AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Sneha and Samantha: బ్లాక్‌ శారీలో మెరిసిపోయిన బన్నీ సతీమణి.. కామెంట్‌ చేసిన సమంత..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డికి సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తన పిల్లలు అర్హ, అయాన్‌ ఫొటోలు, వీడియోలను క్రమం తప్పకుండా షేర్‌ చేసుకుంటుంది. అదేవిధంగా తన ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను పంచుకుంటుంది

Allu Sneha and Samantha: బ్లాక్‌ శారీలో మెరిసిపోయిన బన్నీ సతీమణి.. కామెంట్‌ చేసిన సమంత..
Basha Shek
|

Updated on: Dec 23, 2021 | 8:00 PM

Share

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డికి సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తన పిల్లలు అర్హ, అయాన్‌ ఫొటోలు, వీడియోలను క్రమం తప్పకుండా షేర్‌ చేసుకుంటుంది. అదేవిధంగా తన ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను పంచుకుంటుంది. ఇవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టకుంటున్నాయి. అందుకే సినిమా హీరోలకు సమానంగా సోషల్‌ మీడియాలో క్రేజ్‌ను సొంతం చేసుకుంది స్నేహ. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 6.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారంటే ఆమె ఫాలోయింగ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కాగా తాజాగా స్నేహరెడ్డి తన ఫ్యాషనబుల్‌ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. వీటిపై అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ ఫొటోల్లో ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మల్హోత్ర డిజైన్ చేసిన నలుపు రంగు చీరలో ఎంతో అందంగా కనిపించింది స్నేహ. ఇక్కడ మరొక విషయమేమిటంటే సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ స్నేహకు కూడా స్టైలింగ్‌ చేశారు. ఇలా ఎంతో అందంగా ముస్తాబైన తన ఫొటోలను స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రముఖ హీరోయిన్‌ సమంత అయితే ‘హాట్‌’ అంటూ కామెంట్‌ పెట్టడం విశేషం. కొందరు నెటిజన్లు ‘సో క్యూట్‌’ అని స్పందించగా.. మరికొందరు ‘మీరెందుకు హీరోయిన్‌ కాకూడదు’ అని కామెంట్లు పెట్టారు. కాగా అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టిన ఈ పాట ప్రస్తుతం ‘పుష్ప’ థియేటర్లను ఊపేస్తోంది.

Also Read:

Radhe Shyam: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌పై రాధేశ్యామ్‌ స్పెషల్‌ షోస్‌.. అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం..

Manipur Assembly Election 2022: మణిపూర్‌లో 8,650 లైసెన్సెడ్‌ తుపాకుల స్వాధీనం.. ఎన్నికల ప్రచారంలో హింసను అరికట్టేందుకే..

Amrapali Gan: మరో అంతర్జాతీయ కంపెనీ అధిపతిగా భారతీయ మహిళ.. ఓన్లీ ఫ్యాన్స్‌ సీఈవోగా ఆమ్రపాలి..