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. బిగ్‏బాస్ షో 24 గంటల షో కోసం స్టార్ మా ప్రత్యేక ప్లానింగ్ చేసింది. దానికి కూడా నన్నే హోస్ట్ గా ఉండాలని కోరారు. నేను దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాను. త్వరలో బిగ్‏బాస్ 24 గంటల డిజిటల్ షోలో కలుద్ధామన్నారు నాగార్జున.

త్వరలోనే బిగ్‏బాస్ డిజిటల్ సీజన్ ప్రారంభం కానుందని.. 24 గంటలు హౌస్ నుంచి లైవ్ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని స్టార్ మా హెడ్ అలోక్ తెలిపారు.

Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..

చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?