AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌పై రాధేశ్యామ్‌ స్పెషల్‌ షోస్‌.. అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం..

'బాహుబలి' సిరీస్‌, 'సాహో' సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. తన స్టార్‌డమ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది

Radhe Shyam: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌పై రాధేశ్యామ్‌ స్పెషల్‌ షోస్‌.. అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం..
Radhe Shyam Imax
Basha Shek
|

Updated on: Dec 23, 2021 | 6:22 PM

Share

‘బాహుబలి’ సిరీస్‌, ‘సాహో’ సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. తన స్టార్‌డమ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వింటేజ్‌ లవ్‌స్టోరీ నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే ఇంద్రజాలికుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా రాధేశ్యామ్‌’ సినిమా కోసం ఆస్ట్రేలియాలో స్పెషల్‌ షోలు వేయనున్నారు. అది కూడా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌పై.

మెల్‌బోర్న్‌ నగరంలోని ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. 105*75 అడుగులున్న ఈ ఐమ్యాక్స్‌ థియేటర్‌ కొద్ది కాలం క్రితం వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌గా ఉండేది. అయితే జర్మనీలో 144*75 ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌ ఏర్పాటుకావడంతో మెల్‌బోర్న్‌ ఐమ్యాక్స్‌ రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పుడీ ఈ భారీ తెరపైనే ‘రాధేశ్యామ్‌’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ కోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా ఏర్పాటుచేసింది. జనవరి 14న ఉదయం 7.30 గంటలకు ‘రాధేశ్యామ్’ స్పెషల్‌ షో మొదలవుతుంది. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరణ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హైదరబాద్‌లోని రామోజీఫిల్మ్‌ సిటీలో నేడు (డిసెంబర్‌ 23) ఈ సినిమా ప్రి రిలీజ్‌ ఈవెంట్ జరుగుతోంది.

Also Read:

Radhe Shyam Pre Release Event Live: ఘనంగా రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Sara Ali khan: ఆ సినిమా పరాజయం తర్వాత ఇబ్బందికర కామెంట్లు ఎదుర్కొన్నాను.. చేదు అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకున్న సారా..

Rashmika Mandanna: సినిమా తారలు పడే కష్టాలను బయటపెట్టిన రష్మిక.. అది చాలా బాధ పెడుతోందంటోన్న శ్రీవల్లి