Sara Ali khan: ఆ సినిమా పరాజయం తర్వాత ఇబ్బందికర కామెంట్లు ఎదుర్కొన్నాను.. చేదు అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకున్న సారా..

సైఫ్‌ అలీఖాన్‌ తనయగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది సారా అలీఖాన్‌. 'కేదార్‌నాథ్‌'తో కెరీర్‌ ప్రారంభించిన ఆమె 'సింబా' సినిమాతో కెరీర్‌ ప్రారంభంలోనే రెండు వరుస హిట్లు సొంతం చేసుకుంది

Sara Ali khan: ఆ సినిమా పరాజయం తర్వాత ఇబ్బందికర కామెంట్లు ఎదుర్కొన్నాను.. చేదు అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకున్న సారా..
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2021 | 5:27 PM

సైఫ్‌ అలీఖాన్‌ తనయగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది సారా అలీఖాన్‌. ‘కేదార్‌నాథ్‌’తో కెరీర్‌ ప్రారంభించిన ఆమె ‘సింబా’ సినిమాతో కెరీర్‌ ప్రారంభంలోనే రెండు వరుస హిట్లు సొంతం చేసుకుంది. అయితే ఆతర్వాత చేసిన ‘లవ్‌ ఆజ్‌ కల్‌2’, ‘కూలీ నంబర్‌ 1’ సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ముఖ్యంగా ‘సింబా’ లాంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత చేసిన ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. యంగ్‌ హీరో కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. దీనికి తోడు సినిమా విడుదలైన తర్వాత సారా నటన బాగోలేదని, ఓవర్‌ యాక్షన్‌ చేస్తోందని కొందరు విమర్శలు గుప్పించారు.

అదేవిధంగా ఈ సినిమా షూటింగ్‌ సమయంలో కార్తిక్‌, సారాల మధ్య ప్రేమ చిగురించిందని, వారు రిలేషన్‌షిప్‌లో మునిగితేలుతున్నారన్న రూమర్లు వినిపించాయి. కాగా తన తాజా చిత్రం ‘అత్రంగిరే’ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటోన్న సారా ఈ వ్యాఖ్యలపై స్పందించింది. ‘ లవ్‌ ఆజ్‌ కల్‌ 2 పరాజయం తర్వాత నేను కొన్ని అసభ్యకర కామెంట్లు, విమర్శలు ఎదుర్కొన్నాను. ఈ సినిమా తర్వాత సారా ఎక్స్‌పోజింగ్‌ చేస్తుందని సినీ విమర్శకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు నన్నెంతగానో బాధించాయి. అదేవిధంగా సినిమాలో నా యాక్టింగ్‌ బాగోలేదని కొందరు కామెంట్లు చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి విమర్శలు, కామెంట్లు సహజమేనని తొందరగానే తెలుసుకున్నాను. ఆ వ్యాఖ్యలను మర్చిపోయేందుకు ప్రయత్నించాను’ అని సారా చెప్పుకొచ్చింది. కాగా కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌, అక్షయ్‌కుమార్‌లతో కలిసి సారా నటించిన ‘అత్రంగి రే’ రేపు (డిసెంబర్‌ 24)న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read:

Rashmika Mandanna: సినిమా తారలు పడే కష్టాలను బయటపెట్టిన రష్మిక.. అది చాలా బాధ పెడుతోందంటోన్న శ్రీవల్లి

Hero Nani: ‘డబ్బుపై ఆశతోనే..’ నాని కామెంట్స్‌పై ఘాటుగా రియాక్టయిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే విష్ణు..

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..