Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. అనసూయ, సునీల్‌, ఫాహద్‌ ఫాజిల్‌

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2021 | 10:10 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. అనసూయ, సునీల్‌, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇప్పటి వరకు అన్ని వెర్షన్లలో కలిపి సుమారు రూ. 145.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌పై అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ సినిమా విడుదలకు ముందే పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారథ్యం వహించిన ఈ ఆల్బమ్‌లోని అన్నీ పాటలు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ సాధించాయి.

తాజాగా ఈ సినిమాలోని ‘చూపే బంగారమాయెనా శ్రీవల్లి..’ సాంగ్‌ మరో రికార్డు సృష్టించింది. ఈ పాటకు యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ వచ్చాయి. శ్రోతలను బాగా ఆకట్టుకున్న ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. యంగ్‌ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ అద్భుతంగా ఆలపించాడు. ఇదిలా ఉంటే హిందీలోనూ ‘పుష్ప’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ. 20.14 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. దీంతో ‘సూర్యవంశీ’ తర్వాత అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.

Also Read:

Fact Check: కొణిదెల ఉపాసన నిజంగానే ప్రధాని మోదీని కలిశారా..? ఇదిగో క్లారిటీ

Niharika: బాబాయి ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్‌ బద్దలవడం పక్కా.. భీమ్లానాయిక్‌ వాయిదాపై మెగా డాటర్‌ ..

Allu Sneha and Samantha: బ్లాక్‌ శారీలో మెరిసిపోయిన బన్నీ సతీమణి.. కామెంట్‌ చేసిన సమంత..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!