Bigg Boss 5 Telugu: ఎలిమినేషన్‏లో షాకింగ్ ట్విస్ట్.. ఇంటి నుంచి బయటకు వచ్చిన యాంకర్ ?..

బిగ్‏బాస్ 12 వారం నామినేషన్స్ ప్రక్రియ సమయం దగ్గరపడుతుంది. ప్రస్తుతం బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. దీంతో

Bigg Boss 5 Telugu: ఎలిమినేషన్‏లో షాకింగ్ ట్విస్ట్.. ఇంటి నుంచి బయటకు వచ్చిన యాంకర్ ?..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 27, 2021 | 9:45 PM

బిగ్‏బాస్ 12 వారం నామినేషన్స్ ప్రక్రియ సమయం దగ్గరపడుతుంది. ప్రస్తుతం బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. దీంతో టాప్ 5లో ఉంటే చాలు అనుకుంటున్నారు కంటెస్టెంట్స్. ఇక మరికొందరు ఎప్పుడు వెళ్ళిపోతాం అంటూ టెన్షన్ పడుతూ గడిపేస్తున్నారు. ఇక ఈ వారం యాంకర్ రవి, కాజల్, ప్రియాంక, సిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్ నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ టెన్షన్ ఓవైపు ఉండగా.. మరోవైపు కుటుంబసభ్యులను ఇంట్లోకి పంపి ఎమోషనల్ టచ్ ఇచ్చారు బిగ్‏బాస్. అయితే గత కొద్ది రోజులుగా ఈ వారం ప్రియాంక ఎలిమినేట్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపించింది.

ప్రస్తుతం నామినేట్ అయిన సభ్యులలో ప్రియాంక, సిరి, కాజల్ డేంజర్ జోన్‏లో ఉన్నారని.. వీరిలో తక్కువ ఓట్లు ప్రియాంకకు రావడంతో ఆమె ఎలిమినేట్ అవుతుందంటూ టాక్ వినిపించింది. దీంతో ఈసారి ప్రియాంక ఇంటికి బై చెబుతుందని అనుకున్నారు అంతా. కానీ తాజా సమాచారం ప్రకారం ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియలో పెద్ద ట్విస్ట్ జరిగిందట. ఈవారం యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్టుగా సమాచారం. ఓటింగ్ పరంగా చూసుకుంటే యాంకర్ రవి సేఫ్ జోన్లో ఉన్నారు. అంతేకాకుండా.. సిరి, ప్రియాంక, కాజల్ కంటే రవికి ఫాలోయింగ్ ఎక్కువే ఉన్నారు.

ఇక టాస్కుల పరంగా చూసుకుంటే సిరికి ఎలాంటి ఢోకా లేదు.. కేవలం షణ్ముఖ్‏తో ఫ్రెండి షిప్.. శ్రుతిమించిన ప్రవర్తనతో పూర్తిగా ఆమెపై నెగిటివిటి వచ్చేసిందంటున్నారు నెటిజన్స్. అలాగే కేవలం మానస్ కోసమే గేమ్ ఆడడం.. ప్రతిసారి తన వెంటే ఉండడంతో ప్రియాంక పై కూడా పూర్తిగా ఓటింగ్ ప్రభావం చూపించింది. ఇక ఓట్స్ కూడా ప్రియాంకకు తక్కువగా రావడంతో ఆమె ఎలిమినేట్ అవుతుందనుకున్నారు. అయితే ఈసారి నెటిజన్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడని.. చివర్లో కాజల్ రవి ఉండగా.. కాజల్ ను సేవ్ చేసి… రవిని ఎలిమినేట్ చేసినట్టుగా లీక్ బయటకు వచ్చింది. దీంతో రవి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకవుతున్నారు. ప్రియాంక, కాజల్, సిరి కంటే తక్కువ ఓట్స్ రావడం వల్లే యాంకర్ రవి బయటకు వెళ్లాల్సి వచ్చిందని.. కానీ ఆ ముగ్గురి కంటే రవి స్ట్రాంగ్ అని.. ఓట్లు తక్కువగా వచ్చాయంటే నమ్మశక్యంగా లేదంటూన్నారు. దీంతో సోషల్ మీడియాలో రవి ఎలిమినేషన్ పై రచ్చ మొదలైంది. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రవి అభిమానులు. ఇక యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా ? లేదా ? అనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: చలికాలంలో బెల్లం, నల్ల మిరియాలు కలిపి తీసుకుంటే ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..

RRR: ఐటెం సాంగ్ ఉందా మావా ?.. నెటిజన్ ప్రశ్నకు  కౌంటరిచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?