Niharika: బాబాయి ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్‌ బద్దలవడం పక్కా.. భీమ్లానాయిక్‌ వాయిదాపై మెగా డాటర్‌ ..

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన ‘భీమ్లానాయక్‌’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'రాధేశ్యామ్‌' వంటి పాన్‌ ఇండియా సినిమాలను దృష్టిలో ఉంచుకుని జనవరి 12న

Niharika: బాబాయి ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్‌ బద్దలవడం పక్కా.. భీమ్లానాయిక్‌ వాయిదాపై మెగా డాటర్‌ ..
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2021 | 8:31 PM

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన ‘భీమ్లానాయక్‌’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ వంటి పాన్‌ ఇండియా సినిమాలను దృష్టిలో ఉంచుకుని జనవరి 12న విడుదల కావాల్సిన ‘భీమ్లానాయక్‌’ చిత్రాన్ని ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. కాగా పవన్‌ సినిమా విడుదలపై తాజాగా మెగా డాటర్‌ నటి నిహారిక స్పందించింది. ఈ సందర్భంగా ‘గోపాల గోపాల’ సినిమాలో తన బాబాయి చెప్పిన డైలాగ్‌ను గుర్తుచేసింది. ‘భీమ్లానాయక్‌’ ఎప్పుడొచ్చినా సూపర్‌ హిట్‌ అవుతుంది . ‘ అదేదో సినిమాలో మా బాబాయ్‌ చెప్పినట్టు.. ‘రావడం కాస్త లేటు కావొచ్చు.. కానీ రావడం మాత్రం పక్కా’. అదే మాదిరిగా బాబాయి సినిమా విడుదల కాస్త ఆలస్యం కావొచ్చు. కానీ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా’ అని నిహారిక చెప్పుకొచ్చింది.

తారక్‌ అన్న సతీమణి నా క్లాస్‌మేట్.. ఈ సందర్భంగా తన సోదరుడు రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాపై కూడా స్పందించింది నిహా. ‘తారక్‌ అన్న నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. ఆయన సతీమణి ప్రణతి నా క్లాస్‌మేట్. ఆయన ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ ట్రైలర్‌ వీక్షించాక చరణ్‌ని ప్రత్యేకంగా కలిసి అభినందనలు చెప్పాను. ఇటీవల ఓ థియేటర్‌లో ఆ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే నాకు ఒళ్లు గగుర్పొడిచింది. చరణ్‌ సోదరిగా ఈ మాట చెప్పడం లేదు. ఒక ప్రేక్షకురాలిగా చెబుతున్నా. అభిమానుల్లాగే నేనూఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని మెగా డాటర్‌ పేర్కొంది.

Also Read:

Allu Sneha and Samantha: బ్లాక్‌ శారీలో మెరిసిపోయిన బన్నీ సతీమణి.. కామెంట్‌ చేసిన సమంత..

Radhe Shyam: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌పై రాధేశ్యామ్‌ స్పెషల్‌ షోస్‌.. అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం..

Amrapali Gan: మరో అంతర్జాతీయ కంపెనీ అధిపతిగా భారతీయ మహిళ.. ఓన్లీ ఫ్యాన్స్‌ సీఈవోగా ఆమ్రపాలి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే